🎄💟🎄
🌻
ఓ తండ్రి తన కొడుకు కు కుళాయి వద్ద నీళ్ళు తీసుకురమ్మని నీళ్ళ కడవ ఇచ్చి పంపాడు.
ఆ కుర్రాడు సరేనని తండ్రి ఇచ్చిన నీళ్ళ కడవను తీసుకుని కుళాయి దగ్గరకు బయలుదేరాడు..
దారిలో తన ఈడు పిల్లలు గోళీలాట ఆడుతూ కనిపించారు,
ఈ కుర్రాడి నిక్కర జేబులో రెండు గోళీకాయలున్నాయి,
కొద్దిసేపు తటపటాయించి తను కూడా నీళ్ళ కడవ ప్రక్కన పెట్టి ఆ గుంపులో చేరి గోళీలాటలో నిమగ్నమయ్యాడు,
ఆటలో గోళీలు గెలుస్తూ, ఓడుతూ చివరకు తన రెండు గోళీలను ఓడిపోయాక అప్పుడు గుర్తుకు వచ్చింది,
తను వచ్చిన పని....
వెంటనే నీళ్ళ కడవ తీసుకొని కుళాయి వద్దకు పరిగెత్తాడు, అప్పటికే నీళ్ళు రావడం బంద్ అయ్యాయి,
ఖాళీ కడవ తీసుకొని భయం, భయంగా తండ్రి వద్దకు వచ్చాడు
తండ్రి వీడి వాలకం చూసేసరికి పరిస్థితి అర్ధం చేసుకుని వీపున నాలుగు తగిలించాడు..
ఇదీ కధ...
ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా ఇదే..
తండ్రి స్ధానం లో దేవుడిని, కుర్రాడి స్ధానం లో మనల్ని అన్వయించుకుంటే..
ఆ దేవుడు మనకు ఓ పని అప్పజెప్పి ఈ లోకం పంపితే మనం ఈ డబ్బు, కీర్తి, మోసం అనే గోళీలాట వ్యామోహం లో పడి అప్పజెప్పిన పనిని మరచిపోయాం,
తీరా వార్ధక్యం వట్చిన తరువాత ఆ పని గుర్తుకు వచ్చినా శరీరం సహకరించదు
మరియు మనం ఏర్పరచుకున్న అశాశ్వత బంధాలు, వ్యసనాలు చేయకుండా అడ్డుపడతాయి,
మరణానికి చేరువవుతున్నప్పుడు పాపభీతి మెుదలవుతుంది,
అప్పుడు తండ్రి తన్నులు తప్పించుకోడానికి ఆ తండ్రి కే లంచం ఇవ్వడానికి కూడా వెనకాడడంలేదు,
అంటే దేవుని గుళ్ళో హుండీలో కానుకలేయడం వంటివన్నమాట,
కాబట్టి..
మిత్రులారా!
ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం,భగవంతుని నామస్మవన చేద్దాము, తల్లి దండ్రులను గౌరవిద్దాము,
కష్టాలలో ఉన్న సాటి మనిషిని ఆదుకుందాం,
మనిషిలా భూమి మిదకు వచ్చాం,
మనిషిలా బ్రతుకుదాం,
ఏ క్షణం లో మ్రుత్యువు మనల్ని కబలించినా దేవునికి కావలసిన బ్యాంకు బాలన్స్(మంచితనం,భగవన్నామం) మనదగ్గర సమ్రుధ్ది గా ఉంచుకుందాం..
తల ఎత్తుకునిదేవుని ముందు నిలబడదాం..
సర్వేజనా సుఖినోభవంతు..
Author: sandhehalu - samadhanalu