"హనుమ" ఆరాధన
యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్
ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూంటారో, అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలి ఘటిస్తూ చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల ప్రగాడమైన విశ్వాసం.
యత్రా స్తి భోగో నహి తత్ర మోక్ష:
యాత్రా స్తి మోక్షోనమి తత్ర భోగ:
శ్రీమారుతీస్సేవనం తత్పరాణం
భోగశ్చ, మోక్షశ్చ కరస్తఏవ
(శౌనక సంహిత)
కేవలం భోగాలలోనే కూరుకుని పోతూంటే మోక్షం రాదు.ఇక ముముక్షువులకయితే, భోగాల ప్రస్తక్తి లేదు. కొందరు దేవతలు అయితే,కేవలం భోగాలను మాత్రమె ఇస్తారు.కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆంజనేయస్వామివారు - అటు భోగాల్ని, ఇటు మొక్షాల్ని రెంటినీ ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువుగా, చింతామణిగా చెప్పుకోవచ్చనీ అర్థం.
ఏకో దేవస్సర్వద శ్రీ హనుమా!
నేకోమంత్ర శ్రీ హనుమత్ప్రకాశ:
ఏకో మూర్తి శ్శ్రీహనుమత్స్వరూపా!
చైకం కర్మ శ్రీ హనుమత్సపర్యా.
సత్య పదార్థమైన బ్రహ్మము ఒక్కడే ఉన్నాడ్డు. ఆయనే హనుమ.ఒక్కటే మంత్రముంది. అది శ్రీహనుమన్మంత్రం. ఒకటే మూర్తి ఉంది. ఆయనే హనుమ. ఇక మనం చేయవలసిన పని ఒక్కటేనట! అది హనుమంతుని సేవ వారి పూజ! అని పరాశరుడు మైత్రేయునకు బోధించినట్లు తెలుస్తోంది.
(పరాశర సంహిత)
ఆంజనేయం మహావీరం! బ్రహ్మవిష్ణు శివాత్మకం!
బాలార్క సదృశాభాసం! రామాదూతం నమామ్యహ\మ్.
హనుమ! అంటే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారుడని, వీరుడనగా బ్రహ్మవేత్తయనీ, రామదూత అనగా శ్రీరాముని స్వరూప కథనము చేయువాడనీ, ఇందు స్పష్టంగా తెలియుచున్నది.
ఏ యింట్లో ప్రతీనిత్యం భక్తీ శ్రద్ధలతో పూజిస్తారో! ఆ ఇంట్లో హనుమ యొక్క ప్రభావం వల్ల "మహాలక్ష్మి" స్థిరంగా ఉంటుంది అని చెప్పబడియున్నది.
(సుదర్శన సంహిత)
యిలా మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి" నాడు ఆ స్వామివారికి విశేష పూజలు, శ్రీరామ భజనలు, సుందర కాండ, హనుమాన్ చాలీసా,వంటి పారాయణలు గావించి ఆ 'హనుమ'దేవుని అనుగ్రహపాత్రులవుదాం.
"హనుమజ్జయంతి" సందర్భంగా మిత్రులందరికీ ఆధ్యాత్మిక శుభాభినందనలు అందిస్తూ - నమస్కారం.