Wednesday, 18 January 2017

7th Chakra బ్రహ్మ శరీరం (Cosmic Body

7th Chakra బ్రహ్మ శరీరం (Cosmic Body) : అజ్ఞా చక్రం నిర్వాణ శరీరం : సహస్రారం
ఇక్కడ కూడా ద్వంద్వ ప్రవృత్తి ఉండదు. అయిదవ మండలంలో అనుభవించిన ఆనంద స్తితి ఆత్మవ న్నత్యంగా మారితే ఆరవ శరీరం ఏర్పడినట్లు. ఇక్కడ ' నేను ' అన్నది ఉండదు. అస్మిత స్థితి సైతం లయించిపోతుంది. ' తత్వమసి ' అనేది అనుభూతికి అందుతుంది. అయితే అది అనుభూతి కాదు నిజానికి. తత్తుల్యమైన దివ్యాత్మానుభూతి. దివ్యానుభూతి ఇది అని చెప్పడానికి వీలులేనిది. సత్యాన్ని నేరుగా అందుకునే చైతన్యం అది. ' నేను ' ఆత్మగా మారి, ఆ రెండూ కానిదేదో అయిపోయి, బ్రహ్మ్మంలో లీనం కావడం వంటిది.
' అహం బ్రహ్మ్మస్మి ' అనే పర జ్ఞానం కలిగిన తరువాత అహం లయిస్తుంది. ' నేను ' అనే అస్తిత్వ స్పృహ పోతుంది. అంతా బ్రహ్మ్మమయం అనే భావన మిగులుతుంది. బ్రహ్మ్మంలో అహం సైతం కలిసి, కరిగిపోయి బ్రహ్మ్మం మాత్రమే మిగులుతుంది. అదే బ్రహ్మ్మత్వ సిద్ధి. అదే బ్రహ్మ్మీస్థితి.
ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు! 'అహం బ్రహ్మ్మస్మి ' - నేను బ్రహ్మ్మాన్ని సరే. ' నేను ' లేకుండా బ్రహ్మ్మం మాత్రమే మిగిలినప్పుడు ' అహం ' ఏమైనట్లు? నేను ఏమైనట్లు? ఈ సాధన, యోగం, తపస్సు అంతా అలా లయించడానికా? బ్రహ్మ్మంలో లయించి ఏమీ కాకుండా, ఏమీ మిగలకుండా పోతే ఏమీ సాధించినట్లు? ఏమి ప్రయోజనం? మనం ఏ గమ్యం చేరుకున్నట్లు?
గమ్యం మనకి కాక, ఆత్మకి కాక, మరెవరికి? అగమ్యమే గమ్యమా? బ్రహ్మ్మం అంటే పూర్ణం అని అంటారు. బ్రహ్మ్మమే సత్యం. బ్రహ్మ్మమే సృష్టికి మూలం, ఆధారం, సృష్టి రహస్యం. అయితే సృష్టి రహస్యాన్ని చేదించినట్లు అవుతుందా! ఏం సాధించినట్లు?
ఈ సందేహాలతో సాధన అక్కడ ఆగిపోతుంది. 12,000 జన్మలెత్తినా, మళ్ళీ మళ్లీ మొదటికి వచ్చినట్లు అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఆపైన తెలుసుకునేది ఏమి లేక. బ్రహ్మ్మాన్ని తెలుసుకున్న యోగి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. తానే బ్రహ్మ్మం అయినప్పుడు, బ్రహ్మ్మమే తానని తెలుసుకోవడంతో అన్వేషణ పూర్తి అయినట్లే గదా! ఇంక గమ్యం ఏమిటి? అది అంతం లేని బ్రహ్మ్మమే తానైనప్పుడు తానే అనంతుడు, సర్వ సాక్షి అవుతాడు.
ఈ బ్రహ్మ్మాన్ని సైతం అధిగమించి పైకి పోతే నిర్వాణ శరీరం. అది కనిపించేది కాదు. కానీ అది అదే. ఏమీ కిగాలకపోవడమే నిర్వాణ స్థితి. దీనికి కేంద్రం సహస్రారం. దీనిని చక్రంగా వర్ణించడం జరగని పని. ఆరవదైన ఆజ్ఞా చక్రం వరకే మన ప్రజ్ఞ పనికొస్తుంది, పనిచేస్తుంది. ఎన్ని అనుభవాలు పొందినా, అనుభూతులకు లోనైనా సాధకుడు యోగంలో లయిన్చినప్పుడు సహస్రారం పై నిలుస్తాడు. అక్కడ చేసే ధ్యానం, ధారణా ఏమీ ఉండవు. అది సాధకుని cosmos తో సంధానపరుస్తుంది. ఇహానికి, పరానికి వారధి కేంద్ర బిందువు. దానిని మూడవ నేత్రంతో దర్శించవచ్చు. మూడవ కంటితో చూడగలిగితే మనం త్రినేత్రులం అవుతాం. అది ఈశ్వరీయత.
In general about our inner bodies and chakras:
మొత్తం ఆరు చక్రాలు, ఏడు శరీరాలు, వీటిలో కలిగే అవరోధాలు కానీ, అనుకూలాలు గాని ఏవీ బయట ప్రపంచానికి సంభంధించినవి కావు. అన్నీ లోపల్లోపల జరిగే మార్పులు. శోధన మనది, పరిశోధనా మనదే. మనం లోగడ తెలుసుకున్నవి, విన్నవి మన శోధనకు ఉపకరిస్తాయి. అనుభవంతో కన్నది మాత్రమే పరిశోధన. బయట నుండి ఆర్జించిన విజ్ఞానం మొత్తం తిరిగి బయటకే వెళ్లి పోతుంది. లోపల దానికి స్టానం ఉండదు. ఏదైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం వరకే అది పరిమితం. అంతటితో తృప్తి పడి, చతికిల పడితే ఏమీ లాభం లేదు. ఈ తర్వాత అంతశోధన, ఉపక్రమించాలి. అందుకు సాధన అవసరం. ధ్యానం ఆలంబనం. అంట స్సోధన, సాధన మాత్రమే మనల్ని అంతర్ జగత్తుకు పరిచయం చేయగలవు.

