Friday, 12 February 2016

మాఘమాస స్నాన సంకల్పము

🔔 మాఘమాస స్నాన సంకల్పము - దానం చేసే సమయంలో చదివే  సంకల్పం  🔔

శ్లో.  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
      ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||
      సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |
      నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||
      మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |
      ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||
      ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |
      సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||

🔔ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, శశిరఋతౌ, మాఘమాసే, ...పక్షే , ....తిధౌ  ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మకరంగతేరవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం కరిష్యే.

🔔సంకల్పము చెప్పుకొని  స్నానం చేయుటకు  ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము

గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశ తైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||
పిప్పలాదాత్సముత్సన్నే కృతే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||
అంబత్వద్దర్శనామ్మక్తిరజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||
విశ్వేశం మాధవందుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||
అతితీక్షమహాకాయ కల్సాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||
త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచి తోదేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||
యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||
నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||
సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||

🔔స్నానం తరువాత ప్రార్థనా శ్లోకాలను చదువుతూ, ప రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి/పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన/దేవాలయాన దైవమును అర్చించాలి.

🔔 దానమంత్రం 🔔
ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్సయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.

🔔 దాన పరిగ్రహణ మంత్రం 🔔
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
🌷 ........✍ హిందూ ధర్మచక్రం , ధార్మిక ప్రచారం . 🌷

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles