🔲 సూక్తులు
🔻పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది.
🔻పొగిడే ప్రతివాడు, పొగడ్తను వినేవాడి ఖర్చుతో జీవిస్తాడు.
🔻పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
🔻పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.
🔻పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
🔻పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
🔻ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.
🔻ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం.
🔻ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.
🔻ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగోప్రజాసమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కానీ వివేకంతో కాదు.
🔻ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
🔻ప్రతి ఒక్కరు చాలాకాలం జీవించాలనుకుంటారే కానీ ఏ ఒక్కరూ ఎదగాలని కోరరు.
Author: sandhehalu - samadhanalu