ఈ మధ్య కాలంలో పిల్లలు స్థిర పడే దాకా పెళ్లిళ్లు వాయిదా వేస్తుంటారు. స్థిరపడే అనే దానికి పూర్తి నిర్వచనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సెలవిస్తారు వాళ్లకి అనుగుణంగా. కానీ స్థిరపడే సరికి అమ్మాయి/అబ్బాయి వయసు ఎంతకీ చేరుతున్నారు, వారిలో బాహ్యంగానూ అంతర్గతంగాను ఏమేమి మార్పులకి లోనవుతున్నారు, వాటి దుష్పరిణామాలు ఏమిటి మొదలైనవి ఇంకా ఆలోచించటానికి ఇటు పెద్దలు మరియు పిల్లలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దాని పర్యవసానమే పిల్లల పెళ్లిళ్లు ఆలస్యమవటము, బాధపడటం (పిల్లలు మరియు తల్లి తండ్రులు) మిగులుతోంది. ఇంకా చెప్పాలంటే మన బ్రాహ్మల డాక్టర్ (గైనకోలోజిస్ట్) చెప్పుకుని బాధపడింది. ఈ కాలం ఆడ పిల్లలు ఉద్యోగం, స్థిరపడటం మొద// వంటి కారణాలతో, సరియైన ఆహారం తీసుకోక, ఏవి పడితే అవి తినేసి, సరియైన నిద్ర లేక, ఒక పక్క ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు, వీటన్నిటివల్ల వాళ్ళల్లో ఎప్పుడో వచ్ఛే మెనో పాజ్ ముందు గానే వచ్చ్చేస్తోంది. పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవటంతో చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇవన్నీ కాకుండా మునుపు ఆడది 28 నుండి 30 సం .కి పిల్లలకి జన్మనివ్వడము అన్నీ అయిపోయేవి. కానీ ఇప్పుడు 30 సం .కి. పెళ్లి అంటే ఏమవుతుంది చాలా అవస్థలు మనోవేదన ఇటు పిల్లకి అటు పెద్దలకి. ఇప్పటికైనా పిల్లలు పెద్దలు పునరాలోచించుకుని సరైన మార్గాన్ని ఎంచుకుని నిర్ణయాలు మార్చుకుంటే సుఖ సంతోషాలు ఉంటాయి. ఇవి ఏ ఒక్కరినో ఉద్దేశించి రాసినవి కావని నా మనవి. తప్పుగా అర్ధం చేసుకోకుండా సహృద్భావముతో తీసుకోండి.
ఎవరికైనా సాధారణంగా 20 - 21 సంవత్సరాలకి డిగ్రీ అయిపోతుంది, పిజీ అయ్యేసరికి 23 నిడుతాయి (మెడిసిన్ చదువు విషయంలో తప్ప). మగపిల్లలకైతే వుద్యొగం వచ్చేవరకు ఆగాలి కాని ఆడపిల్లల విషయం అవసరం లేదు, వాళ్ళు పెళ్ళి అయినతరువాత ఎక్కడికివెడితే అక్కడ కావాలనుకుంటె ఉద్యొగం చేసుకొవచ్చు లేకపొతె వూరుకొవచ్చు. అయినా వాల్లకి వెంటనే వుద్యొగాలొస్తె జాయిన్ అవుతున్నరు. అదీ మంచిదే, కాని వాళ్ల్చేత వుద్యొగాలు చేయిస్తూ అలాగే వుండిపొతూ సంభందాలు చూడ్డం మర్చిపోతున్నారు కొందరు, కొందరు బాగా ఆలస్యం చేస్తున్నారు. ఆందరికి బిటెక్కు ఎంటెక్కు ఎంబిఏలే కావాలి, వాళ్ళ ద్రుష్టిలో మిగిలినవి సరి అయిన క్వాలిఫికేషన్లు కావు. ఇంచుమిచుగా ఆందరికి యు ఎస్, ఆస్ట్రేలియా సంభందాలే కావాలి. ఈడు-జోడు తో పనిలేదు. పిల్లలు ఎంతకాలం జాబ్చేస్తూ ఇంట్లోవుంటే అంతకాలం జీతం వస్తుంది, పెళ్ళిచేస్తే ఏమొస్తుంది ఖర్చు తప్ప. ఇటువంటి ఆలోచనలు ఎక్కువైపొయి (ఆందరికి కాదు కాని చాలమందికి) పెళ్ళిల్లు ఆలస్య మవుతున్నాయి. తరువాత లాంగ్ లైఫ్లో పిల్లలు అనుభవించె పరిణామాలు చూడ్డానికి తల్లితండ్రులు వుండరుగా, అందుకే ఇప్పుడు ఇలాచేస్తున్నరు.