కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?.
కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడ లో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ప్రకృతి తో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు గా చెప్పవచ్చు. జపాను లో కూడ హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారం లో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపాను లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.

కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి? దీని వెనక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వాన ప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపు తారు. అరణ్యంలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్లాలి. ఏ ప్రకృతిలో ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఆరోగ్యాన్నిచ్చే ఉసిరి చెట్లు, తులసి చెట్లు, మామిడి చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి.
ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మరి మామిడి విశిష్టత ఏమిటి?. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరు ఉన్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరే ఏ ఇతర వ్రతం గానీ చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం- ఇవన్నీ సాయంత్రం దాకా చదవాలి. పొద్దు పొడిచిన తరువాత మహా నైవేద్యం పెట్టి భోజనం చేయాలి.

కృష్ణుడి వన భోజనం!
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు, ఇతర స్నేహితులతో- “ఓరేయ్, రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా!” అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎందుకు? ఎందుకంటే- వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా..! అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.. అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలోు ఏ అరమరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.