శ్లో !!అంజనానందనం వీరం జానకీశోకనాశనం !
కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరమ్ ! !
అంజనాదేవి కుమారుడు , మహావీరుడు , సాక్షాత్తు జగన్మాతయైన సీతా దేవికి రామచంద్రుని గురించిన సమాచారం తెలిపి ఆమె శోకాన్ని పోగొట్టిన వాడూ , వానరులకు ప్రభువు , అతి భయంకరుడు మహావీరుడు అయినటువంటి అక్షుడిని అతి సునాయాసంగా లీలామాత్రంగా సంహరించినవాడూ , లంక కు భయంకరుడూ , అయినటువంటి హనుమంతుడి పాదాలకు ప్రణమిల్లుతున్నాను , అంతటి స్వామి మనందరికీ ఆయురారోగ్యఐశ్వర్యాదులు , ధర్మాచరణ , ధర్మనిష్ఠ సంపూర్ణంగా అనుగ్రహించాలి ,లోకకళ్యాణం జరగాలని కోరుకుంటూ