దేవాసుర సంగ్రామం తరువాత అంత పెద్ద ఎత్తున జరిగిన మహాసంగ్రామమే కురుక్షేత్ర యుద్ధము. ఈ భూమిపై జరిగిన అతి పెద్ద, ఘోర, భీకరమైన సంగ్రామము కౌరవ పాండవుల మధ్య జరిగింది. ఈ యుద్ధములో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు వరుసగా 10, 5, 2, అర్థ దినములు కౌరవసేనకు నాయకత్వం వహించారు. మిగిలిన సగము రోజు భీమ దుర్యోధనుల మధ్య జరిగింది. ఈ మహా యుద్ధములో పాండవ పక్షమున ఏడూ అక్షౌహిణులు కొరవ పక్షమున పదకొండు అక్షౌహిణులు సైన్యము పాల్గొన్నారు. శమంతక పంచకము అనే ప్రదేశములో 18 రోజుల పాటు 18 అక్షౌహిణుల సైన్యము మరణించారు.
త్రేతాయుగము ద్వాపర యుగముల సంధి కాలముననందు పరశురాముడు ఇరువది ఒక్క మార్లు ఈ భూమండలము మీది క్షత్రియులందరినీ వధించాడు. వారి రక్తం ఏరులై పారింది. ఆ రక్తముతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచి పెట్టాడు. తదనంతరము తన కోపమును తగ్గించుకున్నాడు. వారి రక్తము పారిన ప్రదేశము శమంతక పంచకముగా ప్రసిద్ధి చెందింది.
“21870 రథములు, 21870 ఏనుగులు, 65610 గుఱ్ఱములు, 109350 మంది భటులు” కలిపితే ఒక అక్షౌహిణీ అవుతుంది. అలాంటి 18 అక్షౌహిణీల సైన్యముతో కురువీరులు యుద్ధం చేసారు కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని కూడా పేరు వచ్చింది. ఇదీ మహాభారత యుద్ధ సైన్య విశేషము.
ఇక భారత కథలోకి వెడదాం. పంచపాండవులలో ప్రముఖుడు అర్జునుడు. అతడు శ్రీకృష్ణునికి బావ. అర్జునుడి పౌత్రుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు. ఆయన కుమారుడు జనమేజయుడు. ఒక రోజు ఉదంకుడు అను మహాముని జనమేజయమహారాజును కలిసి, “ఓ రాజా! నీకు శుభమగుగాక. నాపేరు ఉదంకుడు. నేను నాగురువు గారి ఆజ్ఞమేరకు ఒక పని మీద పోవుచుండగా తక్షకుడు అను నాగరాజు నాకు అపకారము చేశాడు. ఆ తక్షకుడు నానే కాదు నీకు కూడా మహాపకారము చేశాడు. నీ తండ్రిని ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుని ��
Author: sandhehalu - samadhanalu