"శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతీ"
అదిగదిగో శ్రీశైలము
భక్తుల ముక్తి రసాలము
శివదేవుని స్థిరవిలాసము
భూలోకాన కైలాసము...
గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల
పూజించే పరమేశ్వరుడు
భ్రమరాంభిక పలువిధముల పదముల
సేవించే శివశంకరుడు
చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ
మల్లీశ్వరుడై వెలసిన చోటు...
నీలకంఠ నాతలపై నిలచీ
కలియుగమును కాపాడుమని
శైలనాయకుడు శివశివ శివ యని
చిరకాలము తా వేడెనని
భక్త సులభుడా ఫాలలోచనుడు
భ్రమరా విభుడై భాసిలెనట యిట...
పాపనాశనము శాపమోచనము
శ్రీశైలేశుని దరిశనము
సౌఖ్యప్రదము,సర్వత్ర శుభదము
గిరిమల్లేశారాధనము
నిరతపావనము నిత్యమోహవము
మల్లికార్జునుని మంత్రధ్యానము..