చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు దేవుని గుడికి వెళ్ళుతూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిందా లేదా అని ఆలోచించే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే గుడికి వెళ్ళటానికి సమయం కూడా ఉంటుంది. మహా విష్ణువు ఆలయానికి ఉదయం వెళ్ళాలట. శ్రీ మహా విష్ణువు స్థితి కారుడు కనుక రోజులో వచ్చే సమస్యలను దూరం చేస్తాడని భక్తుల నమ్మకం.
అదే శివాలయానికి అయితే సాయంత్రం సమయంలో వెళ్ళితే మంచిది. మహా శివుడుని రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు పలితం వస్తుంది. ఆ మహా శివున్ని భక్తితో ప్రశాంతంగా కోరికలను కోరితే నెరవేరతాయి.
*సనాతన హిందూ ధర్మము*✍