Tuesday 7 June 2016

యముని భార్య పేరు???

1-యముని భార్య పేరు విశ్వ.వీరికి కలిగిన సంతానం విశ్వదేవులనే పేరుతో ప్రసిద్హులు..

2-శ్రాద్హాలలో కాకి కి పిండం ఇవ్వడం వలన దీర్ఘాయువు కలుగుతుంది..గోవు కి తినిపిస్తే యశస్సు-కీర్తీ,అగ్ని లో సమర్పిస్తే భోగప్రదము...

3-నర్మదా నది పితృదేవతలకు కుమార్తె,కనుక ఈ నదీ తీరంలో శ్రాద్హమును పెట్టినచో అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది..

4-శ్రాద్హము నందు ఉల్లి-వెల్లుల్లి లను వాడ రాదూ,ఎందుకంటే ఈ రెండు బాలి చక్రవర్తి గాయాల రక్తం నుంచి పుట్టినవి కావడo..సంస్క్రుతం లో నీరుల్లి ని పలాన్డువు అని,వెల్లుల్లి ని గ్రుంజలశునము అని పిలుస్తారు..

5-శ్రాద్హము లో చేమ దుంపలను,చెరకు ముక్కలను తప్పక వాడాలి.ఎందుకంటే ఈ రెండూ త్వష్ట ప్రజపతి ముక్కునుండి జాలువారిన అమృత బిన్దువులనుంచి పుట్టినవి కావడం వలన..చేమ ణు సంస్క్రుతంలో శ్యామాకములు అని అంటారు..

6-శాఖా బేధాన్ని వంకగా చూపుతూ చాలా మంది శ్రాద్హమును నందు ఆకు కూర-పెరుగు తప్పని సరి ద్రవ్యాలుగా వాడుతున్నారు ,కాని ఇది పూర్తిగా శాస్త్ర విరుద్హమైనది అని తెలుసుకోండి...

7-వాయుపురాణం లో మలబద్ధ్హకానికి వొక మంచి చిట్కా చెప్పబడింది.అదేమంటే పగలు పూట తూర్పు,రాత్రి వేళల దక్షిణానికి కూర్చుని మల విసర్జన చేస్తే మలబద్ధ్హకం ఉండదు..

8-అల్లుడు శ్రాద్హమును పెట్టుటకు కానీ,చూచుటకు కాని అనర్హుడు...

9-మేనల్లుడిని భోక్త ఉంచడం వలన పితృ దేవతలు అమిత సంతుస్ట్టులు అవుతారు...కానీ ఇట్టి మేనల్లుడు కుల,మతాంతర,వర్ణ సంకరుడైనచో భోక్త గా ఉండ అనర్హుడు..

10-శ్రాద్హ భోజనం చేసే భోక్తలు ఎటువంటి సందర్భంలోనూ మాట్లాడరాదు.అల మాట్లాడితే భోక్తను ఆవహించి ఉన్న పితురులు కు శ్రాద్హ భోజనం అందదు..

11-తల్లి కి పెట్టే శ్రాద్హము నందు సుమంగళి అయిన సోదరి ని భోక్త గ పిలవడం అనంత ఫలాన్ని ఇస్తుంది..

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles