సనాతన హిందూ ధర్మంలో హిందువులమైన మనం అవ్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!!
"ఆత్మవత్ సర్వ భూతాని" నాలో నున్న 'ఆత్మజ్యోతి' అన్నిజీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది ! అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !!
అందుకే హిందువు చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాడు ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు తెలిసి చేసే దివ్యత్వం !!
అంతటా వున్న భగవంతుడు నేను పూజించే ఈ 'విగ్రహం, లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే !!ఉపాసన !! మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి !
అందులో 'సూర్యోపాసన' ముఖ్యమైనది !!
సూర్యుడు ప్రత్యక్ష దైవం ! ఈ జగత్తుకంతటికీ వెలుగును
వేడిమిని ప్రసాదించే పరంజ్యోతి స్వరూపుడు !!
మన భౌతికమైన కనులతో చూడ గలిగే 'సూర్యనారాయణుడు' ! ఆరోగ్య ప్రధాత !
"ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ " అంటుంది శాస్త్రం !
సూర్యభగవానుడు " నమస్కార ప్రియుడు" !!
ప్రతి రోజు సూర్య నమస్కారములను చేయండి !!
ఆరోగ్యాన్ని పొందండి !!
-: సూర్యధ్యానం :-
"ద్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీనారాయణ సరసిజాసన సన్నివిష్టః !
కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీ
హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః !!
తాత్పర్యం :- సర్వాలంకార భూషితుడును, శంఖ,చక్ర, గదా
పద్మములను ధరించిన వాడును, పద్మాసన స్థితుడును,
హిరణ్మయ స్వరూపుడును, "సూర్యమండలాంతర్గతుడైన
శ్రీ సూర్య నారాయణుని " మేము ఆరాధించుచున్నాము !!
గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన " అష్ట ప్రకృతుల"లో, పరమ శివుని
"అష్ట మూర్తుల" లో సూర్యుడు ఒకరు !!
-: సూర్యనమస్కార మంత్రములు :-
1 - ఓం మిత్రాయ నమః2 - ఓం రవయే నమః
3 - ఓం సూర్యాయ నమః
4 - ఓం భానవే నమః
5 - ఓం ఖగాయ నమః
6 - ఓం పూష్ణే నమః
7 - ఓం హిరణ్యగర్భాయ నమః
8 - ఓం మరీచయే నమః
9 - ఓం ఆధిత్యాయ నమః
10 - ఓం సవిత్రే నమః
11 - ఓం అర్కాయ నమః
12 - ఓం భాస్కరాయ నమః
" ఓం శ్రీ సవితృ సూర్య నారాయణాయ నమః "
" ఆధిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే !
ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాంచ జాయతే !!
మనం ప్రతి రోజు సూర్య నమస్కారాలను చేద్దాము !!
మన ధర్మాన్ని మనము కాపాడుకుందాము !!
విశ్వశాంతి వర్ధిల్లును గాక ! శుభమ్ భూయాత్ !