హిందూ సంస్కృతి లో ఏ పండుగ తీసుకున్నా ప్రకృతి ప్రాధాన్యత ఎక్కువగా వుంటుంది. ఉగాది డుగ,సంక్రాంతి,వినాయక చవితి ,ఇలా ప్రతి పండుగలో ప్రకృతిని ఆరాదించడం మనం చూస్తుంటాము .ఇలాంటి సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు.ఇదే విధంగా హిందూ సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు) కు ఎంతో ప్రాదాన్యం వుంది. ఆయర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది.దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము.ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఏంటో ప్రీతి .వివిధ శుభ కార్యాలునోములు, వ్రతాలు, జరిగినప్పుడు తాంబూలం (తమలపాకులను చేర్చి) ఇవ్వడం తప్పనిసరి . తమలపాకులను ఇలా ఇవ్వడం వలన శుభం చేకూరుతుంది.
ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది.ఎముకలకు మేలు చేసే “ఎ” , “సి” విటమిన్ లు,కాల్షియం, ఫోలిక్ యాసిడ్, తమలపాకులో పుష్కలంగా వున్నాయి. ముఖ్యం గా తాంబూలం లో రోగ నిరోధక శక్తిని పెంచే అద్బుత శక్తి ఉంది.తమలపాకులో వుండే పీచు పదార్ధం ఎక్కువగా వుంటుంది. జీర్ణవ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది.
షడ్రసోపేతమైన భోజనం చేసినప్పటికీ , చివరలో తమలపాకు వేయకపోతే ,అలాంటి బోజనానికి పరిపూర్ణత ఉండదు. పచ్చ కర్పూరం, లవంగాలు,యాలకులు, సోంపు కలసిన తాంబూలం వలన , వక్క,సున్నం కలిపినా తాంబూలం కన్నా త్వరగా ఉపశమనం కలుగుతుందట.
” పూగీఫల సకర్పూరై ర్నాగవల్లీ దలైర్యుతమ్
ముక్తా చూర్ణ సమయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్.”
తాంబూలంలో నాగవల్లి (తమలపాకు తీగను నాగవల్లి అనికూడా పిలుస్తారు . ఆకు చూడటానికి పాము పడగలాగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందట ), కర్పూరం,వక్కలు,సున్నం ముఖ్యమైనవి .యాలకులు, జాపత్రి, కస్తూరి, పచ్చ కర్పూరం,లవంగాలు, జాజికాయ, కుంకుమ పువ్వు, పుదీనా,కొబ్బరి తురుము, సోంప్ మొదలైనవి కూడా రుచి కోసం ఎవరి శక్తి మేరకు వారు చేర్చుతుంటారు . పూర్వకాలం లో ధనవంతులు వెండి, బంగారు రేకులను కూడా తాంబూలానికి చేర్చేవారట.సమయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమయిన తాంబూలం వేసుకొంటారు .ఉదయం , నుండి రాత్రి వరకు ..సమయాన్ని బట్టి కొన్ని రకాలయిన సుగంధద్రవ్యాలు కలిపి తాంబూలం వేసుకొంటారు. కానీ మౌలికంగా తాంబూలం లో ఉండేవి తమలపాకులు, వక్క, సున్నం మాత్రమే .
స్వర్గం నుండి వచ్చిన తీగ అట,కావున పేరు “నాకవల్లి” గా ఉండేదట , కాలక్రమేణా “నాకవల్లి” కాస్త “నాగవల్లి” గా ప్రాచూర్యం లోకి వచ్చిందట. ! తమలపాకుకి ఎంత శక్తి వుందంటే , పాము విషాన్నిహరించగలదట. ఇంకా అనేకరకాలయిన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకుకి ఉన్నాయట.చిన్న పిల్లలకి జలుబు చేసినపుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు , దగ్గు దూరమవుతాయి .తమలపాకు తో సున్నం కలిపి వేసుకొంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది మరియు ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది .బాలెంతలు తాంబూలం వేసుకొంటే ఎంతో మంచిది .వక్క , తమలపాకు మరియు సున్నం రెండిటినీ అనుసందానం చేసి శరీరం లో వేడి పెరుగాకుండా సమతుల్యం చేస్తుంది.
పేరంటానికి వచ్చిన ముతైదువులకు ,తాంబూలం ఇవ్వటం గౌరవ చిహ్నం గా హిందూ మహిళలు భావిస్తారు.తాంబూలమిచ్చి గౌరవించటం భారతీయ సంస్కృతి ,సంప్రదాయం. కొన్ని వివాహాహ్వాన పత్రికలో కూడా ‘మదర్పిత చందన తాంబూలములు స్వీకరించి” అని వ్రాస్తారు. పూర్వం ఏ పెద్దపనికి అయినా ,ఒప్పందానికి అయినా , రెండు రాజ్యాల మధ్య సంధి కుదిరినా, పెళ్లి సంబంధాలకి అయినా తాంబూలాలు మార్చుకునేవారు. ఇలా తాంబూలం అనేది ఎప్పటినుంచో మన హిందూ జీవనవిధానం లో మమేకమైయిన సంప్రదాయం🙏🙏🙏🚩