పెరుగుతున్న ముదురు వివాహాలు30 దాటిన తర్వాతే ఆలోచిస్తున్న యువతసకాలంలో పెళ్లి చాలా అవసరంస్థిరపడ్డాక అనుకుంటే అసలుకే మోసంఆలస్యమైతే హార్మోన్ల అసమతుల్యతసంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం
గతంతో ఓ వయసు వచ్చేసరికి పిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. జీవితంలో స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆడ, మగ అన్న వ్యత్యాసం లేకుండా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎక్కువ మంది 30 వస్తే కాని పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. లేటు వివాహ ప్రభావం సంతాన ఉత్పత్తిపై పడుతోంది. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లలో మార్పులతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటోంది. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో కుస్తీ, నిద్రలేమి తదితర కారణాలతో సంతాన సాఫల్య సామర్థ్యం దెబ్బతింటోంది.
గుంటూరు (నల్లచెరువు): మానవ జీవితం శరీరంలోని హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో హార్మోన్ల విడుదల క్రమబద్ధంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైతే హార్మోన్ల విడుదల అసమతుల్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఏర్పడిన సమస్యలు, ఒత్తిడి వంటి కారణాలతో హార్మోన్‌ల సమతుల్యం దెబ్బతింటోంది. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో కుస్తీ, స్కూటస్ టెంపరేచర్, నిద్రలేమి తదితర కారణాలతో వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతాన సాఫల్య సామర్థ్యం దెబ్బతింటోంది. సాధారణంగా పురుషుడి వీర్యంలో ఒక మిల్లీ లీటరకు 130 మిలియన్ల శుక్రకణాలు ఉండాలి. వీటి సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. డబ్ల్యుహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం శక్ర కణాల సంఖ్య 105 మిలియన్లకు తగ్గినట్లు తేలింది. ఈ అంశం కూడా సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచీకరణ పాపం
ప్రపంచీకరణ పుణ్యమాని జీవితం ఉరుకుల పరుగల మయంగా మారింది. ఉద్యోగ