కలియుగం మొదలైన 950 ఏళ్లకు కేరళలో విలువ మంగళ స్వామియర్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ మహా విష్ణువు దర్శనం కోసం పూజలు తపస్సు చేసేవాడు. ఒక రోజు అతని ఇంటికి అందంగా ముందడుగా ఉండే ఓ పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు స్వామియర్ కి బాగా నచ్చి 'నువ్వు నా దగ్గరే ఉండిపో' అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు "నేను నీ దగ్గరే ఉంటాను. కానీ ఏ రోజు అయితే.. నువ్వు నన్ను మర్యాదగా చూసుకోవో.. ఆ రోజు 'అనంతకాడు' అనే ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను" అని ఒక కండిషన్ పెట్టాడు. దానికి స్వామియర్ సరే అన్నాడు.
కానీ ఆ పిల్లవాడు తన కొంటె చేష్టలతో స్వామియర్ ని విసిగించే వాడు. ఒక రోజు స్వామియర్ పూజలో ఉండగా.. తాను పూజించే విష్ణు విగ్రహంతో ఆ పిల్లవాడు ఆడుకునున్నాడని.. ఆ పిల్లవాడిని స్వామియర్ మందలించాడు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే స్వామియర్ ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ 'అనంతకాడు' అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ పిల్లవాడు స్వామియర్ కళ్ళముందే.. ఓ చెట్టులోకి వెళ్ళిపోయాడు.
వెంటనే ఆ చెట్టు 13 కిలోమీటర్ ల పొడవు ఉన్న ఓ మహా వృక్షం లా మారి.. కింద పడి 5 పడగలు ఉన్న శేషు పాములా పవనిస్తున్న మహా విష్ణువు లా మారి పోయింది. అప్పుడు ఆ పిల్లవాడే మహా విష్ణువు అని అర్ధం చేసుకొని.. ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరాడు. వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలా మారింది. స్వామియర్, అప్పటి రాజు కలసి ఆ విగ్రహానికి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి.
Author: sandhehalu - samadhanalu