Tuesday 31 January 2017

కార్తీక సిరి "ఉసిరి"

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు  కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం ,పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో  ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే  హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన  కనక ధారా స్తవం  మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మ చారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని  కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతి స్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.

శ్రీ విజయగణపతి దేవస్థానం ఖమ్మం

🚩శ్రీ విజయగణపతి దేవస్థానం ఖమ్మం 🚩

జాతకం లేని వారికి శాంతులు

1)జాతకం లేని వారికి శాంతులు అంటే పుట్టిన సమయం లేని వారికి. ఐతే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.గోధుమలతో చేసిన పదార్ధములు,క్యారెట్,రాగి చెంబులో వాటర్ త్రాగటం వలన కూడ సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.
2)రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,యెర్ర గుడ్డ,ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేఇంచండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.
3) మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? ఐతే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
4) మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేఇంచండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేఇస్తే ఇంకా మంచిది. (లేదా)" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.
5)వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.
6)ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.
7)డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేఇంచండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.
8)ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.
9)హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.
✍కొదమసింహం భరద్వాజ్✍

జ్యోతిష్యం అనే పదంలో జ్యోతి ఎందుకు వుంది?


ఎందుకంటే.. అది జ్యోతిలా భవిష్యత్ మార్గాన్ని సూచిస్తుంది!
అంతే తప్ప జ్యోతిష్యుడి వద్దకు వెళ్లినందుకు డాక్టర్ అవసరం లేకుండా రోగం తగ్గదు, ఇంజనీర్ అవసరం లేకుండా ఇల్లు రెడీ అయిపోదు, ఓట్ల అవసరం లేకుండా రాజకీయ నేతలు ఎన్నికలు గెలిచేయరు!
జ్యోతిష్యం పంచే జ్యోతి వెలుగును చూసుకుని కూడా... ఇష్టానుసారం పోతూ వుంటే గుంతల్లో పడతారు! దానికి జ్యోతిష్యానిది బాధ్యత కాదు...

ప్రధాన అర్చకత్వం చేస్తూ తరిస్తున్నారు రమణ దీక్షితులు.

సప్తగిరులపై వెలసిన ఆ వేంకటేశుడిని ఒక్క క్షణం దర్శించుకుంటే జీవితం తరిస్తుందని అనుకుంటారు. అలాంటిది దేవదేవుని సన్నిధిలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రధాన అర్చకత్వం చేస్తూ తరిస్తున్నారు రమణ దీక్షితులు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయనిచ్చిన ఇంటర్వ్యూ.

మా తండ్రిగారు వేంకటపతి దీక్షితులు. తల్లి సౌభాగ్యలక్ష్మి. వారికి నేన్కొకడినే సంతానం. నాన్నగారు తిరుమల ప్రధానార్చకులుగా చేశారు. నేను పుట్టింది, పెరిగింది తిరుపతి, తిరుమలలోనే. అప్పట్లో తిరుపతి చిన్నగ్రామం. నాకు ఊహ తెలిసినప్పటికి తిరుపతిలో రెండు కార్లు, నాలుగు స్కూటర్లు ఉండేవి. రెండు సినిమా థియేటర్లు ఉండేవి అంతే.

అందుకే వెళ్లలేదు..

తిరుపతి మున్సిపల్‌ హైస్కూలులోనే చదువుకున్నా. ఇక్కడి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మాలిక్యులర్‌ బయాలజీలో పీజీ, పీహెచ్‌డీ చేశాను. చిన్నప్పటి నుంచి నేను అర్చకునిగా వస్తానని తెలుసు. మా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచారు. నేను అలాగే పెరిగాను. ఆహార నియమాల్లో కఠిన నియమాలు పాటిస్తుంటాను. అన్నం తినను. కాయగూరలు మాత్రమే భుజిస్తాను. నేను పీజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు వైకుంఠప్రాప్తి చెందారు. దీంతో ల్యాబ్‌ వదిలి ఆలయానికి వచ్చేశాను. పీహెచ్‌డీ తర్వాత హ్యూమన్‌ క్యాన్సర్‌ మీద పరిశోధన చేయడానికి అమెరికాలోని సౌత్‌ కెరొలినాకు రమ్మని పిలిచారు. సముద్రం దాటితే స్వామివారి కైంకర్యాలకు దూరం కావాల్సి వస్తుందని వెళ్లలేదు. ఇంకా ల్యాబ్‌లో ఏదో చేయాలనే తపన మాత్రం అలాగే ఉంది.

సైన్స్‌ ఉపయోగపడింది..

సైన్స్‌, ఆధ్యాత్మిక రంగం విరుద్ధమైనవనే భావన తప్పు. మేధావుల దృష్టిలో ఆధ్యాత్మికత కూడా సైన్సే. మన వేదాల్లో సైన్స్‌కు అందని ఎన్నో విషయాలు ఉన్నాయి. రాజకీయాలు, వైద్యం, ఆయుధాలు, యుద్ధవ్యూహాలు, ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలు ఇవన్నీ వేదాల్లోనూ ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు, వేదాల్లోని చిన్న అంశాల విశ్లేషణే సైన్స్‌. నేను చదువుకున్న సైన్స్‌.. వేదాల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అర్థం కాని చాలా ప్రశ్నలకు ధ్యాన ముద్రలో స్వామివారిని అడిగి సమాధానం తెలుసుకున్నా..!

ఆకాశమంత కనిపించారు..

మూలవరులకు, నాకు ప్రశ్నలతోనే పరిచయం మొదలైంది. 1967లో స్వామివారిని మొట్టమొదటిసారి స్పృశించాను. దానిని పాదసేవ అంటారు. అది చేస్తే గాని స్వామిసేవకు అర్హత పొందలేం. ఆ రోజు స్వామివారిని చూసి భయపడ్డాను. పాదాల చెంత కూర్చుని శ్రీవారిని చూస్తే.. ఆకాశమంత కనిపించారు. కొంత భయమేసింది. 1974లో రక్షాబంధనం కట్టుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా. పీహెచ్‌డి పూర్తయ్యాక 1977లో పూర్తిస్థాయిలో ప్రధాన అర్చకత్వం స్వీకరించాను. స్వామివారి కైంకర్యాలు అర్థం కావడానికి రెండేళ్లు పట్టింది. స్వామివారికి ఎందుకు ఆరాధన చేయాలి..? ఇది నా మొదటి ప్రశ్న. నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పెద్దలను సంప్రదించాను, పుస్తకాలు చదివాను.. అయినా జవాబు దొరకలేదు. స్వామివారి ముందు ధ్యానంలో ఉండగా నాకు సమాధానం దొరికింది.

కోరికలు గుర్తుకురావు
స్వామివారి మూలమూర్తికి సంబంధించి చాలా మంది భక్తులు సందేహాలు అడుగుతుంటారు. స్వామివారిది దృవబింబం. ఉదయం వేళలో బాల్యంలో, మధ్యాహ్నం యవ్వనంలో, రాత్రిపూట వృద్ధాప్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. ఉదయం పూట స్వామిని దర్శించుకున్నవారికి విద్య ప్రాప్తితో పాటు ఆయుష్షు పెరుగుతుంది. మధ్యాహ్నం వేళలో దర్శించుకున్న వారికి దేహదారుఢ్యం, తేజస్సు, సౌభాగ్యం సిద్ధిస్తుంది. సాయంత్రం దర్శించుకున్నవారికి దివ్యమైన జ్ఞానం, మోక్షప్రాప్తి లభిస్తాయని ఆగమాలు చెబుతున్నాయి. అలాగే ‘ఎన్నో కోర్కెలతో కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోగానే ఏమీ కోరుకోకుండానే వచ్చేస్తాం’ అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. భక్తులకే కాదు, గంటల తరబడి స్వామి సన్నిధిలో ఉండే అర్చకులదీ ఇదే పరిస్థితి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడంతో కోరికలు మరచిపోతాం. శ్రీవారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలసిన మహావిష్ణువును సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వారందరి మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన వలయంగా ఉంటుంది. ఈ శక్తి ముందు మానవ మేధస్సు ఎంత..? ఏదీ ఆలోచించలేదు. స్వామివారిని చూసి తరించడం తప్ప మరే ఆలోచనలకూ అక్కడ చోటుండదు.

అందరికీ అదే భావన..
స్వామి అలంకరణలో మా ప్రమేయం ఏమీ ఉండదు. ఆయనకు నచ్చినట్టుగా మాచేత అలంకారాలు చేయించుకుంటాడు. అలంకరణ పూర్తయి గర్భాలయం నుంచి బయటకు రాగానే స్వామి రూపం చెదిరిపోతుంది ఆగమాల్లో శ్రీవారి గురించి చెబుతూ ‘అతృప్తి రూపాయా’ అన్నారు. ఎంత చూసినా తనివితీరని రూపం అది. గంటల తరబడి స్వామి వద్ద గడిపిన అర్చకులకు, గంటపాటు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే భక్తులకు, క్షణకాలం దర్శన భాగ్యంతోనే వెనుతిరిగే భక్తులకు.. ఎవరికీ ఈ విషయంలో తేడా లేదు. మళ్లీ స్వామి వారి దర్శనం ఎప్పుడనే తపన తప్ప.. తనివితీరా చూసేశామన్న తృప్తి మిగలదు.

ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామివారి సేవకునిగా పనిచేసే భాగ్యం దక్కింది. ఈ జన్మకిది చాలు. నాకు ముగ్గురు కుమారులు. ముగ్గురు స్వామివారి సన్నిధిలో అర్చకత్వం చేస్తున్నారు. వీరే కాదు.. మా వంశం ఉన్నంత వరకు స్వామి సేవలో తరించే భాగ్యం ప్రసాదించమని ఆ శ్రీహరిని కోరుకుంటాను.

విగ్రహంగా చూడొద్దు

మూలవరుల విగ్రహానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మూలమూర్తిని తాకితే మనిషిని తాకినట్లే ఉంటుందని, గోళ్లు పెరుగుతాయని, తలపై పొడవాటి కురులు ఉన్నాయని చెప్పుకుంటారు. ఇవన్నీ అసత్యాలు. ఇవి మానవ లక్షణాలు. నశించే దేహానికి ఉండే లక్షణాలు. శ్రీ వేంకటనాధుని దర్శించే సమయంలో మనుష్య రూపంలో ఊహించుకోకూడదు. ఆ మూలమూర్తిని 9.5 అడుగుల విగ్రహంగా చూడకూడదు. ఆ స్వరూపాన్ని బ్రహ్మాండాలను దాటి ఉన్న మహాస్వరూపంగా భావించాలి.

దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం

శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,

శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

శ్రీదేవీ విశేషణాని – నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |

ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||

అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||

సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||

ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||

ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||

లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||

అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||

మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ||

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||

|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

శత్రునాశన హనుమాన్స్తోత్రమ్


పంచవక్తం మహాభీమంత్రిపంచ
నయ నైర్యుతమ్ దశభిర్ణాహుభిర్యక్తం
సర్వకామార్థసిద్దదమ్
పూర్వేతు వానరంవక్తం

హృదయం సూర్య సన్నిభమ్
సూర్యకోటి కరాభాసం
కపివక్తం సు తేజసమ్
దంప్తాకరాళ వదనం భృకుటీ

కుటిలేక్షణమ్ అస్యప్రదక్షిణం
వక్తృం నారసింహం మహాద్దుతమ్
అత్యుగ్రతేజోజ్జ్వలితం భీషణం
భయనాశనమ్ పశ్చిమంగారుడం

వక్తం వజ్రతుండం మహాబలమ్
సర్వరోగ ప్రశమనం విష భూత
నివారణమ్ ఉత్తరం సూకరం
వక్తం కృష్ణదీప్తం నభోనిభమ్

సిద్ధిదం నృణాం జ్వర
కృంతనమ్ ఊర్ద్వం హయాననం
ఫటోరం దానవాంతరకంపరమ్
యేన వక్షేణ విపేంద్ర సర్వవిద్యా

వినిర్యయః ఏతత్పంచముఖం
తస్య ధ్యాయతా మభయంకరమ్
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం
పాశమంకుశ పర్వతాయ೦.

కౌమోదకీ మండం దధానం
హాలా ముత్కట೦ ద్వౌమష్టి
సంగతెూ మూర్ణ్ని సాయుదైర్థశభిరుజై
ఏతాన్యాయుధజాలాని ధారయంతం యజామహే

దీపావళి రోజున పాటించాల్సిన లక్ష్మీ మంత్రం?

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం

దాసీభూతసమస్తదేవ-వనితాం లోకైకదీపాంకురాం /

శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం  వందే ముకుందప్రియామ్ //

(క్షీరసముద్రరాజతనయాం, శ్రీరంగధామ+ఈశ్వరీం, దాసీభూత-సమస్త-దేవవనితాం, లోక+ఏక-దీప+అంకురాం, శ్రీమత్+మందకటాక్ష-లబ్ధ-విభవ-బ్రహ్మ+ఇంద్ర-గంగాధరాం, త్రైలోక్య-కుటుంబినీమ్, సరసిజామ్, ముకుందప్రియామ్, త్వామ్, (అహమ్), వందే.)

