పురాణ విజ్ఞానం..
1-చంద్రుని రధానికి మూడు చక్రాలు ఉంటాయి.మయువు/త్రిమనము/వరుషము/రాజీవలము/హయము/వామము/అశ్వము/తురన్యము/హంసము/వ్యోమి/మృగము అనే పది గుర్రములు ఈ రధానికి ఉంటాయి..
2-బుధుని-రాహువు-శని-గురు-కేతు-కుజ రధాలకి 8 గుర్రాలుంటాయి..
3-శ్వేతము-పిశంగము-సారంగము-నీలము-పీతము-విలోహితము-కృష్ణము-
మరీతము-ప్రుశాతము-వృష్టి అనే పది గుర్రములు శుక్రుని రధానికి ఉన్నాయి.
.
4-శింశుమార చక్రము మొసలి ఆకారంలో ఉంటుంది..
5-సూర్యుని సుషుమ్నము-హరికేశము-విస్వకర్మము-విస్వస్రవము-సంపద్వాసువు-ఆర్వాసువు-స్వరాట్.. అను ఏడు ముఖ్య కిరణాలు సప్త గ్రహాల పుట్టుకకు మూలం..
6-అమావాస్యకు మరో పేరు కుహు..
7-పూర్ణిమ-అమావాస్యలను గ్రంధి తిదులంటారు..
8-నరకలోకం లోని వైతరణి అనే నది నిప్పులతో నిండి ఉంటుంది..
9-ఘనాపాటి ని బ్రమ్హవాహుడు అని అంటారు...
10-వైశంపాయుని శిష్యులను చరకులు అని పిలుస్తారు...
11-జైమిని మహారుషి పుత్రుని పేరు సుమంతుడు..ఇతడు అధర్వణ వేదాన్ని ఆవ్పోసన పట్టిన వారు...