Thursday 27 July 2017

బుధగ్రహంయొక్క విశిష్టత

బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.
బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.
బుధుడి ప్రభావం
బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.

🙏బుధుడి కారకత్వాలు
బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంథాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మధ్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము, స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు,ప్రకటనలు, వాహనములు, వ్యాపారం,నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు నాయకత్వం వహిస్తాడు.

🌹బుధుని రూపురేఖలు💐
బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గధ, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమునుఅధిరోహించిఉంటాడు..
లోకాసమస్తా సుఖినోభవంతు 💐

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles