భార్య - భర్తలు ఎలా వుండాలి ?
పార్వతీ - పరమేశ్వరుల వలె, లక్ష్మీనారాయణుల వలె
సీతా రామచంద్రుల వలె
కలసి మెలసి వుండవలె!!
" వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ (ప) రమేశ్వరౌ!
--- మహాకవి కాళిదాసు
భావము:- వాక్కు నుండి అర్థమును వేరు
చేయలేము కదా ! వాక్కు అర్థము ల వలె
కలసి వుండే పార్వతీ పరమేశ్వరులకు మరియు రమేశ్వరులు అంటే లక్ష్మీనారాయణు
లకు వందనములు !!
భర్త ద్వారా సంతానవతి అయిన స్త్రీ మాత్రమే పరిపూర్ణురాలవుతుంది !!
మరి మగవాడు పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు?
ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి!!
శుక్ల యజుర్వేదం లోని “శథపథ బ్రాహ్మణం” లోని క్రింది మంత్రాన్ని చూడండి!!
" అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి సర్వో భవతి!
సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి " (5.2.1.10)
అర్థం :
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.
కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.
* మనం ఇంకో విషయం గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది.!!
పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడు మాత్రమే పరిపూర్ణతను పొందుతాడని చెప్పబడింది!!
అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది!!
ఆది దంపతుల వలె ఆదర్శ దాంపత్య
జీవితాన్ని సాధించి ఆదర్శ హిందూ కుటుంబ
జీవనాన్ని అలవరచుకుందాము !!
శుభమ్ భూయాత్