Monday 9 January 2017

తిరుప్పావై ఇరవై ఐదో రోజు పాశురం


        ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్
        ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,
        తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద
        కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్
        నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
        ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి
        వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావం : ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.

    అవతారిక :----

'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయున 'నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి. మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి యీ (పాశురంలో) అర్ధించుచున్నది.

            (బిలహరి రాగము _ ఝుంపెతాళము)
   
    ప ...    పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!

    అ...ప...    వరలక్ష్మి యాశించు పరమ సంపదనేల్ల
         కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము

    చ...    దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి
        దేవి యశోధకును వరసుతుడవై పేరుగ
        తా విన్న కంసుడట కీడు దులపగ నెంచ
        నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి
        ఆ యత్నమంతము వమ్ముజేసిన స్వామి
        పురుపార్దమర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా!

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles