💐💐💐💐💐💐💐💐💐
సృష్టిలో ప్రతివస్తువుకూ కూడా ఏదో ఒక ధర్మం ఉంతుంది. దానిని అది ఓగుట్టుకోకూడదు. అలా దాని ధర్మాన్ని అది పోగొట్టుకుంటే అదె నాశనమైనట్లే. అగ్నికి వేడి ధర్మం. వేడి లేకుంటే అది అగ్నే కాదు. అయస్కాంతానికి ఇనుము నాకర్షించడం ధర్మం. ఆ ధర్మం అది కోల్పోతే అది అయస్కాంతం కానట్లే. మనుష్యునిది మనుష్య ధర్మం. ఇలాగే పశువుది పశు ధర్మం. విశ్వమందలి గ్రహనక్షత్రాదులు కేవలం పరస్పరాకర్షణతో ఉన్నాయి. ఏ ఒక్కటి దాని ధర్మం తప్పినా మొత్తం పతనమై ప్రళయం వస్తుంది. కాబట్టి ఏవీ తమ ధర్మం తప్పకూడదు. మనమూ మన ధర్మం తప్పకూడదు.
సర్వజన సమ్మతమైనది హిందూ ధర్మం. అనేకంలో ఏకత్వాన్ని చూడగల సామర్ధ్యం దీనికే ఉంది. ఈ ఏకత్వం కనపడక అనేకత్వం కనపడితే ఆ లోపం మనదే. ధర్మమే హిందువు యొక్క ఆత్మ. దీన్ని బాగా అర్ధం చేసుకోవాలి. భారతదేశ ఆత్మ ధర్మం కాబట్టే ఈ దేశంలో ధార్మికులైన హిందువులు తినటం, త్రాగటం, శయనించటం కూడా ధర్మబధ్ధంగానే చేస్తారు. పుట్టినప్పటినుండి మరణించేదాకా, సరిగా చెప్పాలంటే పుట్టకముందు నుండి చనిపోయాక కూడా ధర్మబధ్ధులయ్యే ఉంటారు. ఈ విషయాలన్నీ అనంతర భాగాల్లో చూస్తాము. పుట్టకముందు పుంసవన, సీమంతాది ధర్మకర్మలుంటాయి. చనిపోయాక అంత్యక్రియ, శ్రాధ్ధకర్మలుంటాయి. అంటే హిందువుది పూర్తిగా ధర్మమయ జీవితం. ఆ ధర్మము తప్పితే బ్రతికినా హిందువు నిర్జీవుని లెక్క. కాబట్టి ప్రతి హిందువు ధర్మమెరిగి ఆచరించి తీరాలి.
ఐహిక, పారమార్ధిక ప్రయోజనాలు సాధించే ఈ ధర్మానికి నాలుగు లక్షణాలు ఉంటాయి. 1. వేద ప్రతిపాదితమై ఉండాలి. 2. సంస్కృతిలో విశదీకరింపబడి ఉండాలి. 3. పెద్దల ఆచరణలో ఉండాలి. 4. మనకు ప్రియమైనది కావాలి.. ధర్మానికి పెద్దలు చెప్పిన ధృతి క్షమాది పది లక్షణాలుండాలి. వానితోబాటు హిందూ ధర్మంలో ప్రధానాంశాలుగా దైవవిశ్వాసం, సదాచారం, శారీరక కర్మాధారమైన వర్ణధర్మం, మానసిక పరిణతి ఆధారంగా ఆశ్రమ ధర్మం, స్త్రీ స్తీత్వం, విగ్రహారాధన, యోగవిధి, బ్రహ్మ--దేవ--పితృ--భూత--మానుష పంచయజ్ఞాలు,: అన్నమయ--ప్రాణమయ==మనోమయ-విజ్ఞానమయ--ఆనందమయ-- పంచకోశ పవిత్రత: శృతి, స్మృతి, పురాణ, మంత్ర తంత్రాది విశ్వాసం, : కర్మ సిధ్ధాంత విశ్వాసాలు, నిర్గుణ, సగుణోపాసన ముక్తి విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి. ఈ ధర్మం విశ్వధర్మం. దీనిని రక్షించటమంటే విశ్వాన్నే సంరక్షించటమని అర్ధం. అలాటి ధర్మరక్షణకు మనమంతా బధ్ధులం కావాలి..
💐💐కల్యాణ్ మల్లాది💐💐