3 వ శ్లోకం:--
శ్రీభగవానువాచ |
లోకేஉస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
ఙ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||
భావం:--
శ్రీ భగవానుడు పలికెను--- ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.
4 వ శ్లోకం:--
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోஉశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||
భావం:--
మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగానిష్టాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు.
25 వ శ్లోకం:--
అవ్యక్తోஉయమచింత్యోஉయమవికార్యోஉయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
భావం:--
ఈ ఆత్మ అవ్యక్తమైనది. (ఇంద్రియగోచరము కానిది) అచింత్యము, (మనస్సునకు అందనిది) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జునా ! నీవు దీనికై శోకింపతగదు.
26 వ శ్లోకం:-
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ||
భావం:--
ఓ అర్జునా ! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ, నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు.
27 వ శ్లోకం:--
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేஉర్థే న త్వం శోచితుమర్హసి ||
భావం:--
ఏలనన, పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.
28 వ శ్లోకం:--
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
భావం:--
ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుటకుముందు ఇంద్రియగోచరములు కావు. (అవ్యక్తములు) మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జననమరణల మధ్యకాలమందు మాత్రమే అవి ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
29 వ శ్లోకం:--
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||
భావం:--
ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని(ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు.
30 వ శ్లోకం:--
దేహీ నిత్యమవధ్యోஉయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||
భావం:--
ఓ అర్జునా ! ప్రతీ దేహమునందు ఉండెడి ఈ ఆత్మా వధించుటకు వీలుకానిది. కనుక, ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు.
31 వ శ్లోకం:--
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోஉన్యత్క్షత్రియస్య న విద్యతే ||
భావం:--
అంతేగాక, సర్వధర్మమునుబట్టియు, నీవు భయపడనవసరము లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుధ్హమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యమునకు మరియొకటి ఏదియును లేదు.
32 వ శ్లోకం:--
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ||
భావం:--
ఓ పార్థా ! యాదృచ్చికముగా అనగా-- అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది.
33 వ శ్లోకం:--
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||
భావం:--
ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరిపకున్నచో, నే స్వధర్మమునుండి పారిపోయినవాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదవు. పైగా నేవు పాపము చేసినవాడవు అగుదవు.
34 వ శ్లోకం:--
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేஉవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ||
భావం:--
లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది.
51 వ శ్లోకం:-
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ||
భావం:--
ఏలనన, సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు.
52 వ శ్లోకం:--
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||
భావం:--
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.
భగవద్గీత:--అథ ద్వితీయోஉధ్యాయః 57, 58 శ్లోకాలు
57 వ శ్లోకం:--
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||
భావం:--
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితులయందు హర్షము. ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.
58 వ శ్లోకం:--
యదా సంహరతే చాయం కూర్మోஉంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||
భావం:--
తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియముల (విషయాదుల) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను.