ఇది మన జీవితం
----------------
ఎత్తైన భవనాలు, చిన్న మనసులు, విశాలమైన దారులు , సంకుచిత స్వభావాలు , ఖర్చు ఘనం, సంతృప్తి స్వల్పం. ఎక్కువ వస్తువులు. తక్కువ ఆనందం. పెద్ద ఇల్లు , చిన్న కుటుంబాలు. సౌఖ్యాలు అపారం ,సమయం పరిమితం. ఎన్నో డిగ్రీలు , కొంతే ఇంగితం. ఎంతో విజ్ఞానం, కొంతే వివెకం. నిపునుల సంఖ్య అపారం, సమస్యలు నిరంతరం. ఎన్నో మందులు, కొంతే ఆరొగ్యం. తేగ తాగెస్తాం , సిగరెట్టు ఊదెస్తాం, బలదూర్లు తిరగెస్తాం......అయినా ఆనందాన్ని అందుకొలెం. లెటుగ పడక లెస్తునే అలసట. చదువేది శూన్యం.టివి తోనే బంధం. దేవుడితో అనుబందం పూజ్యాం.
ఆస్దులు పెరుగుతున్నాయి, విలువలు తగ్గుతున్నాయి, వాగుడు ఎక్కువ , ఆలోచన తక్కువ. ప్రేమించె మనసు మొడుబారిపొయింది, పరనిందకు మాత్రం సిద్దంగా ఉంటాం. ఎలా బ్రతకాలో తెలుసు, కాని నిండుగా బ్రతకలేక పోతున్నాం. వయసు పెరుగుతుంది, గుండె తరుగుతుంది. చందమామను అందుకుంటాం, కాని మన వీది దాటి ప్రక్క వీదిలో వుండే బందువులను, స్నేహితులను కలిసె తీరిక లేదంటాం. ప్రపంచం అంతటిని జయించాం....మనో ప్రపంచాన్ని జయించ లేక పోతున్నాం .
ఘనమైన పనులు చేశాం. మంచి పనులు చేయలెకపోతున్నాం. గాలిని శుబ్రపరిచాం , ఆత్మను కలుషితం చెశాం. అనుబాంబును చెసేంతగా ఎదిగాం , మూఢత్వాన్ని వదులుకొలెం. ఎక్కువ రాస్తాం , తక్కువ చదువుతాం .ఎన్నో ప్రణాళికలు వేస్తాం , కొంతే సాదిస్తాం. పరుగులు తీస్తాం , క్షణం వెచిచుడలేం. కుప్పలు కుప్పలుగా సామాచారం. మాట్లాడేందుకు మనిషే కరువు.
బర్గర్లు , పిట్జాలు తింటాం , అరగక అవస్దలు పడతాం. భారీ కాయం సౌశిల్యం లేశమాత్రం. లాభాల కోసం పరుగు బంధాలు కనుమరుగు. నాలుగు చెతులా సంపాదన , పెళ్లయిన మూన్నాళ్లకే విడాకుల పర్వం. అన్ని అంగులతో ఇల్లు , మనుషులు లేక బొసిపోయె లోగిల్లు. అనైతిక తిరుగుళ్ళు ఆత్మహత్యలకు ఆనావాళ్లు. కళ్లు తిరిగే సాంకేతికం , అయినా భావ దారిద్రం. ..ఇదేన జనాభా తీరు