Friday, 12 February 2016

అర్జున విషాదయోగః 3

🔔 అర్జున విషాదయోగః 3 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)- 🔔

స ఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్‌,
నభశ్చ పృథివీంచైవ
తుములో వ్యనునాదయన్‌

🔔పాండవవీరుల శంఖములయొక్క ఆ సంకులధ్వని భూమ్యాకాశములను దద్దరిల్లుజేయుచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను.

*******************************************************************************************  19

అథ వ్యవస్థితాన్‌ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్‌ కపిధ్వజః,
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాణ్డవః.

హృషీకేశం తదా వాక్య
మిదమాహ మహీపతే!

ఓ ధృతరాష్ట్ర మహారాజా! అటుపిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధసన్నద్ధులైయున్న కౌరవులను జూచి, ధనుస్సును చేబూని శ్రీకృష్ణునితో నిట్లు పలికెను -

************************************  20

🔔 అర్జున ఉవాచ : -

సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయ మేచ్యుత!

యావదేతా న్నిరీక్షేహం
యోద్ధుకామానవస్థితాన్,
కైర్మయా సహయోద్ధవ్య
మస్మిన్‌ రణసముద్యమే.

🔔 అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణా! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసలపవలయునో, అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగ జూడగల్గుదునో రెండు సేనలమధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుము.
**************************  21,22

యోత్స్యమానానవేక్షేహం
య ఏతేత్ర సమాగతాః,
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే
ర్యుద్ధే ప్రియచికీర్షవః.

🔔 దుష్టబుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమొనగూర్చనెంచి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూచెదను.
******************************  23

🔔సంజయ ఉవాచ :-

ఏవయుక్తో హృషీకేశో
గుడాకేశేన భారత!
సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్‌.

భీష్మద్రోణ ప్రముఖత
స్సర్వేషాం చ మహీక్షితామ్‌,
ఉవాచ పార్థ! పశ్యైతాన్‌
సమవేతాన్‌ కురూనితి

🔔సంజయడిట్లు పలికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడిట్లు చెప్పగా నంతట శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండుసేనల మధ్య భీష్మద్రోణులకును, ఎల్లరాజులకును ఎదుట నిలిపి 'అర్జునా! ఈ చేరియున్న కౌరవులను జూడుము!' అని చెప్పెను.

*******************  24,25

తత్రాపశ్యత్థ్సితాంపార్థః
పితౄనథ పితామహాన్‌,
ఆచార్యాన్మాతులాంభ్రతౄన్‌
పుత్రాంపౌత్రాంసఖీంస్తథా.

శ్వశురాంసుహృదశ్చైవ
సేనయోరుభయోరపి

🔔తదుపరి అర్జునుడచట రెండుసేనలయందును నిలిచి యున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను కొడుకులను మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను (అందరిని) చూచెను.

***********************  26

తాంసమీక్ష్య స కౌంతేయ
స్సర్వాన్‌ బంధూనవస్థితాన్‌.

కృపయా పరయావిష్టో
విషీదన్నిదమబ్రవీత్‌,

🔔అర్జునుడు యుద్ధభూమియందు నిలబడియున్న ఆ బంధువులందరిని బాగుగ పరికించి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచు నిట్లుపలికెను.

🔔 ..👏 ✍ హిందూ ధర్మచక్రం ☀

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles