మనదేశంలో ఆవును తల్లిగా, వాటిపాలను అమృతంగా భావిస్తారు. ఈ సంఘటన బహుశ 1945 సంవత్సరపునాటి మాట! కాశీలోని ప్రఖ్యాతవైద్యులు పండిత రాజేశ్వరదత్త శాస్త్రిగారి వద్దకు ఒక సంపన్నుడయిన జమీందారు అత్యంత క్షీణదశలో ఉన్న తనభార్యను వైద్యంచేయించడానికి తీసుకువచ్చాడు. ఆమె ముప్పయి సంవత్సరాల వయస్సులోనే చిక్కిశల్యమయింది. శరీరమంతా పూర్తిగా శుష్కించిపోయింది. భయంకరమైన జబ్బుతో ఆమె భాదపడుతోంది.
జమీందారు చాలా సంవత్సరాలుగా ఆమెకు అనేకచోట్ల వైద్యం చేయించినా ఏమీ లాభం కనపడలేదని చెప్పాడు. ఎవరూ ఆమెకున్న రోగాన్ని నిర్ధారించ లేకపోయారు. ఇదివిన్న వైద్యుడు చిరునవ్వునవ్వి 'కంగారుపడకండి' అని అమెనాడిని పరిశీలించాడు. కొంచెం సేపు ఆలోచించి ఆయన జమీందారు ఒక్కడినీ పిలిచి రహస్యంగా అతనిభార్యకు కేన్సరువ్యాధి సోకిందని, భయపడనక్కర్లేదని, ధైర్యంగా ఉండి పత్యం చేస్తూ ఉంటే భగవంతునిదయవల్ల జబ్బు తగ్గుతుందని నచ్చచెప్పాడు. ఆమెకు మందూ, ఆహారం కూడా నల్లనిఆవు యొక్కపాలు, కృష్ణతులసి ఆకులని, ఆమె ఎన్ని తినగలుగుతోందో అన్ని తులసి ఆకులూ, ఎంత త్రాగగలుగుతుందో అంత ఆవుపాలు ఇమ్మని, కొంచెం నోటికి రుచించటానికి పెసరకట్టూ, జొన్న రొట్టెలు ఇవ్వవచ్చునని చెప్పాడు. వీటితో ఇతర మందులు వాడితే ఆవుపాలకు, కృష్ణ తులసికి అవమానమని, అంతేకాక హానికుడా కలగవచ్చుననీ చెప్పాడు. ఆవులూ, తులసి మొక్కలూ మనమాతలే కదా! వైద్యుడు చెప్పిన మాటలపై అత్యంత విశ్వాసముంచి జమీందారు తనభార్యను వెంట తీసుకొని వెళ్ళి ఆయన చెప్పిన విధంగానే గొవుపాలూ, తులసిఆకులనూ నియమానుసారం సెవించేలా చేశాడు. కాలం గడుస్తోంది.
ఆరునెలల తర్వాతా వారణాసివైద్యునిచెంతకు వచ్చిన జమీందారుభార్య సంతోషంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండటం గమనించిన వైద్యుడు సంతోషంతో తబ్బిబ్బవుతూ 'చూశారా? గోక్షీరానికి తులసికి ఉన్న మహిమ !' అని అన్నాడు. అది విన్న జమీందారు జవాబుగా విశాలమైన పెద్ద నల్ల తులసివనాన్ని నాలుగయిదు నల్లావుల్నీ పెంచుతున్నట్లు చెప్పాడు. నెల రోజులపాటు క్రమం తప్పకుండా సేవించిన కారణంగానే తన పత్నిబాగా కోలుకుందని చెప్పి వినయపూర్వకంగా జమీందారు కొంత ధనాన్ని తిసుకొనుమని వైద్యుని ప్రార్ధించాడు. వైద్యుడు జవాబు గా 'నా ఔషధాలయంనుంచి నేనే మందు ఇవ్వలేదు. ఆగోమాతే మీమీద దయచుపించింది అంతే ! ఒక పనిచెయ్యండి. ఈ ధనాన్ని ఏ గోశాలకైన దానంగా ఇవ్వండి ' అన్నాడు సంతోషంతో.
వైద్యపండితుడైన శాస్త్రిగారికధను వారణాసిలోని పెద్దలు ఈనాటికి చెప్తూఉంటారు. కేన్సర్ పై విశ్వమంతా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ రోగానికి మందు అసాధ్యమనే అంటున్నారు. కానీ శాస్త్రిగారు 50 సంııలకు పూర్వమే గోక్షీరము కృష్ణతులసి యీ రెండిటిశక్తితో దీనిని నయం చేశారు. నిస్సందేహంగా ఈ సత్ఫలితం గోమహిమతో పాటు ఆయనకున్న విశ్వాసం, నమ్మకం, పరోపకార, భావన సమ్మిళితమై ఉన్నాయి.