పశువుల పేడను పారబోయకండి.. పొలాల్లో ఎరువుగా వాడొచ్చు.. లేదంటే ఎండబెట్టి పిడకలుగా చేసుకోవచ్చు.
పాత వస్త్రాలను వృథాగా విసిరేయకండి.. వాటితో బొంతలు కుట్టుకోవచ్చు.. నీళ్లగది దగ్గర కాళ్లు తుడుచుకోడానికి ఉపయోగించొచ్చు..
మిగిలిపోయిన అన్నాన్ని పారేయకండి. పొద్దున్నే చద్దన్నంలా తినొచ్చు.. లేదంటే ఎండబెట్టి ఒరుగులుగా పెట్టుకోవచ్చు.
ఇవన్నీ అమ్మమ్మలు, ముసలమ్మలు ఇచ్చే సలహాల్లా కనిపిస్తున్నాయా?
కాదు కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న సలహాలివి. నిజం...
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమో, పేదరికమో కాదు! చెత్త నిర్వహణే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య. జనాభా పెరిగిపోతుండడం.. వినియోగతత్వం పెరగడం.. నగరాలు విస్తరిస్తుండడంతో చెత్త కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. పంచాయతీల నుంచి పారిశ్రామిక నగరాల వరకు ఇదో పెద్ద సమస్య అయి కూర్చుంది. అందుకే వీలైనంత వరకు వృథాను తగ్గించడం.. చెత్తలోకి వెళ్లిపోకుండా పునర్వినియోగానికి మళ్లించడంపై అన్ని దేశాలూ దృష్టి పెడుతున్నాయి.
దేనినీ పారేయకండి..
* ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారధాన్యాల్లో మూడోవంతు వృథా అవుతున్నాయని, దీనిని వీలైనంత వరకు తగ్గించాలని ప్రపంచబ్యాంకు వివిధ దేశాలకు నిర్దేశించింది.
* కాలంచెల్లిన ఆహార పదార్థాలను పారేయడాన్ని ఫ్రాన్స్ పూర్తిగా నిషేధించగా ఇటలీ అదేబాటలో నడుస్తోంది. కాలం తీరకముందే గుర్తించి వినియోగదారులకు చౌకధరలకు విక్రయించడం కాని, పేదలకు ఉచిత సరఫరా కోసం ధార్మిక సంస్థలకు పంపాలి లేదంటే ఎరువుగా వినియోగించడానికి రైతులకు పంపిణీ చేయాలే తప్ప ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకూడదు ఇక్కడ.
* అమెరికా, ఐరోపా దేశాలు హోటళ్లు, దుకాణాల్లో కాలం తీరిపోతున్న దశలోని ఆహార పదార్థాలను
Tuesday, 31 January 2017
చెత్తతో కొత్త వైద్యం?
Author: sandhehalu - samadhanalu
Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