“పాలసముద్రంలో పుట్టినదానవు, శ్రీరంగమనే ధామాన్ని నియంత్రించేదానవు,  దేవతాస్త్రీలందరూ సేవకురాండ్రుగా కలిగినదానవు, ఈ లోకానికి ఉన్న వెలుగుకు మూలమైనదానవు, నీయొక్క స్వల్పమైన కటాక్షం కారణంగానే బ్రహ్మ, ఇంద్ర, రుద్రాదులకు వైభవాన్ని కలిగించినదానవు, మూడు లోకాలను (భూ, భువ, సువ) కుటుంబంగా కలిగినదానవు,  నీటియందు పుట్టినదానవు, విష్ణువునకు ఇష్టురాలవు -  అయిన నిన్ను కొలుస్తాను (నమస్కరిస్తాను).”

అట్టి శ్రీమహాలక్ష్మి మనకందరకూ ఈ దీపావళిరోజున (తదనంతరం కూడా) శుభాలను కలగజేయాలనీ, అలక్ష్మిని (మూర్తీభవించిన దారిద్ర్యాన్ని) తొలగించాలనీ మనసారా కోరుకొంటున్నాను.

పూజమానావా ? మరి ఫలహారం మానలేదే ???

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య
చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో

పూజమానావా ? మరి ఫలహారం మానలేదే ???

శ్రీ గురుభ్యోనమః
సభాయై నమః

ఒక శిష్యుడు దూరదేశంనుండి రైలు ప్రయాణం చేసి శృంగేరి వచ్చి అప్పటి
శృంగేరి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర
భారతీ స్వామి వారిని దర్శించిన తరవాత వారి సంభాషణ ఇలా జరిగింది.

శ్రీ చరణులు : ఇంటినుంచి నేరుగా వస్తున్నావా? లేక మధ్యలో ఎక్కడైనా ఆగి
వస్తున్నావా ?
శిష్యుడు     : లేదు స్వామీ నేరుగానే వస్తున్నాను.
శ్రీ చరణులు : మొన్న భోజనం చేసి బయలుదేరి ఉంటావు. రాత్రి భోజనం చేయటానికి
వీలు లేదు మరి నిన్నటిమాటేమిటి?
శిష్యుడు     : జోలార్పేట స్టేషన్లో రెండుగంటల వ్యవధి దొరికింది. అక్కడే
తొందరగా స్నానం చేసి లఘువుగా జపం ముగించుకుని రెండు అరటి పళ్ళు మాత్రం
తిన్నాను.
శ్రీ చరణులు : ఓ స్నానం వదలక చేస్తావన్నమాట. మరి పూజ
శిష్యుడు     : స్టేషనులో పూజ సాంతం చేయడానికి వీలు లేదు.
శ్రీ చరణులు : ఔను. నిజమే స్టేషనులో పూజ సాంతం చేయడినికి కుదరదు. మరి
క్లుప్తంగా?
శిష్యుడు     : పూజచేయటానికి వ్యవధి ఎక్కడ?
శ్రీ చరణులు : మరి స్టేషనులో అరటిపండ్లు తినడానికి వ్యవధి ఉన్నది కదా?
శిష్యుడు     : పూజ అంత సులభంగా చేయడానికి వీలు లేదు కదా?
శ్రీ చరణులు : ఎందుకు కాదు? నువ్వు తెచ్చిన అరటిపళ్ళు తినడానికి ముందు
దేవతార్చనకు అర్పించి తరవాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. కాదా?
శిష్యుడు     : నేను అలా చేయలేదు. మూర్తి పెట్టెలోపెట్టి నా మూటలో ఉన్నది
కదా.. బయటకు తీస్తే కదా నివేదనం చేసేది.
శ్రీ చరణులు : నీవు మూర్తి పెట్టెలో పెట్టి బుట్టలో ఉన్నందువల్ల నువ్వు
చేసే నివేదనం ఆ మూర్తి గ్రహించలేదని నీ భావన. నువ్వు ఉపాసించే దేవతను
గూర్చి నీకు తెలిసిందింతేనా?
శిష్యుడు     : మీరు చెప్తుంటే అర్థం అవుతోంది. నేను నివేదన చేసి
ఉండవచ్చు……..
శ్రీ చరణులు : ఇంతా చెప్పడం……  మన స్థితి ఎటువంటిదైనా ఉన్నదానిలో మన
కర్తవ్యం చేయాలి అని. భగవంతుడు సర్వ వ్యాపి. విస్తారంగా పూజ చేయడానికి
వీలు లేనిచోట నిండు మనసుతో భగవంతుని స్మరిస్తే చాలు. ఆయన అపరిమిత
అనుగ్రహాన్ని వర్షిస్తాడు.

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య
చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles