రుద్రాధ్యాయములోని రెండవ అనువాకమునందలి 7 వ యజుస్సును నేర్చుకుని తదర్థమును గ్రహించి రుద్రార్చన చేసి తరింతుముగాక...............
యజుస్సు 7.
" నమోరుద్రాయా உஉతతావినేక్షేత్రాణాంపతయేనమః. "
మంత్రార్థము:-
క్షేత్రములకు అనగా సకల శరీరములకు. పుణ్యక్షేత్రములకు పాలకుడైనట్టియు, విస్తరింపబడినవైనవై, ధనుస్సులవలె నున్న తన కరములతో రక్షించునట్టి రుద్రునకు నమస్కారమగు గాక...............
8 వ యజుస్సును, ఉదాత్తానుదాత సహితముగా నేర్చుకుని తదర్థమును గ్రహించి, శివార్చన చేసి తరిద్దాము
8 వ యజుస్సు ( మంత్రము) :-
" నమస్సూతాయాஉహంత్యా య వనానాంపతయేనమః. "
అర్థము:-
సకల జీవ కోటుల సంసార రథములకు సారథియైనట్టి, శత్రువులను సంహరించుటలో,సమర్థుడైనట్టి, అరణ్యములకు పాలకుడై నట్టి రుద్రునకు నమస్కారమగునుగాక.................
Author: sandhehalu - samadhanalu