అలా లోపలకు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క చక్రం అనుభూతికి అందుతుంది. అనుభవాలు కలిగిస్తుంది. మంచి, చెడులు రెండూ మనవే. మనమ్గానే అనుభవించాలి. అనుభూతుల్ని మాత్రం మనలో మిగుల్చుకొని భద్రపరుచుకోవాలి. ప్రకృతి సహజంగానే ప్రతి మనిషికి కొంత శక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, ఉన్నా శక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మ శక్తిని పెంపొందిన్చుకోగాలగాలి. ఉత్తినే చేతులు ముడుచుకు కూర్చుంటేఏ దేవుడు దయతలచాడు, కరుణించాడు, వరాలివ్వాడు. కనీసం ఒక మహ్హత్ముని అనుగ్రహానికి పాత్రులం కావాలన్నా మన అర్హతను నిరూపించుకోవాలి. అపాత్రదానం ఎవరూ చెయ్యరు, చేయకూడదు.
ప్రాచీన యోగ సాహిత్యం అయిదవ చక్రం వరకే చెప్పగలిగింది -
ఆ తరువాతనే అసలు ' సత్యం ' తెలుస్తుంది. అందుకే సత్యాన్ని ఎవరికీ వారు తెలుసుకోవాలని చెప్పేది.
అయుదారు శరీరాల వరకు వెళ్ళ గలిగితే యోగి.
నాలవ శరీరం వరకు సాధకుడు.
ఆ తర్వాత మెట్టు నుండి ప్రతి సాధకుడు యోగి అవుతాడు. పుణ్య లోకాలు చేరుకుంటాడు.
దివ్యలోకాల్ని స్వర్గం అనవచ్చునేమో. దేవుడు, దేవత రెండూ ఒక్కటే అనుకుందాం. కామరూపుడై ఉంటాడు కనుక, కోరిక తీరే వరకు ఆ స్వర్గంలో ఉంటాడు. అక్కడ మృత్యువు ఉండదు కనుక ఇష్టమైనప్పుడు తిరిగి మానవ జన్మకు రావడమే.

