దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం….మీ శివాజీ స్వామీజీ....
……………………………………………….
1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే – మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే – కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే – ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మొగలిపూలను అర్పిస్తే – అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే – భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే – సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే – అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే – అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే – కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే – స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే – వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి స్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే – అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే – జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో – సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే – దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే – జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం – దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే – పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
Saturday, 14 January 2017
దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుంది
Author: sandhehalu - samadhanalu
Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