Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Friday 13 January 2017

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో బాబా తన భక్తుడయిన బాలారాం మాన్ కర్ కి మశ్చీంద్రఘడ్ వెళ్ళి రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమని సలహా ఇచ్చారు.  తాను సర్వత్రా నిండి ఉన్నానని నిరూపించడానికి బాబా అతనికి సశరీరంగా దర్శనమిచ్చి బాలారాం తో "నేను ఒక్క షిరిడీలోనే ఉన్నానని అనుకొంటున్నావు.   ఇపుడు  నన్ను చూస్తున్న రూపానికి, షిరిడిలో చూసిన రూపానికి నువ్వే సరిపోల్చుకో. షిరిడీలో చూసిన రూపానికి, యిచ్చట మశ్చీంద్రఘడ్ లో చూసిన రూపానికి, నా చూపులకి ఆకారానికి ఏమన్న భేదమున్నదా?" అని అడిగారు.  దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమిటంటే బాబా ఒక్క షిరిడీలోనే ఉన్నారని అనుకోరాదు.  ఆయన చెప్పినట్లుగా బాబా ఎక్కడ ఉంటే అదే షిరిడి. 

శ్రీసాయి సత్ చరిత్ర 30వ.అధ్యాయంలో బొంబాయిలోని పంజాబీ వ్యక్తి రాం లాల్ కి బాబా స్వప్నంలో మహంతుగా కనిపించి షిరిడీకి రమ్మని చెప్పారు.  వణి గ్రామంలోని సప్తశృంగి దేవాలయ పూజారి కాకాజీ వైద్య కలలో దేవతగా దర్శనమిచ్చి షిరిడీకి రమ్మని పిలిచారు. 

ఈవిధంగా బాబాతన భక్తుల స్వప్నాలలో దర్శనమిచ్చి వారిని షిరిడీకి రప్పించుకొన్నారు.

1918వ.సంవత్సరం అక్టోబరు 15వ.తారీకున బాబా మహాసమాధి చెందారన్న విషయం మనకు తెలుసు.  అక్టోబరు 16వ.తారీకు వేకువఝామున బాబా పండరీపూర్ లో ఉన్న దాసగణు కలలో కనిపించి "ద్వారకామాయి కూలిపోయింది.  వర్తకులందరూ నన్ను చాలా చికాకులు పెట్టారు.  అందుకనే నేను యిక్కడినుండి నిష్క్రమించాను.  నీకు ఈవిషయం తెలియచేయడానికే నేనిక్కడికి  వచ్చాను.  వెంటనే నువ్వక్కడికి వెళ్ళి నాశరీరాన్నంతా పూలతో కప్పు" అని చెప్పారు.  దాసగణు షిరిడీకి వచ్చి బాబాకు పూలదండలు వేసి ఆయన చెప్పినట్లుగానె బాబా శరీరాన్నంతా ఎన్నోపూలతో కప్పాడు.  బాబా దేహాన్ని పూవులతో పూజించి రోజంతా సాయి నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు.  బాబాకు అంత్యక్రియలు పూర్తయిన తరువాత దాసగణు బీదలకు అన్నదానం జరిపించాడు.      

తన భక్తుల మదిలో కలిగే సందేహాలకు బాబా యితర భక్తులద్వారా పరోక్షంగా సమాధానాలు చెప్పేవారు. శ్రీసాయి సత్ చరిత్ర 45వ.అధ్యాయంలో బాబా ఆనందరావు పాఖడే కలలో కనిపించి కాకాసాహెబ్ దీక్షిత్ కు భగవంతునిపై భక్తి అనే విషయంలో కలిగిన సందేహాన్ని నివృత్తి చేశారు.    

శ్రీసాయి సత్ చరిత్ర 48వ.అధ్యాయాన్ని గమనిద్దాము.  అక్కల్ కోట నివాసి న్యాయవాది అయిన సపత్నేకర్ ఒక్కగానొక్క కొడుకు 1913వ.సంవత్సరంలో గొంతువ్యాధితో మరణించాడు.  ఈసంఘటనకి సపత్నేకర్ దంపతులు చాలా కృంగిపోయారు.  ఒకసారి సపత్నేకర్ భార్య కలలో లకడ్ షా వద్దనున్న బావిలో నీరు తోడుతూ ఉంది.  బాబా ఆమె వద్దకు వచ్చి "ఎందుకు కలత చెదుతావు?  నీకుండను నేను స్వచ్చమయిన నీటితో నింపెదను" అని దీవించారు.

 

చనిపోయిన ఆమె కొడుకు ఆత్మను బాబా తిరిగి ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టారు.  1914వ.సంవత్సరంలో బాబా అనుగ్రహంతో సపత్నేకర్ దంపతులకు కుమారుడు జన్మించాడు.   

శ్రీసాయి సత్ చరిత్ర 47వ.అధ్యాయంలో బాబా గౌరికి కలలో మహదేవునిగా దర్శనమిచ్చి, ఆమెను భర్త అనుమతితో తండ్రియిచ్చిన నగలను అమ్మి వచ్చిన ధనంతో దేవాలయం మరమ్మత్తుల కోసం విరాళం యిమ్మని చెప్పారు.  ఈవిధంగా బాబా తన భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారికి మంచి సలహాలు, సూచనలు యిస్తూ ఉండేవారు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 శివపురాణం వేదాంత సార సర్వస్వము



శివపురాణం వేదాంత సార సర్వస్వము. దీనిని వినిపించమని మహర్షులందరూ అడిగారు. ఇలా ఎందుకు చెప్పాడు సూతుల వారు అంటే ఒక వస్తువు గొప్పతనం చెప్పడం వలన దానియందు ఆదరణ, గౌరవము, శ్రద్ధ పెరుగుతాయి. అవి పెరిగితే విషయాన్ని సరిగ్గా గ్రహించగలవు. అందుకు పురాణంయొక్క మహిమని పేర్కొన్నాడు సూతుల వారు. "శంకరమ్ సంస్మరణ్ సూతః" - శంకరుని స్మరించి మొదలు పెట్టారు. అనామయుడైన శివుణ్ణి స్మరించి నేను చెప్తాను. ఆ శివుని స్మరించి మీరు వినండి. ఆమయము అంటే ఆధి, వ్యాధి, లోపములు, అజ్ఞానములు. ఆమయములు లేని వాడు శివుడొక్కడే. అందుకే ఆయన రోగంలేని పెద్ద డాక్టర్. అందుకే సంసార వైద్యః ఆయన. "భిషక్తమం త్వా భిషజాం శృణోమి" - అని ఉపనిషత్తు చెప్తున్నది. "ప్రథమో దేవ్యో భిషక్" అటువంటి ఆ వైద్య శిఖామణిని మనం స్మరించుకుంటున్నాం. నా ప్రయత్నం నేను చేస్తాను తరువాత మీఇష్టం అనే డాక్టర్ కాదు ఆయన. ఆయన చెయ్యి వేశాడా జబ్బు సమూలంగా నశిస్తుంది. అనామయం. అన్ని జబ్బులూ పోగొట్టేవాడు. అన్నింటికంటె పెద్ద జబ్బు సంసారం. దానికి వైద్యుడాయన. అందుకే భవరోగ హరుడు అని పేరు ఆయనకి, అనేక కల్పములు గడిచి ప్రస్తుత కల్పం ప్రారంభమైనది. ఆ సమయంలో ఆరు సముదాయములుగా ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగారు. మా మధ్య ఒక తేల్చరాని వివాదం వచ్చింది ఏది గొప్పది? అని. సృష్టికర్తవైన గురువువు కనుక నాశరహితమైన బ్రహ్మమేది? అన్నింటికీ కారణమైనదేది? చెప్పమని అడిగారు.

అన్ని తత్త్వములకంటె పూర్వమందున్నవాడు. సృష్టి అంతా తత్త్వములతో కూడియున్నది. అవి సాంఖ్యం ప్రకారం 24/25, ఆగమాల ప్రకారం 36 తత్త్వములు. సృష్టి ప్రారాంభం అయ్యాక ఈ తత్త్వములతో నడుస్తున్నది. సృష్టికి, మూలకములకుముందు ఉన్నది ఎవరు? తత్త్వములు అనగా సృష్టికి మూలకములు సర్వతత్వములకంటే ప్రాచీనమైనవాడు.,సర్వోత్కృష్టుడు, అతీతమైన వాడు ఎవరు? అని అడిగారు. "యతోవాచా నివర్తంతే" ఉపనిషద్వాక్యం అది. ఉపనిషద్వాక్యాలు కొల్లలు కొల్లలుగా పరిగెడతాయి శివపురాణంలో. ఉపనిషత్తులను ఆవుగా భావిస్తే ఆ ఆవు పొదుగు నుంచి వచ్చిన క్షీరమే శివతత్త్వం. మనసుకీ, మాటలకీ అందనిదీ, బ్రహ్మవిష్ణురుద్రాదులకు మూలమైనది. శివుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఒక్కడు అని కాదు శివపురాణ ప్రతిపాదన. వారికి మూలమై బ్రహ్మవిష్ణురుద్రాదులుగా ప్రవర్తిసున్నది. అచ్చమైన హైందవ ధర్మంలో పరతత్త్వ ప్రతిపాదన ఉన్నది. ఆ పరతత్త్వం బ్రహ్మవిష్ణు రుద్రాదులకంటే అతీతమైన వాడు. సృష్టి స్థితి లయ ఉన్నప్పుడే ఈ ముగ్గురూ ఉంటారు. సృష్టికి అతీతంగా ఉన్నది ఈ మూడూ కానిది. అయిన దైవము మహాదేవుడు, శివుడు అని చెప్పబడుతున్నాడు.

అరుణాచలేశ్వరుడు


===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?



అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
_____________________
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
_____________________
మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.

ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు

మన్వంతరము:-

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు

1. స్వాయంభువ మన్వంతరము
2. స్వారోచిష మన్వంతరము
3. ఉత్తమ మన్వంతరము
4. తామస మన్వంతరము
5. రైవత మన్వంతరము
6. చాక్షుష మన్వంతరము
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
8. సూర్యసావర్ణి మన్వంతరము
9. దక్షసావర్ణి మన్వంతరము
10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
11. ధర్మసావర్ణి మన్వంతరము
12. భద్రసావర్ణి మన్వంతరము
13. దేవసావర్ణి మన్వంతరము
14. ఇంద్రసావర్ణి మన్వంతరము

ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

• కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
• త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
• ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
• కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
• మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :-

స్వాయంభువ మన్వంతరము:-

• మనువు – స్వాయంభువు.
• భగవంతుని అవతారాలు – కపిలుడు, యజ్ఞుడు – దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.
• మనుపుత్రులు – ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు
• సప్తర్షులు – మరీచి ప్రముఖులు
• ఇంద్రుడు – యజ్ఞుడు
• సురలు – యామాదులు
• ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము

స్వారోచిష మన్వంతరము:-

• మనువు – అగ్ని కొడుకు స్వారోచిషుడు.
• మనువు పుత్రులు – ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు
• భగవంతుని అవతారాలు – విభువు – వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
• సప్తర్షులు – ఊర్జస్తంభాదులు
• ఇంద్రుడు – రోచనుడు
• సురలు – తుషితాదులు
• సురత చక్రవర్తి వృత్తాంతము

ఉత్తమ మన్వంతరము:-

• మనువు – ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
• మనువు పుత్రులు – భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
• భగవంతుని అవతారాలు – సత్య సేనుడు – ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
• సప్తర్షులు – ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
• ఇంద్రుడు – సత్యజితుడు
• సురలు – సత్యదేవ శృతభద్రులు

