పూర్వం శ్రీరామపట్టాభిషేకము అనంతరం సీతమ్మ తల్లి తలంటు స్నానము చేసి
నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా ఇప్పుడు రావద్దు ” అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు. హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.
వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు.
Wednesday 1 June 2016
ఆంజనేయ స్వామికి "సింధూరం " అంటే ఎందుకు అంత ప్రీతి ?
Author: sandhehalu - samadhanalu
Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