శనిత్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే...
శనివారం ఇటు శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా
స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. ఈ రోజున శనీశ్వరునికి తైలాభిషేకం శుభప్రదం.
~~~~~~~~~~~~
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. . సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున
----------------
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
-----------------
ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు. ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు,రోద్రాంతక, సూర్యపుత్ర.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: |
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
కిషోర్ శర్మ యాయవరం