తామస మన్వంతరము:-

• మనువు – ఉత్తముని సోదరుడు తామసుడు.
• మనువు పుత్రులు – వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
• భగవంతుని అవతారాలు – హరి – హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
• సప్తర్షులు – జ్యోతిర్వ్యోమాదులు
• ఇంద్రుడు – త్రిశిఖుడు
• సురలు – విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)

రైవత మన్వంతరము:-

• మనువు – తామసుని సోదరుడు రైవతుడు
• మనువు పుత్రులు – అర్జున ప్రతినింద్యాదులు
• భగవంతుని అవతారాలు – వైకుంఠుడు – శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
• సప్తర్షులు – హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
• ఇంద్రుడు – విభుడు
• సురలు – భూత దయాదులు

చాక్షుష మన్వంతరము:-

• మనువు – చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
• మనువు పుత్రులు – పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు – అజితుడు, కూర్మావతారం – వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
• సప్తర్షులు – హవిష్మ దీరకాదులు
• ఇంద్రుడు – మంత్రద్యుమ్నుడు
• సురలు – ఆప్యాదులు

వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:-

ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
• మనువు – వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
• మనువు పుత్రులు – ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
• భగవంతుని అవతారాలు – కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
• సప్తర్షులు – కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
• ఇంద్రుడు – పురందరుడు
• సురలు – వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

(సూర్య) సావర్ణి మన్వంతరము:-

రాబోయే మన్వంతరము
• మనువు – సావర్ణి – విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
• మనువు పుత్రులు – నిర్మోహ విరజస్కాదులు
• భగవంతుని అవతారాలు – సార్వభౌముడు – వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
• సప్తర్షులు – గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
• ఇంద్రుడు – విరోచన సుతుడైన బలి
• సురలు – సుతపసులు, విజులు, అమృత ప్రభులు

దక్షసావర్ణి మన్వంతరము:-

• మనువు – వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
• మనువు పుత్రులు – ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
• భగవంతుని అవతారాలు – (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
• సప్తర్షులు – ద్యుతిమంతాదులు
• ఇంద్రుడు – అద్భుతుడు
• సురలు – పరమరీచి గర్గాదులు

బ్రహ్మసావర్ణి మన్వంతరము:-

• మనువు – ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
• మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు – భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
• సప్తర్షులు – హవిష్మంతుడు మున్నగువారు
• ఇంద్రుడు – శంభుడు
• సురలు – విభుదాదులు

ధర్మసావర్ణి మన్వంతరము:-

• మనువు – ధర్మసావర్ణి
• మనువు పుత్రులు – సత్య ధర్మాదులు పదిమంది.
• భగవంతుని అవతారాలు – సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
• సప్తర్షులు – అరుణాదులు
• ఇంద్రుడు – వైధృతుడు
• సురలు – విహంగమాదులు

భద్రసావర్ణి మన్వంతరము:-

• మనువు – భద్ర సావర్ణి
• మనువు పుత్రులు – దేవసుతాదులు
• భగవంతుని అవతారాలు – సత్య తాపసుడు – సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
• సప్తర్షులు – తపోమూర్త్యాదులు
• ఇంద్రుడు – ఋతధాముడు
• సురలు – పరితారులు

దేవసావర్ణి మన్వంతరము:-

• మనువు – దేవసావర్ణి
• మనువు పుత్రులు – విచిత్ర సేనాదులు
• భగవంతుని అవతారాలు – దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
• సప్తర్షులు – నిర్మోహ తత్వదర్శనాదులు
• ఇంద్రుడు – దివస్పతి
• సురలు – సుకర్మాదులు

ఇంద్రసావర్ణి మన్వంతరము:-

• మనువు – ఇంద్ర సావర్ణి
• మనువు పుత్రులు – గంభీరాదులు
• భగవంతుని అవతారాలు – సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
• సప్తర్షులు – అగ్నిబాహ్యాదులు
• ఇంద్రుడు – శుచి
• సురలు – పవిత్రాదులు

యుగాల మధ్య జరిగిన ఒక కథ:-

భాగవతం ఏకాదశ స్కందము నుండి : ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో – సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, “నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

కల్పము:-

కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కల్పముల పేర్లు
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో “శ్వేతవరాహ కల్పం” నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:
1. శ్వేత కల్పము
2. నీలలోహిత కల్పము
3. వామదేవ కల్పము
4. రత్నాంతర కల్పము
5. రౌరవ కల్పము
6. దేవ కల్పము
7. బృహత్ కల్పము
8. కందర్ప కల్పము
9. సద్యః కల్పము
10. ఈశాన కల్పము
11. తమో కల్పము
12. సారస్వత కల్పము
13. ఉదాన కల్పము
14. గరుడ కల్పము
15. కౌర కల్పము
16. నారసింహ కల్పము
17. సమాన కల్పము
18. ఆగ్నేయ కల్పము
19. సోమ కల్పము
20. మానవ కల్పము
21. తత్పుమాన కల్పము
22. వైకుంఠ కల్పము
23. లక్ష్మీ కల్పము
24. సావిత్రీ కల్పము
25. అఘోర కల్పము
26. వరాహ కల్పము
27. వైరాజ కల్పము
28. గౌరీ కల్పము
29. మహేశ్వర కల్పము
30. పితృ కల్పము
బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం? అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు. కృతయుగం——-17,28,000 త్రేతాయుగం—– 12,96,000 ద్వాపరయుగం— 8,64,000 కలియుగం——- 4,32,000 _____________________ 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. _____________________ మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు. ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు మన్వంతరము:- హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. మన్వంతరాల పేర్లు 1. స్వాయంభువ మన్వంతరము 2. స్వారోచిష మన్వంతరము 3. ఉత్తమ మన్వంతరము 4. తామస మన్వంతరము 5. రైవత మన్వంతరము 6. చాక్షుష మన్వంతరము 7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము 8. సూర్యసావర్ణి మన్వంతరము 9. దక్షసావర్ణి మన్వంతరము 10. బ్రహ్మసావర్ణి మన్వంతరము 11. ధర్మసావర్ణి మన్వంతరము 12. భద్రసావర్ణి మన్వంతరము 13. దేవసావర్ణి మన్వంతరము 14. ఇంద్రసావర్ణి మన్వంతరము ఎన్నెన్ని సంవత్సరాలు? దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును. • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు • మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము) ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము. వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :- స్వాయంభువ మన్వంతరము:- • మనువు – స్వాయంభువు. • భగవంతుని అవతారాలు – కపిలుడు, యజ్ఞుడు – దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు. • మనుపుత్రులు – ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు • సప్తర్షులు – మరీచి ప్రముఖులు • ఇంద్రుడు – యజ్ఞుడు • సురలు – యామాదులు • ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము స్వారోచిష మన్వంతరము:- • మనువు – అగ్ని కొడుకు స్వారోచిషుడు. • మనువు పుత్రులు – ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు • భగవంతుని అవతారాలు – విభువు – వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు. • సప్తర్షులు – ఊర్జస్తంభాదులు • ఇంద్రుడు – రోచనుడు • సురలు – తుషితాదులు • సురత చక్రవర్తి వృత్తాంతము ఉత్తమ మన్వంతరము:- • మనువు – ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు. • మనువు పుత్రులు – భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు • భగవంతుని అవతారాలు – సత్య సేనుడు – ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు. • సప్తర్షులు – ప్రమాదాదులు (వశిష్టుని సుతులు) • ఇంద్రుడు – సత్యజితుడు • సురలు – సత్యదేవ శృతభద్రులు తామస మన్వంతరము:- • మనువు – ఉత్తముని సోదరుడు తామసుడు. • మనువు పుత్రులు – వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు • భగవంతుని అవతారాలు – హరి – హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము) • సప్తర్షులు – జ్యోతిర్వ్యోమాదులు • ఇంద్రుడు – త్రిశిఖుడు • సురలు – విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు) రైవత మన్వంతరము:- • మనువు – తామసుని సోదరుడు రైవతుడు • మనువు పుత్రులు – అర్జున ప్రతినింద్యాదులు • భగవంతుని అవతారాలు – వైకుంఠుడు – శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు. • సప్తర్షులు – హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు • ఇంద్రుడు – విభుడు • సురలు – భూత దయాదులు చాక్షుష మన్వంతరము:- • మనువు – చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు • మనువు పుత్రులు – పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు • భగవంతుని అవతారాలు – అజితుడు, కూర్మావతారం – వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు. • సప్తర్షులు – హవిష్మ దీరకాదులు • ఇంద్రుడు – మంత్రద్యుమ్నుడు • సురలు – ఆప్యాదులు వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:- ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. • మనువు – వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది. • మనువు పుత్రులు – ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు. • భగవంతుని అవతారాలు – కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. • సప్తర్షులు – కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు • ఇంద్రుడు – పురందరుడు • సురలు – వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు (సూర్య) సావర్ణి మన్వంతరము:- రాబోయే మన్వంతరము • మనువు – సావర్ణి – విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు. • మనువు పుత్రులు – నిర్మోహ విరజస్కాదులు • భగవంతుని అవతారాలు – సార్వభౌముడు – వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌమ🌹🌹🌹🌹

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి



త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.

01. స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.

బహిర్యాగంతో పూజించబడుతుంది.

02. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

03. పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. దంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే …

పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.

దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.

మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి ‘పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.

దానికి హయగ్రీవుడు ‘మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే’ అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.

అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.

భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.

అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు ‘కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి ‘ అనే నామం ఏర్పడింది.

అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.

​భోగి పండుగ రోజు మంటలు వేయడంలోని పరమార్థంఏమిటి?​



సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి.

భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు.

 భోగిమంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా రగిలించాలట.

ఇందుకోసం సూర్యాదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది.

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు.


ఇలాంటి భోగిమంటల వల్ల వెచ్చదనం మాటేమోగానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం.

మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగిమంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగిమంటలు వేసుకోవాలా! లేకపోతే నాలుగుకాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

Thursday 12 January 2017

బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు

1)వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
2)రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
 3)శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
 4)పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  5)బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
 6)చోళమండలం నష్టాలపాలౌతుంది.
    వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
  7)ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
    8)జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
    9)దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
    10)మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
    11)అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
    12)నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
    ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
    13)మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
    14)పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
    15)ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
    16)వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
    17)ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
    18)చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
    19)కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
    20)ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
   21)ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
    22)వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
    23)కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
    24)తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
 25)ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
    26)పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
    విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
    27)రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
    28)శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
    29)శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
    30)సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
    31)విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
    32)గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
    33)సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
  34)నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
     35)విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
   36)ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
   37)కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  38)బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
39)నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను.

నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
    40)ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
    41)14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
    44)నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
    45)5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
    46)కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లా

డుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
    47)కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
    48)మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
    49)పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
    50)పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
    51)బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
    52)గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
    53)అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
    54)గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
    55)మహానంది మరుగున మహిమలు పుడతాయి.
    56)నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
    56)మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
    57)కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
    58)ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
    59)పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
    60)కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
    61)కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
    62)ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
    63)పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
   
64)రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
  65)శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
    66)ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
    67)వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
    68)విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.
పుష్పగిరిసవరించు

    నేను కలియుగం 5,000 సంవత్సరంలో వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
    నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
    వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
    బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
    నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్క

డి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
    నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
    నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
    కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
    నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
    వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
    అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
    నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
    నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
    ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
    హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
    అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
    నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
    వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
    శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
    శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
    బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
    కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
    సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
    శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
    బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
    శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
    పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
    స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.

పంచాననంవారికి జ్ఞానబోధసవరించు

    మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
    నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
    ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
    కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
    రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
    చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొంక్ల్డల్క్ల్క్ల్ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.

గతజన్మ వృత్తాంతంసవరించు

ఒకకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.

"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్ర

హ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశ్శాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."

    నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
    ఆ తరువాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
    శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
    పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
    మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
    వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
    గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
    కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
    నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.

కర్నూలు నవాబుకు జ్ఞానబోధసవరించు

    క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
    చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
    నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
    అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
    తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
    ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
భార్య గోవిందమ్మకు జ్ఞానబోధసవరించు

వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.

    బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
    మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
    కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
    కంచి కామాక్షమ్మ కంట కన్నీNiరు కారుతుంది.
    కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
    అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.

Friday 30 December 2016

పుష్య మాసం


చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.

ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

Wednesday 21 December 2016

చాలామందికి ఈ సందేహం వుంది



కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు.  కొందరు రెండు పూటలా చేస్తారు

కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…

ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు.

వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది.

ఇలాంటివారికి ఏ సమస్యాలేదు.కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు.

ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది.ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు.

మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను.

సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు.నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు.అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం.పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు.అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట.ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా.అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు.అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు.అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు.మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి.చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు.అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు.శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుకబెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు.. వీలుకానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు

Sunday 18 December 2016

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

Mahabharatam

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

త్రిమూర్తులు ,Trimurtulu



Brahmavishnumaheshwara

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.


* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.



* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.



* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.


విశేషాలు


* ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.

కార్తీక మాసం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు..?? స్నానాలు ఎన్ని రకాలు..??

Dhyanam siva


 స్నానము అనేది శరీర శుభ్రత కోసము. అది ఏ కాలములో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము మాత్రం ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయాన్నే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే శరీరం లోకి చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం ఉష్ణశక్తి ప్రవహిస్తూ, ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణశక్తి ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో ఉష్ణశక్తి కొత్తగా తయారు అవుతూ బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro-magnetic Activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీక మాసంలో పుణ్యము కోసం స్నానాలు చేసే స్నాన విధాలు:
1. దివ్య స్నానం : ఉత్తరాయణంలో ఎండతో పాటు వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం.


2. ధ్యాన స్నానం : గంగ, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం.

3. మంత్ర స్నానం : మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం.

4. మాన స్నానం : విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు.

5. వారుణ స్నానము : గోవిందా, హర హర అని దేవున్ని తలచుకొని స్నానము చేయుట .

6. కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము, పుండు ఉన్నచో, బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి, బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము.

7. ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు ఎండలో గోవిందనామము ను ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు నేను స్నానము చేస్తున్నాను అని భావించి శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

ఇవి మనకు శాస్త్రలు తెలిపిన స్నానములు. మంచిగా స్నానము చేస్తే చర్మవ్యాధులు వచ్చే అవకాశము కూడా తక్కువే. అందరికి ఈరోజు శుభదినం కావాలని మనసారా  కోరుకొంటూ..
    

శివధనుస్సు

Shiva dhanadu


రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్
అన్నారు.

అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.🙏🌺🙏

వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతులు


వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతులు :
ముద్గల పురాణాన్ని అనుసరించి 32 గణపతులు ఉన్నారు.

1.బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి
5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి
9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి
13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి
16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి 21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి
25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి
29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి.

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

*విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి
3. క్షిప్ర గణపతి 4. వక్రతుండ గణపతి
5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి
7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి
10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి
12. త్రైలోక్య గణపతి 13. హరిద్రా గణపతి
14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి.

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి 5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ
10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి 14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి 18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ.       

             జై భోలో గణేష్ మహరాజ్ కీ....జయ్

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles