Tuesday 7 June 2016

సాక్షీ ఆంజనేయ స్వామి???

🌹ఓం హాం హనుమతే నమః🌹
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడ మే 31 మంగళవారం నాడు 'హనుమద్ జయంతి' సందర్భంగా సింహాచలం మెట్లమార్గం మద్యలో ఉన్న 'శ్రీ వీరాంజనేయ స్వామి' గుడికి పూజకి వెల్లినాను.
ఈ గుడి చాలా విశిష్టమైనది మరియూ మహామహిమాన్వితమైనది. ఇది స్వయంభూ దేవాలయము.  ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా శ్రీ లక్ష్మీ వరాహ నరసింహ స్వామిని చూస్తున్నట్టు ఉంటారు.
విశేషాలు👉
🌺సాక్షీ ఆంజనేయ స్వామి🌺
వరాహస్వామి దర్శనానికి కాలినడకన మెట్లమార్గం గుండా వచ్చిన భక్తులు వరాహస్వామి దర్శనానికి ముందు ఆ తరువాత కూడా ఈ స్వామిని దర్శనము చేసుకుంటారు. తద్వారా వరాహస్వామి దర్శనమునకు 'సాక్షి'గా నిలుస్తారంటారు. ఆలాగే కోత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు ఈ స్వామి దర్శనము చేసుకొనడం ద్వారా వారి వివాహాలకు స్వామి 'సాక్షి'గా నిలుస్తారని భక్తుల విశ్వాసం.
ఆలయ సాంప్రదాయం👉 ఈ ఆలయం వైష్ణవాలయం అయినప్పటికీ ఇక్కడ పూర్తిగా మాధ్వ సాంప్రదాయం కొనసాగుతుంది. మర్ధులు ఆంజనేయస్వామిని 'ముఖ్యప్రాణ' మూర్తిగా ఆరాధిస్తారు. ఇక్కడ కూడా అదే సాంప్రదాయం కొనసాగుతొందని ఆలయపూజారి 'మాధవాచార్యులు' తెలియజేసారు. సింహాచలము వెళ్ళినవారు తప్పక దర్శనము చేసుకొన వలసిన దేవాలయము.
🌷జై శ్రీరామ్🌷

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles