(పార్ట్ 1)
“యం పాలయసి ధర్మం త్వం ధృత్యానియమేన చ
సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు!”
రఘుకుల శ్రేష్ఠుడవైన రామా! ఏ ధర్మమును నీవు నియమముతోనూ ధైర్యముతోనూ పాలిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించు గాక.
రామయణం అయోధ్యకాండలో ఇక శ్రీరాముని తప్పని పరిస్థితులలో అరణ్యమునకు పంపుతూ తల్లి కౌసల్యా మహాదేవి అన్న మాటలివి. ఈ శ్లోకం కంచి మహాస్వామివారికి ఎంతో ఇష్టమైన శ్లోకమల్లే ఉంది. అనేక ఉపన్యసాలలో ఉటంకించారు. స్వామివారు శ్రీరాముని వలే తమ జీవితకాలం అంతా ధర్మాన్ని ఎంతో ధైర్యంతోను నియమముతోనూ పాలించారు. తమ ప్రవర్తనలోని లోపాలు ఒకవేళ ఎవైనా ఉంటే అవి ఆదిశంకరులకు ఆపాదించబడతాయన్న భయంతో ఆరంభమైన ధర్మపాలనము అసమానమైన ధైర్యముతోనూ నియమముతోనూ కొనసాగించారు.
ధర్మపరిపాలనకు ధైర్యం ఎందుకు అన్న అనుమానం రావచ్చు. కఠోరమైన నియమలతో శ్రీవారు చేసిన ధర్మపరిపాలనం ఆయనను అనేక కష్టనష్టాలపాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎంతో మంది వ్యతిరెకులైనారు.
చిన్న విషయం తీసుకోండి..
భ్రాహ్మణులు శిఖా,యజ్ఞొపవీతాలతో ఉండాలన్నది శాస్త్రం. కంచి మఠంలో ఆదిశంకరులవారి పాదుకలకు పుజ చేయాలంటే భ్రాహ్మణులకు శిఖా,యజ్ఞొపవీతాలు ఉండి తీరవలసిందే! మన విజయవాడకు చెందిన శ్రౌతయజ్ఞాలు చేసిన ఒక మహా పండితుడు ఒక శిఖ పెట్టుకోని ఒక లౌక్యుడిని స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళి పాదపుజకు ఏర్పాటు చేయించమని ప్రార్ధించాడు. ఆ లౌక్యుడు ఆ పండితునికి చాలా కావలసిన వాడు. స్వామివారు నేరుగా అతనితో పాదపుజ చెయించడం సాధ్యం కాదని అతనివద్దనుండి పుజాద్రవ్యాలు తీసుకుని మీరే చేయవచ్చునని ఆ పండితునికి సెలవిచ్చారు. దానితో ఆ పండితుని అహం దెబ్బతిన్నది. కంచిమఠానికి పరమ శత్రువుగా మారిపొయారు.
చెన్నైలో సుప్రసిద్ధమైన దివాన్ గారు కంచిమఠానికి పరంపరగా భక్తులు. ఆయన విదేశీయానం చేసి వచ్చారు. శ్రీవారికి విదేశీయానం చేసిన వారివద్ద భిక్ష స్వీకరించరాదని, వారికి ఉపదేశం చేయరాదనీ నియమం ఉన్నది. దానితో కొన్ని చిక్కులు వచ్చి పడినాయి. అయినా స్మృతి నియుక్తమైన ధర్మపరిపాలన విషయంలో శ్రీచరణులు ఎటువంటి బలహీనతలకూ తావీయక ధైర్యముగా ఎదుర్కొన్నారు. వారి అనుచరులతోనూ, రాజకీయవాదులతోనూ వచ్చిన చిక్కులు కుడా ఎదుర్కోవలసివచ్చింది. మత, పుజావిధానాలు, ఆధ్యత్మిక విషయాలు, ఉపాసనా, ఉపవాసాలు ఇటువంటి విషయాలలొనేకాదు, నైతికత, సాంఘిక విషయాలలో కుడా వారి పట్టుదల అసామన్యమైనది. ఒకసారి ఒక కార్యక్రమనికి ద్రవ్యం అవసరమైనది. దానికై ఏర్పరచిన ట్రస్టులో డబ్బులేదు. ఇంకొక ట్రస్టు నుండి తీసి ఖర్చు పెట్టించారు. తీరా వాడిన తరువాత తెలిసింది, అలావడటం ఆ రెండవ ట్రస్టు నియమ నిబంధనావళికి వ్యతిరేకమని. శ్రీవారు చాలా కలవరపడినారు.
ఆ రోజే ఒక జిల్లా జడ్జిగారు శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారు ఆ జడ్జిగారికి విషయం చెప్పి, దీనికి శిక్ష ఎమిటి అని అడిగారు.
దానికి జడ్జిగారు, మంచి ఉద్దేశ్యముతో తెలియకచేసిన దానికి ఏమి? డబ్బు రెండవ ట్రస్టుకి కట్టెస్తే సరిపొతుంది అన్నారు. అప్పుడు శ్రీవారు, ఇది నేను చేసానని కాదు, ఒక సామన్య మానవుడు ఇది చేస్తే, ఆ కేసు మీ కొర్టులోకి వస్తే ఏమి చెబుతావు అన్నారు.
దానికి జడ్జిగారు, డబ్బు కట్టేయమంటాను లేదా మహాయితే నెల రోజులు సాధరణ జైలు శిక్ష వేస్తానన్నారు. అంతే! మహాస్వామివారు నెల రోజులు ఒకే గదిలో కుర్చున్నారు. పూజకి తప్ప బయట కనపడలేదు. డబ్బు సమకూరి మళ్ళీ ఆ ట్రస్టు ఖాతాలో జమ చేసేంతవరకు ఉపవాసం చేసారు. సాధరణ విషయంలోనే ఇంతటి పట్టుదలయితే ఇంక నడవడిని తీర్చుకునే విషయంలో, ఉపాసన విషయంలోనూ వెరే చెప్పాలా ...
అయినా మచ్చుకు ఒకటి చెప్తాను...i
(ఇంకా ఉంది..)