శ్రీ ఆంజనేయం
సంపూర్ణ హనుమత్ వైభవం - 1
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం.
ఒకసారి శనీశ్వరుడు అహోరాత్రం శివుడిని పట్టుకుంటానని వరం ఇచ్చిన శివుడిని పట్టుకోవడానికిప్రయత్నిస్తే శివుడు కైలాసాన్ని వదిలి వెళ్లి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. అహోరాత్రం ముగిసిన తరువాత శనీశ్వరుడు శివుడు ఉన్న చెట్టు తొర్ర వద్దకివెళతాడు. అప్పుడు శివుడు ''చూశావ నన్ను పట్టుకోలేకపోయావు'' అంటే శనీశ్వరుడు నవ్వి ''నేను పట్టుకోబట్టే కదా కైలాసంలో ఉండవలసిన నువ్వు చెట్టు తోర్రలోకి వచ్చి కూర్చున్నావు అన్నాడు. శివుడు కూడానవ్వి ఊరుకున్నాడు. ఏదో సమయంలో దొరక్కపోతావా? వయించేయకపోతనా! అనుకున్నాడు.ఇది జరిగిన చానాళ్ళకి గార్థభేశ్వరుడు జన్మించాడు. లోక కంటకుడు అయ్యాడు. యితడు తన తల్లి ఆశీర్వాదంతో చావులేని వరం కొరుకొవడానికి దానవుల గురువైన శుక్రాచార్యుడి వద్ద మంత్రోపదేశం తీసుకొని శివుడి కోసం తపస్సు చేశాడు. యితడు చేసిన తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ''ఎం వరం కావాలో కోరుకోమన్నాడు. చావులేని వరం కావాలి అని అడిగితె ''ఇవ్వడం కుదరదు'' సృష్టిలో ప్రతిజీవి నశించి తీరవలసిందే కాబట్టి ఇంకేదైనా వరం కోరుకో మన్నాడు ఈశ్వరుడు. ఐతే నీకు నాకు తప్ప నామరణ రహస్యం ఎవరికీ తెలియకుండా వరం ఇవ్వు అన్నాడు, తదాస్తు తథాస్తు అని వారికి తప్ప అన్యులేవ్వరికీ తెలియకుండా చుట్టూ ప్రక్కల ఎవ్వరికీ వినబడకుండా చేసి ''మరణ రహస్యం'' చెప్పాడు. ఇకఅక్కడి నుండి దేవతలు, ఋషులు, సుర సిద్ద యక్ష రాక్షస, గాంధర్వ, పన్నగ(నాగులు), మనుష్య, కేచర(ఆకాశంలో తిరిగేవి), భూచర జీవులన్నిటికీ కష్టాలు మొదలయ్యాయి. మొట్ట మొదట ఇంద్రుడి నుండి మొదలు పెట్టి ముల్లోకాలుతన వశం చేసుకున్నాడు. ముల్లోకాలు వీడి దెబ్బకి గగ్గోలు పెట్టాయి. దీంతో దేవతలందరూ కలిసి బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళితే ''గార్ధభనేశ్వరుడి తల్లి మరణంలేని వరం కోరితే కుదరదు అని చెబితే తన సంతానానికైన ఆ వరం కలిగేలా ఇవ్వమని కోరింది. శివుడి కోసం తపస్సు చేస్తే ఆ వరాన్ని పొందవచ్చు అని చెప్పాను. అలా ఆమె సంతానాన్ని పొంది కొడుకు ద్వారా తపస్సు చేయించింది. అప్పుడు గార్దభేశ్వరుడికి శివుడు ''నీకు నాకు తప్ప నీ మరణ రహస్యం ఎవ్వరికీ తెలియదు అని వరం ఇచ్చాడు. ఇప్పుడు మనం వెళ్లి ఆ శ్రీహరిని శరణు వెడదాం. అప్పుడు తరువాత ఏమి చేయాలో ఆలోచిద్దాం అని శ్రీహరి వద్దకు తీసుకెళ్ళాడు. శ్రీహరితో గార్ధభనేశ్వరుడిఆగడాలు చెప్పగా ''శివుడికి గార్ధభనేశ్వరుడితప్ప ఎవ్వరికీ తెలియదు'' కనుక పదండి శివుడి దగ్గరికి వెళదాం అని శివుడి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళడం శివుడిని స్థుతించిప్రసన్నుడిని చేసుకోవడంతో శివుడు అందరినీ ఆహ్వానించి ఎవరి అర్హతకు తగిన ఆసనాలు వారికి ఇచ్చి ''రాకకు కారణం'' అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి ''గార్ధభనేశ్వరుడు చేసే అకృత్యాలు'' మొత్తం తెలిపి అతడి మరణ రహస్యం చెప్పమన్నాడు.శివుడు నవ్వి ''ఆరహస్యం చెప్పడం కుదరదు'' అన్నాడు. ఇద్దరికీ వాదోపవాదాలు జరిగాయి. శివుడు కుదరదంటే కుదరదు అని తేల్చి చెప్పాడు. ''నువ్వు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను''అన్నాడు. తెలుసుకోగలిగితేనేనునీకు దాసుడిగా ఉంటాను అని ప్రతిజ్ఞలు చేసుకున్నారు.ఇంతలో నారదుడు వచ్చి ప్రతిజ్ఞలు చేసుకున్నారు బాగానే ఉంది కాని ఎప్పటిలోగా తీరతాయి ఒక గడువు అనేది ఉండాలి కదా! అని అడిగాడు. రాబోయే పౌర్ణమి లోపు అని శపదం చేసాడు శ్రీహరి..
జై బోలో రామ భక్త హనుమాన్ కీ
జై బోలో రామ భక్త హనుమాన్ కీ
జై బోలో రామ భక్త హనుమాన్ కీ ..
Author: sandhehalu - samadhanalu