నవగ్రహాలు అమ్మవారి పాదాలక్రింద నే ఉంటాయి అవే కాల రూపం లో జీవి యెక్క కర్మ ఫలాన్ని అందిస్తూ ఉంటాయి. విధి చాలా విచిత్రమైనది దాని యెక్క తీక్షణమైన ప్రభావాన్ని తట్టుకోవాలంటే అమ్మ ను శరణువేడటం వినా వేరే మార్గం లేదు..... మనసు భగవంతుడికి ఇచ్చినప్పుడే మనిషి కర్మను సునాయాసంగా దాటగలడు... మనసు కూడా చాలా బలీయమైనదే ఏదైనా విషయాన్ని అందిస్తే అది అంత తొందరగా మరచిపోదు. ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వినపడుతూ ఉన్న మాట. ఏమంటే
నా మనసు మరచి పోలేక పోతోందండీ నా మనసు బాధ పడిందండీ అని వింటూ ఉన్నాం.
అదీ మనసు గొప్పతనం... మరి అలాంటి మనసు కి మనం మంచి అలవాట్లను ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని సాటి మనిషి ని బాధించని హుందా తనాన్ని అలవాటు చేసి ఈ దేహాన్ని పదిమందికి ఉపయోగపడే విధంగా మలచి ఉంటే మన పుట్టుక కి సార్థకత వాటిల్లి ఆత్మోన్నతి వైపు నడిపించేది... కానీ మనం అలా ఉంటున్నామా లేదు కనుకే అనునిత్యం ఆందోళన కే దాసోహం అవుతున్నాం. సరే ఈ రోజు నుంచైనా నా మనసు కి ప్రయత్నపూర్వకం గానైనా సరే మంచి విషయాలను అందిస్తాను అనుకుంటే రోజుకు కొద్దిసేపు అమ్మవారి నామాన్ని పలకడానికి సమయం కేటాయించి చూడండి అమ్మవారు మీ మనసు ను ఎంత ప్రశాంతంగా ఉంచుతుందో....
జోతిష్యం ప్రకారం మనసు కి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు ఉండేది మాత్రం అమ్మవారి ఆధీనంలో... అందుకే అంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని.... మనసు మంచి వైపు తిప్పి చూడండి బాధ అనేది తెలియకుండా ప్రజ్వరిల్లుతుంది.... శ్రీ మాత్రే నమ: