1) సత్పదార్థేన సంగః (2) సత్ శాస్త్రేణ సంగః (3) సజ్జన సంగః అని మూడు విధాలుగా వివరించారు.
సత్పదార్థమంటే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్త్వం. అట్టి తత్త్వ స్వరూపానికి ఆద్యంతాలు లేవు. చావు పుట్టుకలు లేవు. వినాశం వుండదు. కనుక ఆ పరమాత్మ తత్త్వం నిత్య సత్యమై, శాశ్వతమై శోభిల్లుతుంది. అట్టి ఈ తత్త్వాన్ని గ్రహించాలంటే మనకు ప్రమాణం వేదశాస్త్రాలే. వాటిని మనంతట మనమే గ్రహించలేము కనుక వాటిని బొధ పరచే ఓ సజ్జనుడు కావాలి. వారినే గురువు అంటాం. అట్టి గురువునే సజ్జనుడని, వేదశాస్త్రములనే సచ్చాస్త్రమని, పరమాత్మ తత్త్వాన్ని సత్పదార్థమని, వీటితో సంగాన్ని పెంచుకోడాన్నే సత్సంగమని శాస్త్రాలు పేర్కొన్నాయి.