Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Tuesday 17 January 2017

దేవసేనపతిగా ఖ్యాతి ఎలా వచ్చింది?

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.
“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.
ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను.  సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి,  వివిధ ధాతువులుగా రూపొందెను.
ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి. 
పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

ఏకాదశి కథ

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.
ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
తాత్త్విక సందేశం:
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

పండగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.

2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

3. అసత్య మాడరాదు.

4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

7 .మరునాడు అన్నదానం చేయాలి..

ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు. 
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలొనున్నవి.

మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి పర్వదినం బహుళ ఏకాదశి పర్వదినం

చైత్రము విష్ణువు కామదా వరూథినీ

వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా

జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ

ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా

శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా

భాద్రపదము హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా

ఆశ్వయుజము పద్మనాభుడు పాశాంకుశ రమా

కార్తీకము దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి

మార్గశిరము కేశవుడు ధృవ, మొక్షద సఫల

పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా

మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ

ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ

అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం

చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి

మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది?

భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు" 

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. 

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు. 

"అదేలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

జయ జయ శంకర !  హర హర శంకర !! గురుభ్యో నమ:

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి?


ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన.

ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర యోజన దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.

ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా?
ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!

కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

Friday 13 January 2017

శివ పరమాత్మకు మనకు ఉన్న సంబందం ఏమిటీ?


శివ అనగా కళ్యాణకారి  అని అర్ధము
పరమ్ అనగా అతీతమైన అని అర్ధము , తండ్రి ఎలా ఆత్మయో మనము కూడా అలా ఆత్మలమే (తండ్రి యే రూపమో పిల్లలూ అదే రూపము )
శివ పరమాత్మ మన అందరి ఆత్మలకు తండ్రి మనము ఆత్మలము , మన అందరికీ ఆత్మీక తండ్రి శివ పరమాత్మ , ఆయనే మనకు తండ్రి , శిక్షకుడు , సధ్గురువు . మన కోసం శివుడు పరందామము నుంచి ప్రతీ 5000 సం" లకు వక్కసారి మనలను రక్షించడానికి ఈ కలియుగము అంతిమము మరియూ  సత్య యగము ఆదీ సమయము అయిన ఈ కళ్యాణ కారీ పురుషోత్తమ సంగమ యుగము అయిన ఈ సమయంలో ఈ భారత దేశములోకే మన పుణ్య భూమిలోకి శివ పరమాత్మ వచ్చి మనకు గీతా జ్ఞానమును , రాజయోగమును నేర్పి మన కోసం నూతన ప్రపంచ (సత్య యుగమును) స్ధాపన చేస్తున్నారు (ఏక ధర్మ స్థాపన అనేక ధర్మముల వినాసనము ) మన అందరికీ ఇద్దరు తండ్రులుంటారు , ఒకరు లౌకిక (ఈ దేహానికి )తండ్రి , ఇంకొకరు శివ పరమాత్మ మనకందరికీ పారలౌకిక తండ్రి , అందుకే మన అందరము దేవాలమాలకు వెల్లినప్పుడు తండ్రి అని ఒక్క శివ పరమాత్మ ఒక్కరినే తండ్రి అంటాము శివ పరమాత్మ మనకందరికీ పారలౌకిక తండ్రి .

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు

రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన  రహస్యాలు ఇవే …తప్పకుండా తెలుసుకోవాలి..ఇలా చెబుతాడు. బ్రాహ్మనులలోని పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ఏమి చెప్పాడంటే…
.మన రధసారధితో , కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా , ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.
.ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.
.నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు..నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
.దేవుడుని ప్రేమించవచ్చు లేదా ద్వేషించ వచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృడ నిశ్చయంతో ఉండాలి.
.రాజుకు యుద్ధం లో గెలవాలని కోరిక ఉండాలి కాని ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
.ఇతరులుకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే  విజయం సొంతం అవుతుంది.
ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఎంతో విలువైనవి రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మనుడిని వెళ్లి తెలుసుకోమని ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుని నలుగురికి తెలియజేద్దాం.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles