ఇతరులకు హాని చేయ్యనంతవరకు ఏ కుక్కనూకొట్ట కూడదు,
కుక్కను కాల భైరవ స్వామి గా భావిస్తాము. వేల సంవత్సరాల క్రితం మనిషి అరణ్యాల లో జీవించేవాడు. నదీ తీరాలలో గుంపులు గుంపులుగా గుడిసెలు వేసుకొని జీవించేవారు.. నూటికి తొంబై మంది వన్య ప్రాణులను వేటాడి జీవించేవారు. అప్పటి వారికి రెండే రెండు సమస్యలు ఉండేవి.. ఒకటి ఆహారం, రెండవది ఇతర మానవ సమూహాలనుండి రక్షణ. ఈ రెండు సమస్యలకూ పరిష్కారం చూబెట్టిన ప్రాణి పేరే 'కుక్క'. లేడి, దుప్పి, కుందేలు, అడవి కోడి, అడవి పంది వంటి వాటిని పట్టుకోవాలంటే వాటితో సమానంగా పరుగెత్తవలసి వచ్చేది... ఇటువంటి సందర్భాలలో 'కుక్క' వారికి బాగా సహకరించేది. ఆ విధంగా కుక్క మనిషి కి స్నేహ మయింది; ఆహార సంపాదనకు ఆసరా అయింది.
రెండవది రక్షణ; అరణ్యాలలో నివసించేటప్పుడు ఒక గుంపు లోని స్త్రీలను వేరొక గుంపు లోని పురుషులు రాత్రి వేళలో ఎత్తుకొని పోయేవారు. అలాగే ఆ గుంపు లోని స్త్రీలను ఈ గుంపు లోని పురుషులు.... ఒక్కోసారి సింహం, పులి వంటి క్రూర మృగాలు రాత్రి వేళలో మనుషుల మీద దాడి చేసేవి.... అటువంటి సందర్భాలలో కుక్క వారి వారి గుడిసెలకు కాపలా కాస్తూ ఎవరైనా అపరిచుతులు, క్రూర జంతువులు దాడి చేసినప్పుడు భౌ... భౌ .. మంటూ
అరచి తమ యజమానులను అప్రమత్తం చేసేవి.... ఆవిధం గా కుక్క ఆనాటి వారికి గృహ బంధువైంది... కాబట్టే ఆనాటి పెద్దలు కుక్క మాంసం తిన రాదు అని నిబంధన విధించారు. అలాగే కుక్కకు బంధువైన నక్క మాంసం కూడా తినరు. కాబట్టి కుక్కను కాలితో తన్న రాదు, కర్రతో కొట్టరాదు... పాపం. అనే వారు. అలాంటి కుక్కలు ఈరోజు పసిపిల్లలను చంపుతున్నాయి... వారి మీద దాడి చేస్తున్నాయి అంటే కారణం వాటికి మనం పట్టెడన్నం పెట్టక పోవడమే. ప్రభుత్వాలు మేల్కొని గోసంరక్షణ కేంద్రాల వలెనె శునక సంరక్ష కేంద్రాలు ప్రారంభించి. వీధి కుక్కలను ఆదుకుంటే.. వాటికీ మంచిది ... మనకూ మంచిది.
ప్రకృతి లో సంభవించబోయే ఉపద్రవాలను ముందుగానే పసికట్టి మనల్ని అప్రమత్తం చేస్తుంది కుక్క. ప్రభుత్వ రక్షక దళం లో ఒక జాతికి చెందిన కుక్కలు చేసే సేవ మన అందరికీ తెలుసు.... నేరస్తులను పట్టివ్వడం, ప్రమాదకర బాంబు లను పసికట్టడం.... మొదలైన పనులు ఎంతో విశ్వాసం తో చేస్తాయి. సరి అయిన ఆహారం లభించనప్పుడు మాత్రమే కుక్కలు తినరానివి తింటాయి. మంచి ఆహారం వుంటే సింహం తో సమానం గా వుంటాయి... అందుకే కుక్కలను 'గ్రామ సింహాలు' అని కూడా అంటారు.
ఏ కుక్కనైనా అనవసరం గా కవ్వించవద్దు, కుక్క కళ్ళల్లో కి కళ్ళు పెట్టి చూడవద్దు.... ఒకే వీధి లేదా ప్రాంతానికి చెందిన వారిని అవి పసి కట్టగలవు.. వేరొక వీధి లేదా ప్రాంతానికి చెందిన వారు తమ పరిధి లోకి వస్తే అరచి గోల చేసి కరవడానికి వస్తాయి.. కాబట్టి రాత్రి వేళలో ప్రయాణాలు చేసే వారు జాగ్రత్త గా ఉండాలి.