జనన కారణము :
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు
అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి
కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న
మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ...
తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు
వారము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష
నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు
భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను .
శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి
భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా ... వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము,
30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా
లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల
కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ
ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో
శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా
హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను
సంహరించాదానికే ... ఈ మహిష ఎవరు ? .
పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన
దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి
,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి
చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని
దత్తాత్రేయుల వారు అంటే ... మరికొంతకాలము ఇక్కడే
సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి" మహిషి " గా
జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను
"మహిష " గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు ...
రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు
మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి
లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో
(దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి
బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని
వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు ... అని
ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో
తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి
హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో
కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది .