Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts
Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts

Friday 13 January 2017

నవనారసింహ క్షేత్రములు

అహొబిలం మహత్యం:

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసిం హ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి.రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సం హరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్ధలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్ధల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు "బ్రహ్మండపరాణం" అంతర్గతంలో 10 అధ్యాయాలు.1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

కృతయుగం నందు హిరణ్యకశ్యపుని సం హర అనంతరం పేట్రేగిన కోపంతో నున్న ఉగ్ర నరసిం హ స్వామిని శాంతింప చేయుటకు పరమశివుడు, నృసిం హ మంత్రరాజుమును "మంత్రరాజ పద స్తోత్రం" గా స్తుతించి నృసిం హుని శాంతింపజేసినట్లు "బ్రహ్మాడపురాణం" లో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి ప్రక్కగుహలో జ్వాలా నరసిం హ స్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు.

"విష్ణుపురాణం" నందు శేషధర్మము 70 అధ్యాయం లో "విరుద్ధ ధర్మ ధర్మిత్వం" లో త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబొల నరసిం హస్వామిని దర్శించి 'నృసిమ్హ పంచామృత స్తోత్రం'తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది.

"శ్రీ మద్భాగవతము" నందు ద్వాపర యుగమున పంచపాండవులు అహోబిల నరసిం హుని పూజించునట్లు పురాణము చెబుతున్నది.

కలియుగం నందు "అర్భావతారము"గా వేంకటేశ్వరస్వామి, పద్మావతి దేవికి విళంబి నామ సం వైశాఖ శుద్ధదశమిలు, శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహనికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసిం హస్వామికి నివేదించవలసినదిగా బ్రహ్మడేవుడు పలికెను. "శ్రీ వేంకటేశేనా వివాహ కాలే సంపూజితం సర్వవిదోప చారైహిః అనునట్లు వేంకటేశ్వర స్వామి లక్ష్మీనరసిం హ స్వామిని ప్రతిష్టించి, ప్రసాదాలను నివేదించి మహమంగళారతులు చేసినట్లు "వేంకటాచల మహత్యం" చెబుతుంది. వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈ నాటికి శ్రీ నృసిం హ స్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు.

ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వారులు కూడా వచ్చి అహోబలేశ్వరుని దర్శించినట్లు తెలియుచున్నది. గురుపరం పరాధీనలో వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలం వేంచేసి నరసిం హ స్వామిని దర్శించి అనుగ్రహన్ని పొందినారు. ఆ తరువాత వైష్ణవ పరంపరాధీనతోనే శ్రీ నిగమాంత దేశిక స్వామి అను పండితునకు ఉత్తర భారత దేశ యాత్ర చేసినప్పుడు అహోబిల క్షేత్రమును దర్శించునట్లు ఆధారములు కలవు.

దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసిం హ సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ పది పాశురములు "నా లాయిర దివ్య ప్రభంధం" నందు కలవు. ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహరాజు (1076-1106) పశ్చిమ తీరపు రాజులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరాదీసులు, రెడ్డిరాజులు ఈ మూల విగ్రహం ను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు మంటపాలు దేవాలయం నిర్మించినట్లు ఉత్సవల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి.

ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసిం హ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశం అహోబిలం నందు (788-820)లో జరిగింది.

అహోబిల నవనారసింహ వైభవం :

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. తొమ్మిదిమంది నరసింహ మూర్తులు అహోబిల మొదటి పీఠాధిపతి "ఆదివణ్‌ శఠగోపయతి" బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నవనారసింహాకృతి మనకు శృతి భూషణం.

నవనారసింహ - నమో నమో
భవనాశి తీరయహో - బల నారసింహ ||నవ||
జ్వాలాహోబల, మాలోల క్రోడ,కారంజ, బార్గవహ:,
యోగానంద, చ్చత్రవట, పావన నవమూర్తయ:

ఈ మంత్రము నవనారసింహుల మంత్రము, అన్నమయ్య తన పద కవితల యందు అహోబిల, జ్వాలా, యోగానంద కానుగమాని, (కారంజ), భార్గవ, వరాహ, నరసింహుల పేర్లు శ్లోకం లో సంప్రదిస్తున్నవి. మట్టెమళ్ళ, ప్రహ్లద, శ్రీ నారసింహులు, చత్రవట మాలోల, నృసింహులను ఉద్దేశించినవి. పావన నవ నారసింహులలో అన్నమయ్య నవరసాలను ఉగ్గడించాడు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, అభివర్ణించాడు. ఈ నవనార సింహ క్షేత్రములందలి అన్ని విగ్రహములు దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు చెప్పుచున్నవి.

కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచరసృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినాడు. ఈ అహోబిల నారసింహుడు.

జ్వాలా నరసింహ క్షేత్రము
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి
జ్వాలా నరసింహ క్షేత్రము

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

అహోబిల నరసింహ స్వామి
ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.

పెన్నహోబిలం లక్ష్మి నరసింహస్వామి
ఆంధ్రరాష్ట్రములో గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్యప్రదేశం పవన నది ఒడ్డున చెంచుల కులంలో పుట్టింది ఒక అందాలరాశి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం అయినందున ఆమెను చెంచులక్ష్మి అని పిలిచేవారు.

అదే అడవిలో మరోవైపున హిరణ్యాక్షుని సంహరించడానికి నారాయణుడు నరసింహావతారం ఎత్తాడు. హిరణ్యకశివుడిని ద్వారంపై కూర్చుని తన ఒడిలో పెట్టుకుని తన పదునైన చేతిగోళ్లతో సణరించాడు నారాయణుడు. అయినా నరసింహస్వామి క్రోధావేశాలు తగ్గలేదు. ఆ అరణ్యంలో రౌద్రావతారంలో సంచరించేవాడు.

ఆ సమయం మహాలక్ష్మి అంశమైన చెంచులక్ష్మి ఆ చోటుకి వచ్చింది. ఆమెను చూసిన నరసింహస్వామి మైమరచిపోయాడు. తగ్గని క్రోధావేశాలు అదే క్షణంలో మాయమయ్యాయి. అడవిలో తిరిగే అటవికులు జాతిలో పుట్టినందున చెంచులక్ష్మి స్వామివారికి మాంసము, మధువులను సమర్పించి భుజించమని చెప్పింది. తనౌ వివాహం చేసుకుంటే అవన్నీ తప్పక భుజిస్తానని అన్నాడు శ్రీనరసింహస్వామి. అటవికి జాతివారు మరో జాతి వారిని ఎలా వివాహం చేసుకోగలరని ప్రశ్నించడం మొదలు పెట్టారు చెంచులు. గరుడాద్రి పర్వత శ్రేణిలో ఒక చిన్న గుహ గుండా బయటపడి ఒక కొండ ఎక్కి అక్కడే లక్ష్మీదేవిని పరిణయమాడాడు నరసింహస్వామి.

ఆ కొండపైన ఇద్దరు కొలువైయ్యారు. ఉద్దాలక మహర్షి ఓసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి కటాక్షమున్నట్టు తెలుసుకుని కఠిన తపస్సు చేశాడు. అయితే ఆయన శ్రీలక్ష్మి నరసింహస్వామిగా అక్కడున్నట్టు ప్రపంచానికి చాటిచెప్పలేదు. అయితే ఈ విషయం మరో సంఘటన ద్వారా తెలిసింది.

ఆ కొండ క్రింది భాగాన గొల్లపల్లి అనే గ్రామము ఉంది. గొల్లలు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఈ గ్రామంలో గల ఒక గోవు ప్రతిదినము స్వామి వద్ద క్షీరము ఇస్తూ వుండినది. గోవు యజమాని తన గోవు పొదుగులో పాలు లేకుండట గమనించి కలత చెందాడు. శ్రీ నరసింహస్వామి ఆయనకు కలలో కనిపించింది నీ గోవు పాలను సేవించుచున్నానని తెలియజేశాడు.

సంతోషపడిన గొల్లవాడు బిలప్రాంతము శోధించగా బిలముపై భాగమున శ్రీ స్వామివారి పాదముద్రిక గల శిలాఫలకము మరియు గిరి క్రింది భాగమున నైరుతి దిశన శ్రీ లక్ష్మిదేవి శిల కనిపించినదట.

గొల్లపిల్ల వాసులు శ్రీవరికి శ్రీ అమ్మవార్లకు చిన్న ఆలయములు నిర్మించి పూజలు చేస్తుండేవారు. విజయనగరం సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయులు వారు విజయనగరము నుండి పెనుగొండ దుర్గమునకు పయనించుచూ ఈ క్షేత్రము వద్ద మజిలీ గావించాడట.

శ్రీ సదాశివరాయల వారికి శ్రీలక్ష్మి నరసింహస్వామి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయమగునని ఆశీర్వదించాడట. సదాశివరాయల వారు దిగ్విజయుడై తన జైత్రయాత్ర తిరుగు ప్రయాణములో స్వామివారిని దర్శించి లక్ష్మి నరసింహస్వామి వారికి శ్రీలక్ష్మిదేవి అమ్మవారికి ఆలయాలు నిర్మించారు. పెన్నానది ఒడ్డున ఒక కొండపై స్వామివారి పాదముద్రిక క్రింది భాగమున బిలం వల్ల ఈ క్షేత్రం పెన్నహోబిల క్షేత్రమని పిలువబడుచున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనతపురం ఉరవకొండ రహదారి పక్కన పెన్నా నదికి 3 కి.మీ దూరమున ఒక గిరిపై శ్రీ పెన్నహోబిల లక్ష్మినరసింహస్వామి ఆలయం వెలిసింది. ఒక చిన్న కొండపై ఆలయం గోపుర ద్వారం దాటి విశాలమైన బయటి ప్రాకారం.

ఎడమవైపు వున్న ఒక చిన్న సన్నిధిలో చెన్నకేశవస్వామి వెలిశాడు. బలిపీఠం తర్వాత ధ్వజస్తంభం గరుడభగవాన్‌ సన్నిధి న్వున్నాయి. ఆ తర్వాత 45 అడుగులున్న రెండు స్తంభాలు వాటిపై ఆంజనేయస్వామి నమస్కరిస్తున్నట్టున్న విగ్రహం.

రెండింటిలో ఒకటి దీపస్తంభం. ఇంకోకటి సదాశివరాయల వారి విజయానికి ప్రతీకగా విజయస్తంభం. చిన్న మండపందాటి వెళ్తే గర్భగుడిలో లక్ష్మి నరసింహస్వామి కూర్చున్నట్టున్న విగ్రహం. అందమైన విగ్రహం కరుణచూపే కళ్లు పెద్దమీసం, పై కుడిచేతిలో చక్రం ఎడమచేత శంకం కింది కుడి చెయ్యి అభయహస్తం, ఎడమచేత అమ్మవారిని పట్టుకున్నట్టున్న విగ్రహం.

అలనాడు నరసింహస్వామి లక్ష్మిదేవిని గాంధర్వ వివాహం చేసుకున్న పవిత్రమైన చోటే ఈ గర్భగుడి. ఇక్కడ స్వామివారి కుడి పాదముద్రిక కనిపిస్తుంది. దానిప్రక్కనే ఆయన అహోబిలం నుండి వచ్చిన ద్వారం కనిపిస్తుంది.

స్వామి ముందు నిలబడి మనస్పూర్తిగా ధ్యానిస్తే మనసు సేదతీరుతుంది. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. స్వామివారి ఈ గుహలో వివాహం చేసుకున్నందున ఈ స్వామిని భక్తితో మొకుకున్న వారికి పెళ్లి జరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది.

వివాహం జరగాలని ప్రార్ధించడానికి ఆకు పూజ జరిపిస్తే నలబై రోజులలో ఆ కోరిక నెరవేరుతుందని స్ధానిక భక్తజన నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామి కల్యాణోత్సవము ప్రతిరోజూ జరుగుతూనే వుంటుంది.

పెళ్లి వేడుకలు సందర్భంగా అన్నదానమూ జరుగుతుంది. పెళ్లి బృందం ఉండడానికి ఆలయ కమిటి గదులను అద్దెకిస్తుంది. గిరికి క్రిందిభాగాన పుష్కరిణి వుంది. పుష్కరిణి ఆనుకుని ఎన్నో దుకాణాలు ఉన్నాయి. పక్కనున్న ఊళ్ల నుండి వచ్చేవారు ఇక్కడ వంట చేసుకుని వనబోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు.

అశాశ్వతమైన ఈ జీవితంలో ప్రతిక్షణమూ ఎంతో అమూల్యమైనదని తెలుసుకుని ప్రతి మనిషి సంతోషంగా ప్రాశాంతంగా జీవిస్తే ఎంతో మంచిది. ఆ ప్రశాంతత ఈ దేవాలయంలో తప్పక లభిస్తుంది. పెన్నహోబిలానికి రండి స్వామిని దర్శించి తరించండి.

మహానంది

మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే..... గర్బాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రుల పై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధి మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది. నంద్యాల నుండి ప్రతి అర్ద గంటకు ఒక బస్ కలదు.

గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.

ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును.

అరుణాచలేశ్వరుడు


===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

Thursday 12 January 2017

భైరవకోన


ప్రతీ ఒక్కరు దర్శించవలసిన మహామహిమాన్వితమైన శక్తిక్షేత్రం..
ఇక్కడ శ్రీశ్రీశ్రీ త్రిముఖదుర్గాంబ
(మహాశక్తి) అమ్మవారు,, శ్రీ బర్గుళేశ్వరస్వామివారు,,అంతేకాక, మల్లికార్జునలింగం,,కాశీవిశ్వేశ
్వరలింగం,,నగరేశ్వరలింగం,,ఇలా ఎన్నో శివలింగాలతో విరాజిల్లే ఈ క్షేత్రాన్ని ఒకే బండరాయిలో అద్భుతంగా చెక్కడమనేది కేవలం సిద్దత్వం ఉన్న శిల్పికే సాధ్యం.. అలాంటి ఒక పెద్దాయన అహోరాత్రులు శ్రమించి నిర్మించి తన తపఃశక్తిని మొత్తం ధారపోసి అక్కడి దేవతావిగ్రహాలన్
నింటికి ప్రాణం పోసి ప్రతిష్ట గావించారు.. ఈ క్షేత్రనికి రక్షణ శ్రీ కాలభైరవుడు.. మహాఉగ్రరూపంగా ఇక్కడ ఉండే కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభమైన విషయం.కాదు.. ఈ క్షేత్రంలో ఎటువంటి తప్పులు జరిగినా వారిని సర్వనాశనం చేస్తుంది అమ్మవారు.. మైలతో,,ముట్టుతో ఉన్నవారు ఈ క్షేత్రంలోకి ప్రవేశించకూడదు.. ఇక్కడి అమ్మ దయ అపారం.. తనని నమ్మిన భక్తులకు కొంగుబంగారం.. అనుక్షణం వారిని కంటికిరెప్పలా కాపాడుతుంది.. ఎవరైనా ఎడతెగని కష్టాలలో ఉన్నవారు ఐదు పౌర్ణములు అమ్మవారిని దర్శించి,,భక్తి
శ్రద్దలతో మీ శక్తికొలది పూజించి ఆ రాత్రి అమ్మవారి సన్నిధిలో నిద్రచేసిన మీ సమస్యలు ఎటువంటివైనా త్వరలోనే సమసిపోతాయి శివా.. అమ్మను పూజించండి..ఆయురారోగ్య ఆనందాలతో వర్థిల్లండి..
రూట్,,.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి వయా పొదిలి,,కనిగిరి,,C S పురం మీదుగా భైరవకోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు..
మళ్ళీ కలుద్దాం శివా.,,శివోహం..
||శివాయ పరమాత్మనే నమః||

Monday 9 January 2017

అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?


భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles