Showing posts with label మంత్రాలు. Show all posts
Showing posts with label మంత్రాలు. Show all posts

Friday 2 December 2016

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి???

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి? తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.



తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.



పాడ్యమి : అధిదేవత – అగ్ని. వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత – అశ్విని దేవతలు. వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత – గౌరీ దేవి. వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత – వినాయకుడు. వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత – నాగ దేవత. వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత – సూర్య భగవానుడు. వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత – అష్టమాత్రుకలు. వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత – దుర్గాదేవి. వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత – కుబేరుడు. వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత – విష్ణువు. వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత – ధర్ముడు. వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత – రుద్ర. వ్రత ఫలం – మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు – పితృదేవతలు. వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత – చంద్రుడు. వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

షట్పదీ స్తోత్రం భావార్ధం


షట్పదీ స్తోత్రం లో సాధకుడు విష్ణువును ఏమి కోరుతూ ప్రార్థించాలో సూచించారు. ఈ శ్లోకంలో ఆరు ఆరు చిన్న శ్లోకాలు (ఏడో శ్లోకం ముక్తాయింపు) ఉన్నాయి.
ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు. ఆరుశ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు.


శ్లో 1:   అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్,
         భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: ||

అన్న సాధకుడి ప్రార్థన ఈ స్తోత్రంలో మొట్టమొదటి ‘శ్లోకం’. ‘విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయసుఖాల మృగతృష్ణలు శమింపజేయి. నాలో భూతదయను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు’. మోక్షసాధనకుమొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనో నిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృప వల్ల జయింపవచ్చు అని ఆచార్యుల మతం.


శ్లో 2 :  రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు
          దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
          శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే ||

భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్థానం. దివ్యధుని మకరందాలు. ఆ పాదారవిందాల పరిమళాన్ని అనుభవించటమే సత్-చిత్-ఆనందం.
ఆ తర్వాత సాధకుడు భగవంతుడితో ఇలా అంటాడు; ‘జగన్నాథా, జ్ఞానప్రాప్తి తరవాత మన మధ్య భేదం తొలగి పోతుంది, కానీ అప్పటివరకూ నేను నీ వాడినే గాని నువ్వు నా వాడివి కావు. తరంగం సముద్రంలో భాగం, కానీ సముద్రం తరంగంలో భాగం ఎప్పటికీ కాదు’.

శ్లో 3:  సత్యపిభేదాపగమేనాథతవాహం నమామకీనస్త్వం
          సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోనతారంగ:

వేదాంత శ్లోకాలలో కూడా కావ్యశ్లోకాలను మించే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ప్రయోగించటం ఆచార్యుల వారికి అలవాటే. ఈ శ్లోకంలో యమకాలూ, ముక్తపద గ్రస్తాలూ చూడండి:

శ్లో 4:  ఉదృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే
         దృష్టేభవతిప్రభవతి నభవతికీం భవతిరస్కార:

గోవర్ధన నగాన్ని ఉద్ధరణ చేసినవాడా! నగభిత్తు ఇంద్రుడి సోదరుడా! రాక్షసుల అమిత్రా! సూర్యచంద్రులు కన్నులుగలవాడా! నిన్ను దర్శించగా, సమర్థత కలుగుతుంది. భవ దు:ఖనాశనం జరగకుండా ఉంటుందా?

శ్లో 5:   అయిదో శ్లోకం మత్స్యావతారాన్ని స్మరించి
         మత్స్యదిభిరవతారై రావతారవతావతా సదా వసుధాం
         పరమేశ్వరా! పరిపాల్యో భవతా భవథాపభీతోహమ్

ఆ అవతారంలో భూమిని రక్షించినట్టే, ఇప్పుడు భవభయంలో వణుకుతున్న నన్నూ రక్షించమణి వేడుకొంటాడు.

శ్లో 6:   ఆరో శ్లోకంలో కూర్మావతారాన్ని ప్రస్తావించి
         దామోదర! గుణమంధిర! సుందరవదనారవింద! గోవింద
         భవజలధి మధనమందర! పరమందరం మపనయత్వం మే!

భవజలధి మథనానికి నువ్వే కవ్వంగా నిలిచే మందర పర్వతానివి. అపరిమితమైన నా భయాన్ని – ‘పరమం దరం’ – నువ్వే పోగొట్టాలి అని ప్రార్థిస్తాడు.


శ్లో 7 :  నారాయణ! కరుణామయ!, శరణం కరవాణితావకౌచరణౌ
          ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు!

నారాయణా! కరుణానిధీ! నీ చరనద్వయమే శరణు కోరుతాను! ఈ షట్పది, నా ముఖ కమలంలో సదా వసించుగాక! అంటూ షట్పదీ (స్తోత్రం), ముఖ కమలం పదాల వల్ల సిద్ధించిన మనోహరమైన శ్లేషలో ఈ స్తోత్రం ముగుస్తుంది. అంటే కేవలం జ్ఞానమార్గం అవలబించగోరే వేదాంతికికూడా, ఆమార్గంలో సాధన చేసేందుకు కావాల్సిన శమదమాలకు స్వామికృప తప్పదని ఆచార్యులబోధ.

శివమానసపూజ

Related image
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || ౧ ||
సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || ౨ ||
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || ౩ ||
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || ౪ ||
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || ౫ ||

Sunday 27 November 2016

సూర్యోపాసన


సనాతన హిందూ ధర్మంలో  హిందువులమైన మనం అవ్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!!
"ఆత్మవత్ సర్వ భూతాని"  నాలో నున్న 'ఆత్మజ్యోతి' అన్నిజీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది ! అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !!
అందుకే  హిందువు  చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాడు ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు తెలిసి చేసే దివ్యత్వం !!
అంతటా వున్న భగవంతుడు నేను పూజించే   ఈ  'విగ్రహం, లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే !!ఉపాసన !! మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి !
అందులో  'సూర్యోపాసన' ముఖ్యమైనది !!
సూర్యుడు ప్రత్యక్ష దైవం ! ఈ జగత్తుకంతటికీ వెలుగును
వేడిమిని ప్రసాదించే  పరంజ్యోతి స్వరూపుడు !!
మన భౌతికమైన కనులతో చూడ గలిగే 'సూర్యనారాయణుడు' !  ఆరోగ్య ప్రధాత !
"ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ " అంటుంది శాస్త్రం !
సూర్యభగవానుడు " నమస్కార ప్రియుడు" !!
ప్రతి  రోజు  సూర్య  నమస్కారములను  చేయండి !!
ఆరోగ్యాన్ని పొందండి !!

                  -: సూర్యధ్యానం :-

"ద్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణ సరసిజాసన సన్నివిష్టః !
కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీ
హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః !!

తాత్పర్యం :- సర్వాలంకార భూషితుడును, శంఖ,చక్ర, గదా
పద్మములను ధరించిన వాడును, పద్మాసన స్థితుడును,
హిరణ్మయ స్వరూపుడును, "సూర్యమండలాంతర్గతుడైన
శ్రీ సూర్య నారాయణుని " మేము  ఆరాధించుచున్నాము !!
గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన " అష్ట ప్రకృతుల"లో, పరమ శివుని
"అష్ట మూర్తుల" లో సూర్యుడు ఒకరు !!

            -:  సూర్యనమస్కార మంత్రములు :-

1 - ఓం  మిత్రాయ  నమః
2 - ఓం  రవయే  నమః
3 - ఓం  సూర్యాయ  నమః
4 - ఓం  భానవే  నమః
5 - ఓం  ఖగాయ  నమః
6 - ఓం  పూష్ణే  నమః
7 - ఓం  హిరణ్యగర్భాయ నమః
8 - ఓం  మరీచయే  నమః
9 - ఓం  ఆధిత్యాయ  నమః
10 - ఓం  సవిత్రే  నమః
11 - ఓం  అర్కాయ నమః
12 - ఓం  భాస్కరాయ  నమః
" ఓం  శ్రీ  సవితృ  సూర్య  నారాయణాయ  నమః "

" ఆధిత్యస్య నమస్కారాన్  యే కుర్వంతి  దినే  దినే !
ఆయుః  ప్రజ్ఞా  బలం వీర్యం  తేజస్తేజాంచ జాయతే !!

మనం ప్రతి రోజు సూర్య నమస్కారాలను చేద్దాము !!
మన ధర్మాన్ని  మనము  కాపాడుకుందాము !!
విశ్వశాంతి వర్ధిల్లును గాక ! శుభమ్  భూయాత్ !

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles