*ఫ్రిజ్ క్లీనింగ్ ఇలా...*
ఫ్రిజ్ శుభ్రం చేయాలంటే పెద్ద పనిలా కనపడుతుంది. అందుకని ఆ ఆలోచన వచ్చినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు ఎక్కువమంది. అలా వాయిదా వేసి... వేసి... చివరకి దానిమీద పలు రంగుల్లో, ఆకారాల్లో మరకలు ఏర్పడతాయి. ఇంతవరకు తెచ్చుకోకుండా కొన్ని బేసిక్ సింపుల్ టిప్స్ ఉన్నాయి.
ఫ్రిజ్ డోర్ తెరిచి డేట్ అయిపోయిన, వాడరు అనుకున్న ఆహారపదార్థాలను తీసేయాలి.
పై అరల నుండి కిందకు తుడుస్తూ రావాలి.
బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి క్లీనింగ్ ఏజెంట్‌గా వాడొచ్చు. దీంతో శుభ్రం చేయడం వల్ల ఫ్రిజ్‌కు వాసన పట్టదు.
ఫ్రిజ్ శుభ్రం అయ్యాక క్రమపద్ధతిలో ఆహారపదార్థాలను అమర్చాలి. ఫ్రిజ్‌లో ఉంచే డబ్బాలు, బాక్స్‌లు శుభ్రంగా తుడవాలి. అవసరమయితే పదార్ధాలకు ఉన్న పాత ప్యాకింగ్ తీసేసి కొత్త ప్యాక్ వేయాలి. సింపుల్‌గా ఉన్న ఈ చిట్కాలు అనుసరించి చూడండి. ఇక మీదట ఫ్రిజ్ శుభ్రం చేయడం అంత కష్టంగా అనిపించదు. టైం కూడా పట్టదు.