🌷🌹🌺 సుభాషితం 🌺🌹🌷
वरमेको गुणी पुत्रो न च मूर्खशतान्यपि ।
एकश्चन्द्रस्तमो हन्ति न तारगणोऽपिच ॥
వరమేకో గుణీ పుత్రో న చ మూర్ఖ శతాన్యపి ।
ఏకశ్చంద్రస్తమో హన్తి న తారణోऽపి చ ॥
వరం, ఏకో, గుణీ పుత్రః, న చ మూర్ఖ శతాని, అపి,
ఏకః, చంద్రః, తమః, హన్తి, న, తారణాః, అపి, చ.
గుణీ = గుణవంతుడైన, పుత్రః = కుమారుడు, ఏకః = ఒక్కడు ఉండుట, వరం = అదృష్టం, మూర్ఖ శతాని = మూర్ఖులైన వంద మంది సంతానం, న అపి చ = ఏ మాత్రమూ కాదు, ఏకః చంద్రః = ఒక్క చంద్రుడు, తమః = చీకటిని, హన్తి = నాశనం చేస్తాడు, తారణాః = నక్ష్త్రాలు, న అపి చ = ఏ మాత్రమూ కాదు.
One good and noble son is better than a hundred fools. Only one moon lights the sky, where as thousand stars do not. Similarly one noble son brings fame and respect to family than hundred fools.
సుగుణవంతుడు, విద్యాధికుడు, జ్ఞాన సంపన్నుడు, సన్మార్గ ప్రవర్తనుడు, ధర్మ వర్తనుడు, పరోపకార పరయణత్వము కలిగిన వాడు, సచ్ఛీలవంతుడు అయిన ఒక్క కుమారుడు కలిగి ఉండడమే ఒక వరము, ఒక అదృష్టము.
మూర్ఖులు, అజ్ఞానులు, దుర్మార్గులు, లోక కంటకులు, విద్యా గంధము లేని వారు, పరులకు అపకారము చేయు వారు అయిన వంద మంది కుమారులేల? కౌరవ సంతానము వలె!! అటువంటి వారు ఉండిననూ దండగే.
సువిశాలమైన ఆకాశములో కాంతులీనుచుండే ఉండే ఒక్క పున్నమి చంద్రుడు చాలును ఆకాశమునంతటినీ స్వచ్ఛమైన కాంతులతో నింపడానికి, చూపరులకి ఆహ్లాదాన్ని కలుగజేయడానికినీ మనస్సులను ఉత్తేజ పరచుటకునూ. మరియూ ఈ భూమిని అంతటినీ వెలుగులతో నింపి మనో రంజకం చేయుటకునూ. ఆకాశములో మిణుకు మిణుకుమని ఉండే అనేకమైన నక్షత్రాల వలన ఏమి ప్రయోజనము? ఈ భూమండలము పైన వాటి కాంతులు కూడా ప్రసరింపవు. అవి పూర్ణ చంద్రుని వలె ఏ రకమైన ఉత్తేజాన్ని, ఉల్లసాన్ని కలుగజేయవు. అవి నిష్ప్రయోజనము. నిష్ఫలము