ప్రతి దేవుడు, దేవత నిర్వాణ స్థితికి చేరాలంటే తిరిగి మానవ జన్మకు వచ్చి, భొతిక శరీరం ధరించి యోగం చేయవలసి వుంటుంది.
అయిదవ శరీరం పొందిన యోగి భౌతిక శరీరంలోకి రానవసరం లేదు.

ఆరవ చక్రం వరకు వెళ్ళినవారు, ఆత్మ శరీరం పొందిన యోగులు దేవతా రూపాల్ని ఆశించరు. స్వర్గాన్ని నివాసం చేసుకోరు. వారికి ఎలాంటి శరీరాలు అవసరం లేదు.
వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇద , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూలశరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం .
1. తలనుంచి కటి భాగందాకా వెళ్లే ఈ చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అనే బిందువును ప్రతిబింబిస్తుంది. అంతే కాదు స్వీయ జ్ఞానమయమైన ఒక దివ్యానందపు అనుభూతిని, ఒక మహోన్నతమైన ఆలోచనను, విఽశ్వైక్య భావనను కలిగిస్తుంది.

2. ఆజ్ఞ చక్రం
ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండే మూడవ నేత్రం. దీన్ని భృకుటి చక్రంగానూ, మూడో చక్రంగానూ పరిగణిస్తారు. ఇది బాహ్యనేత్రంతోనూ, మనస్సాక్షి ఆధారంగానూ చూసే ప్రక్రియకు సంబంధించినది. ఇది మన మనో విజ్ఞాన అంశాల్ని, ఆర్కీటైపల్ స్థాయి అవగాహనా ద్వారాలు తెరిపిస్తుంది. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతాం. ఆజ్ఞచక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. విషయాల్ని లోతుగా అర్థం చేసుక
3. విశుద్ధ చక్ర
ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఇది భావ వ్యక్తీకరణ, సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించినది. ఇక్కడ ప్రపంచాన్ని ప్రతీకాత్మకంగా, అంటే శబ్ద, భాష ప్రకంపాల ద్వారా తెలుసుకోగలుగుతాం. సృజనాత్మక ఐక్య భావనను, స్వీయ వ్యక్తీకరణ శక్తినీ ఇది పెంచుతుంది.

4 అనాహత చక్ర
ఈ చక్రాన్ని హృదయ చక్రం అని కూడా పిలుస్తారు. ఇది ఏడు చక్రాలకు మధ్యన ఉంటుంది. ఇది ప్రేమ సంబంధితమైనది. ఇది శరీరానికీ -మనసుకూ, పురుషుడికీ- సీ్త్రకీ , అస్తిత్వానికీ- నీడకు, అహానికీ-ఏకత్వానికీ మధ్యనుండే వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. ఇది గాఢమైన ప్రేమానుభూతికీ, అంకిత భావాన్నీ, లోతైన ఒక ప్రశాంత స్పృహనూ, అందులో మమేకమయ్యే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్నీ, ఽధైర్యాన్నీ నింపుతుంది. విషయాల్ని సహజంగా, యధాతథంగా స్వీకరించే మానసిక దిటవునూ పెంచుతుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమాజంలో మమేకమయ్యే శక్తిని కూడా కలిగిస్తుంది.
5 మణిపూర చక్ర
దీన్ని శక్తి చక్ర అని కూడా పిలుస్తారు. ఇది మన అంతర్గత శక్తిని నడిపిస్తుంది. మన శరీర వ్యవస్థనూ, జీవక్రియల్ని సైతం నియంత్రిస్తుంది. ఇది శరీరానికి అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ప్రభావవంతంగా ఉండేలా, తక్షణమే స్పందించేలా చేస్తుంది. ఎవరి మీదా ఆధిపత్యం లేని నైజాన్ని పెంపొందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, శ్రమ, విశ్రాంతుల తోడ్పాటుతో శరీరంలోని ప్రాణశక్తిని నిలబెడుతుంది. అహాన్ని గుర్తించడంతో పాటు, స్వీయ విశ్లేషణకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది.

6. స్వాదిష్టాన చక్ర
ఇది. పొట్ట, కటి భాగం, లైంగిక అవయవాలకు సంబంధించినది. భావోద్వేగాలకు, లైంగిక విషయాలకు సంబంధించినది. ఇది అనుభూతులు, కోరికలు స్పందనలు, కదలికల ద్వారా ఇతరులతో సంబంధం పెంచుకుంటుంది. ఇది కాంతినీ, అనుభూతుల్లో గాఢతనూ, లైంగిక సంతృప్తినీ, మార్పును స్వీకరించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. స్వాదిష్టాన చక్రం మేధోపరమైన స్వచ్ఛతను, జ్ఞాపకశక్తినీ, సక్రమమైన, స్వచ్ఛమైన ఆలోచనల్నీ కలిగిస్తుంది. భావోద్వేగాలతో మమేకమై, గొప్ప ఆనందానికి పాత్రమయ్యేలా చేస్తుంది.
వెన్నెముక మొదట్లోనే ఈ చక్రం ఉంటుంది. ఇది భూమికి అనుబంధమైనది. ఇది మన మనుగడ గురించిన స్పృహను కలిగిస్తుంది. పునాది లాంటిది. ఇది ఆరోగ్యాన్నీ, సంపన్నతను, బధ్రతను, చలాకీతనాన్నీ కలిగిస్తుంది. నిర్భయత్వాన్నీ, సురక్షిత భావాన్నీ, భౌతిక ఐక్య భావనను, స్వీయ రక్షణా శక్తినీ కలిగిస్తుంది. వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే నాలుగు రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు వేల జపములు జరుగును. మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై గుహ్యమందున నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగును. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడంగులములలో నాభి నందున ఒక అగ్ని నిలయమై మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
నాలుగవది అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.

విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన పన్నెండు అంగులములలో కంఠం నందున వుంటుంది. పదహారు దళములుంటాయి. రెండు ఘడియల నలభై అయిదు విఘడియలకు వేయి హంస జపములు జరుగుతుంది. అధినాయకుడు జీవుడు.
ఆజ్ఞేయ చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి హంస జపములు జరుగును. దీనికి సర్వేశ్వరుడు అధిష్టాన దేవత.
సహస్రారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, నడి నెత్తిన బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది. ఓంకారము ధ్వనించుచుండును. రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును. గురుమూర్తి అధిష్టాన దేవత.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది”
ఏకాగ్రతతో మనసు నిలిపివింటే ఓంకారము వినిపిస్తుంది. అదే విధముగా భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపితే పరంజ్యోతి కనిపిస్తుంది. ఆ చిదానంద మూర్తిని దర్శించితే ముక్తి ప్రాప్తిస్తుంది.

పైన తెలిపిన చక్రాలు ముఖ్యమైనవి ఇవికాక శరీరమంతా విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి’చక్ర’లు. అరచేతి వేళ్ల చివర్లలో సైతం చక్రాలు వుంటాయి. అరచేతిలో రెండు చక్రాలుంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు వుంటాయి.
బహిర్గతంగా వుండే చెడుశక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేసేందుకు ఈ చక్రాలే కారణం . ఇవి బలహీనపడితే వ్యాధులు ప్రబలుతాయి. ఏ భాగంలో వుండే చక్ర బలహీనపడితే అక్కడ 6వుండే శరీరభాగం దెబ్బతింటుంది. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా కేవలం రెండు లేక మూడు చక్రాలు మాత్రమే బాగా క్రియాశీలకంగా వుంటాయి. మిగిలినవి సాధారణస్థితిలో వుంటాయి. ఏయే చక్రాలు చురుకుగా వుంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పని చేసి కొన్ని రంగాలలో బాగా రాణిస్తారు.
శరీరంలో వుండే ఏడు ప్రధాన చక్రాలలో మొట్టమొదటిది మూలస్థానంలో వుంటుంది. మొత్తం ఈ ఏడు చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపటం ద్వారా జీవశక్తిని అందిస్తాయి. ఈ ఏడు చక్రాలలో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు.
కాలివేళ్ళు, చేతివేళ్ళలో ఏడు చిన్న చక్రాలున్నాయి. ఏడు చక్రాలు శక్తిమయ దేహంలోవున్న ఏడు పొరలతో అనుసంధానం కలిగివుంటాయి. విశ్వంలోని విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధానచక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈసప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించివున్న విశ్వశక్తిని గ్రహించి భౌతిక శరీరానికి అందించటం ద్వారా శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చక్రాలు మూలస్థానం నుంచి చివరివరకు చూస్తే ఒక శంఖు ఆకారాన్ని పోలి వుంటాయి. చక్రం చివరి భాగం శరీరం బైటకు వుండి శక్తి మయ శరీరంలోని ఏదో ఒక అంశతో అనుసంధానాన్ని కలిగివుంటుంది.

శరీరంలోని నేత్రాలు, మెదడు, హృదయం, జీర్ణవ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, జననాంగ వ్యవస్థలతో చక్రాలు సంబంధాన్ని కలిగివుంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించేందుకు ఇవి అత్యంత ఆవశ్యకాలు. ఏయే చక్రాలు అత్యంత క్రియాశీలంగా వున్నాయో తెలుసుకోవటం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు. వ్యక్తిత్వ లక్షణాలను, ప్రవర్తనా తీరును నిర్దేశించేవి ఆయా భాగాలకు అనుసంధానం చేయబడిన చక్రాలు. ఏదైనా ‘చక్ర’ బలహీనపడినట్టైతే సంబంధిత శరీరభాగం కూడా బాగా దెబ్బతింటుంది.
ఇది బాగా క్షీణ దశకు చేరుకున్న సమయంలో వ్యాధి రూపంలో భౌతిక శరీరంలో బహిర్గతమవుతుంది. నిజానికి వ్యాధి మూలం భౌతిక శరీరంలో వుండదు. సంబంధిత ‘చక్ర’కు విశ్వశక్తిని అందించటం ద్వారా రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. ఫలితంగా భౌతిక శరీరం వ్యాధిని నిర్మూలించటమే కాకుండా చురుకుగా పనిచేస్తుంది.

focus on corresponding chakra and meditate using any of the beejaksharams.
బీజాక్షర వివరణార్థములు:

వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి(Positive energy) క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును. బీజమంత్రములు అనేవి స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.

అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె. యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది.

ఓం:

‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓంకారము. ‘అ’ కారము ఋగ్వేదమునకు, ‘ఉ’ కారము సామవేదమునకు, మరియు ‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక. సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.

క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం :

ఇది కాళీమాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

శ్రీం లేదా వం :

ఇది మహాలక్ష్మి బీజమంత్రము.
ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్రపిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి,  విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల భార్య లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రౌం లేదా దూం లేదా రం:

ఇది శివ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ మణిపురచక్రములో చేయవలయును. మణిపురచక్రము అగ్ని తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆత్మనిగ్రహశక్తి వృద్ధి చెందును. అకాల మరణము, చక్కర (diabetes) వ్యాధినుండి రక్షణ, మోక్షమునకు మార్గము లభించుట ఆరోగ్యము, అంగములలో బలము, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల బార లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రీం లేక ఐం లేక యం:

ఇది మహామాయ లేక భువనేశ్వరీ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ అనాహతచక్రములో చేయవలయును. అనాహతచక్రము వాయు తత్వమునకు ప్రతీక. తద్వారా బీజశక్తి(root power) వృద్ధి చెందును. తద్వారా ప్రాణశక్తి నియంత్రణ వృద్ధి చెందును. వాయుప్రకోపనముల (gastric disturbances) వ్యాధులనుండి రక్షణ, నాయక లక్షణములు కలుగుట ఏర్పడును.

గం లేక ఫ్రౌం లేక హమ్:

ఇది గణపతి, కుండలినీ, మరియు హనుమాన్ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ విశుద్ధ చక్రములో చేయవలయును. విశుద్ధ చక్రము ఆకాశ తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.

దం లేక ఓం:

ఇది విష్ణు బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ ఆజ్ఞా చక్రములో చేయవలయును. ఆజ్ఞా చక్రము కృష్ణ తత్వమునకు ప్రతీక. తద్వారా శుద్ధ జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.

క్ష్రౌం లేక రాం : ఇది నరసింహ బీజమంత్రము.

ఈ బీజాక్షర ఉచ్చారణ సహస్రార చక్రములో చేయవలయును. తద్వారా సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును మరియు సాధకుడు స్వయముగా సాక్షీభూతుడు అగుతాడు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles