Wednesday, 1 June 2016

అఘోరాత్మ

ఒకప్పుడు బ్రహ్మకు, శివుడికి ఏదో విషయంలో మాట పట్టింపు వచ్చింది. నేను గొప్ప అంటే కాదు.. నేను గొప్ప అని పరస్పరం వాదులాడుకుంటున్నారు.
నాకు అయిదు శిరస్సులు ఉన్నాయి. నేను గొప్ప అన్నాడు. బ్రహ్మ (అప్పట్లో ఆయనకు అయిదు తలలు ఉండేవట) నీకు మాత్రమే కాదు నాకు అయిదు శిరస్సులు ఉన్నాయి అన్నాడు శివుడు. అనడమే కాదు వాటిని బ్రహ్మకు చూపించాడు. ఆ పంచముఖాలు ఇవి.. 1) సద్యోజాత, 2) వామదేవ, 3) అఘోర, 4) తత్పురుష, 5) ఈశాన. ఓం పంచ వక్త్రాయనమః అని శివుడిని కొలుస్తాం. శివుడి పంచముఖాల్లో ఒకటి అఘోర.
వాళ్ల కళ్లలో స్మశానపు మంట వెలుగుతుంటుంది.. నడకల్లో ప్రళయకాలపు పదధ్వని వినిపిస్తుంది.
జటాజూటాల్లో చిక్కులన్నీ జవాబు దొరకని జీవితపు చిక్కుల్ని మన ముందు పరిచి నువ్వెవరు? అని ప్రశ్నిస్తుంటాయీ .
అఘోర!
నిర్వచనాలు, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలియకుండానే క్షణకాలం పాటు ఒళ్లు జలదరించే పేరు. సంస్కృతంలో అఘోర అంటే ‘భయం లేని’ అనే అర్థం ఉంది. కాని అఘోర పేరు వింటే.. వాళ్లను చూస్తే భయం హోల్‌సేల్‌గా మన ఒంటి కి డెలివరైపోతుంది!
ఈశ్వరుడి అయిదు ముఖాల్లో ఒకటైన అఘోరకు అఘోరాలకు ఎలాంటి సంబంధం ఉందో తెలియదు గానీ వీళ్లు శివుడిని ఆరాధిస్తారు. మానవరూపంలో ఉన్న శివుడి ప్రతీకగా తమను తాము భావిస్తారు. కపాలిక సంప్రదాయం నుంచి వేరు పడిన వారే అఘోరాలు.
ప్రతి మనిషి ఒక శవ (శవం).. అతను ‘శివ’గా రూపాంతరం చెందే మార్గమే ‘అఘోర’ అంటారు. అఘోర తెగకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అఘోరాల జీవనశైలి భిన్నంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, మరికొన్ని సార్లు భయానకంగా ఉంటుంది. అఘోరాలు శ్మశానంలో నివాసం వుంటారు. చితిలోని బూడిదను ఒంటికి రాసు కుంటారు. ఎముకను తాంత్రిక పనులకు ఉపయోగించు కుంటారు. కపాలంలో మద్యం తాగుతారు. నరమాంస భక్షణ చేయడానికి వెనకాడరు. తాంత్రిక ప్రయోజనాలను త్వరితగతిన సాధించుకోవడానికి వయసు మీద పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రత్యేక శక్తులను కూడగట్టుకోవడానికి, వాతావరణాన్ని తమ ఇష్టమొచ్చినట్లు నియంత్రించడానికి నరమాంసభక్షణ తప్పనిసరి అని గట్టిగా నమ్ముతారు.
కొందరు తమ సంప్రదాయం ప్రకారం శవాలను దహనం చేయకుండా గంగానదిలో విడిచిపెడతారు. అలాంటి శవాలు అఘోరాలకు ఆహారంగా మారతాయి. అవి ఎలాంటి స్థితిలో ఉన్నా, ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసన చట్టు ముట్టినా అఘోరాలు పట్టించుకోరు. తినడం మీదే శ్రద్ధ పెడతారు. ఇలా చేయడం వల్ల వాళ్లకు వ్యాధులు ఏవీ రావట! నరమాంసం తినే ముందు కొంత మాంసాన్ని దేవుడి కోసం విడిచి మొక్కుతారు. నగ్నంగా వీధుల వెంట సంచరించే అఘోరాలు ఆ నగ్నత్వానికి తాత్విక అర్థం చెబుతారు. ప్రపంచంతో సంబంధం లేకుండా భవబంధాలను వదులుకోవడాన్ని తమ నగ్నదేహం సూచిస్తుందంటారు.
పద్దెనిమిదవ శతాబ్దాంలో నివసించిన కినరామ్‌ అగోర సంప్రదాయినికి ఆద్యుడు. ఇతను 150 సంవత్సరాలు జీవించాడట! కినరామ్‌ శివుడి అంశతో జన్మించిన యోగి అని అతని భక్తులు విశ్వసిస్తారు. కినరామ్‌లో ఎన్నో దివ్యశక్తులు, మహిమలు ఉండేవట. వాటితో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేవాడట. వారణాసిలో ఈ బాబాకు ఒక మందిరం ఉంది. అఘోరాలకు ఇదొక పవిత్రక్షేత్రం.
అఘోరాల అభిప్రాయాలు
అజ్ఞానం అనేది చీకటి. అఘోర అనేది దివ్యవమైన కాంతి. అది అజ్ఞానమనే చీకటిని చీల్చి వేస్తుంది.
ఏకాంతంలో చెట్టుకింద కూర్చున్నప్పుడు కలిగే జ్ఞానమే అఘోర.
చితిమంట అనేది తిరుగులేని అంతిమ సత్యం. ప్రతి ఒక్కరికీ చావు తప్పదని అది ఎప్పుడూ చెబుతుంది.
ప్రపంచం యావత్తు అఘోరతో ఉంటుంది. అఘోర మాత్రం ప్రపంచానికి అతీతుడై ఒంటరి లోకాల్లో వుంటాడు.
తమ కళ్లు భౌతికమైన వాటిని మాత్రమే కాక ఇతరుల చూపుకు అందని సూక్ష్మ అంశను కూడా చూస్తాయంటారు అఘోరాలు. వివిధ రూపాల్లో చేసే తాంత్రిక సాధన తమలోని మండలిని శక్తిని తట్టి లేపుతుందని.. అప్పుడు చితిమంటల మీద దేవుళ్లు నాట్యం చేస్తారని నమ్మకంగా చెబుతారు.
అర్థరాత్రి సమయంలో శ్మశానంలో చితిముందు ఒక బండ మీద నగ్నంగా కూర్చొని అఘోర ధ్యానం చేస్తాడు. అప్పుడు అతని కళ్లలో భయం, ముఖంలో సిగ్గు లాంటి లక్షణాలేవీ కనిపించవు. గాలికి అతని పొడ వాటి వెంట్రుకలు తనలోని తాంత్రికశక్తి గురించి చెబుతున్నట్లుగా వేలాడుతుంటాయీ. కుడిచేతిలో కనిపించే కపాలం తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. రుద్రాక్షలను లెక్కిస్తూ ఏదో మంత్రాలను పటిస్తుంటాడు కొన్ని సందర్భాల్లో శవం మీద కూర్చొని ధ్యానిస్తుంటారు. అప్పుడు అతని చుట్టూ ఎముకలు ఉంటాయి. ధ్యానంలోకి దిగే ముందు తనచుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించు కుంటాడు. దీన్ని ‘కిలన’ అంటారు. ధ్యానంలో ఉన్న అఘోర ముందు మూడు పుర్రెలు ఉంటాయి. వాటిని రాజస, తామస, సాత్విక గుణాలకు ప్రతినిధులుగా భావిస్తాడు. అఘోర దగ్గర అడనక్క ఉంటుంది. ఈ నక్క తన సందేశాన్ని శ్మశాన దేవుడికి తీసుకెళుతుందని విశ్వసిస్తాడు.
కఠోర సాధన వల్ల తాము ఎన్నో శక్తులను పొందినట్లు అఘోరాలు చెబుతారు. వారి మహిమలను ఆ నోట ఈ నోట ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో విన్నవారు తప్ప చూసిన వారు లేరు. సాక్ష్యం చెప్పిన వారు కూడా లేరు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles