గురువులు
-------------------
అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని..
కోపగిOచుకున్నప్పుడు తెలియలేదు
నాపై బాద్యతను పెంచుకుంటున్నారని...
చేతిమీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతలకి పదును పెడుతున్నారని....
ప్రశ్నలడిగినప్పుడు తెలియలేదు
ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని....
పరీక్ష పెట్టినప్పుడు తెలియలేదు
నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని....
మార్కులిస్తున్నప్పు తెలియలేదు
నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని....
కానీ
ఈ క్షణం తెలుస్తుంది
నాలో ఒక విశాలప్రపంచాన్నే స్రుష్టిOచారని
ఒక మహా శక్తిగా మలిచారని....
కాలం వెనక్కి వెళితే
మీతో మళ్ళీ దెబ్బలు తింటాం
మీ అనురాగానికి పాత్రులమవుతాO.
ఆచార్యదేవోభవ