Wednesday 1 June 2016

గోచారఫలములు - గ్రహముల ఉనికి........!!

గోచారఫలములు, తెలుపు నపుడు లగ్నము లన్నింటిలోను చంద్రలగ్నమే ప్రధానమైనది. చంద్ర లగ్నమునుండి యే ఫలములు చెప్పవలెను. ఇక్కడ గోచార వశమున స్థూలముగా గ్రహముల ఉనికి చెప్పుచున్నాను. రవి - చంద్రుని నుండి 3, 6, 10, స్థానములలో సంచరిమ్చునప్పుడు శుభములు చెప్పవలెను. చంద్రుడు,-- జనన కాల చంద్రునకు, జన్మరాసిలోను ,3 ,6, 7, 10 స్థానములలో సంచరించు నప్పుడు శుభుడు. గురుడు - - 2, 5, 7, 9, స్థానములలో శుభుడు. కుజుడు, శని - 3, 6, స్థానములలో శుభులు. బుధుడు - 2, 4, 6, 8, 10 స్థానములలో శుభుడు. శుక్రుడు.-- లగ్న ము, 2, 4, 3, 4, 5, 8, 9, 11, 12,, స్థానములలో శుభుడు. రాహు కేతువులు, రవి వలె, 3, 6, 10, 11 శానములలో సంచరించు చున్న శుభులు. అన్ని గ్రహములు గోచారవశామున 11 వ ఇంట శుభులని చెప్పవలెను

గోచారవశమున రవి సంచారము
చంద్రస్తితిలో ఉన్న, ధన హాని, ఉద్రేకము, అనారోగ్యము, అలసటకలిగియుండు స్వభావము శ్రమ ప్రయాణములు. రెండవ ఇంట నున్న ధనక్షయము, నిందలు, ఇతరులచే దూషణ, కోపము మో. నష్టములు ఉండును. మూడవ ఇంట నున్న, శుభము. నూతనోద్యోగము, సంపాదన, పదవి, సుఖము శత్రువులపై విజయము ఉండును. నాలుగవ ఇంట నున్న రోగములు సంభోగమందు విరక్తి, ఉండును. ఐదవ ఇంట నున్న, అనారోగ్యము, మనఃక్లేశము, నిరాశ నిస్పృహ .అరవ ఇంటనున్న, ఆరోగ్యము, శత్రువుల భయము తొలగి, ఉత్సాహము శోకము తొలగును. ఏడవ ఇంటనున్న, అజీర్ణ రోగము, ఉదరం సంబంధ రోగములు కలుగును. దీనత్వము, అనవసర ప్రయాణములు. కలుగును. ఎనిమిదవ ఇంట, కలహము, ప్రభువుల, అధికారుల ఆగ్రహము, శరీర ఉష్ణము పెరుగుట, భయము రోగము కలుగును. రవి భాగ్యమున ( 9 వ ఇంట ) మనో వికారము, కుటుంబమునుండి ఎడబాటు, ఆపదలు, దీనత్వము ఉందును. పదవ ఇంట రవి, గోచార వశమున, మహా వైభవము, కార్య జయము, నూతనపదవు, ఆస్తులు, గలుగును. ఏకాదశమున కూడా ఇదే విధమైన ఫలములు కలుగును. పన్నెండవ ఇంట, శత్రులు పెరుగుట, ధన హాని, మనో బాధలు, జగడము జ్వరపీడన చెప్పవలెను. గోచార వశమున రవి, 3 వ ఇంట, 10,వ ఇంట 11 వ ఇంట మాత్రమె యోగాకారకుడు. మిగతా రాసులలో ఉన్న, దోష నివారణకు, రవి జపము, భగవన్నామ స్మరణ అవసరము.

గోచారఫలములు --గురుడు - శుక్రుడు.
గోచారవశమున గురుడు 2, 5, 7 9, 11 స్థానములలో సంచరించునప్పుడు శుభఫలములు చెప్పవలెను. కానీ గురుని వేధా స్థానాములైన 12, 8, 10, 4, 3 మరే గ్రహము ఉండరాదు. అలాగే, శుక్రునకు 1. 2. 3. 4. 5, 8, 9, 11, 12 శంచారమందు శుభుడు. కాని వేధాస్థానములైన 1, 7, 8, 9, 10, 11,3, 5, 6, మరియే గ్రహము ఉండరాదు .

గోచార ఫలములు - బుధుడు.
గోచారవసహమున బుధుడు, 2, 4, 6, 8, 10 11 స్థానములలో సంచారిమ్చున్న శుభుడు. కనీ వేధా స్థానములైన, 1, 3, 5, 9, 8, 12, లలో చంద్రుడు తప్ప మరే గ్రహము ఉండరాదు. బుధునకు చంద్రుడు తండ్రి కనుక, వేధా స్థానములలో చంద్రుడు శుభఫలములు ఇచ్చును.

గోచారఫలము - కుజుడు.
గోచారవశమున, కుజుడు, 3, 6, 11 స్థానములలో నున్న శుభుడు. అదే సమయమున, 5 9, 12 స్థానములలో మరే గ్రహము ఉండరాదు. కుజునకు 3, 6, 11 శుభ స్థానములు. వేధస్థానములు 5, 9, 12 అలాగే శని కూడా గోచార వశమున, 3, 6 11, స్థానములో సంచరించు చున్న శుభుడు. 5 ,9, 12 వేధస్థానములలో రవి తప్ప మరే గ్రహము ఉండరాదు. రవి శనికి తండ్రి కనుక, రవి వలన శనికి వేధ లేదు .

గోచారఫలము - రవి. - చంద్రుడు.
రవి గోచార వశమున, 3, 6, 10, 11 ఇళ్ళలో ఉన్నప్పుడు, వేధా స్థానములైన, 4, 5, 9, 12 రాసులలో శని తప్ప ఇతర గ్రహములు ఉండరాదు. మరో గ్రహము రవి వేధా స్థానములో ఉన్న ఈ రవి మంచిపలముల నీయడు. రవి పుత్రుడు శని. అందుచే శని వలన రవికి వేధ ఉండదు. చంద్ర కుమారుడు బుధుడు. బుధుని వలన చంద్రునికి వేధ ఉండదు.

చంద్రునికి శుభస్థానములు 1, 3, 6, 7, 10, 11 సంచరించు నప్పుడు శుభము చేయును. బుధుడు మినహా మరే గ్రహము చంద్రుని వేధ స్తానములలో ఉండరాదు. ఈ చంద్రునికి వేధ స్తానములు, 2, 4, 5, 8, 9, 12. ఈ గ్రహముల స్థితి చూచి ఫలములు చెప్పవలెను.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles