Tuesday 31 January 2017

తాళపత్ర గ్రంధంలోని రహస్యాలు తెలుసా ?

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు  చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

చెవులు ఎందుకు కుట్టిస్తారు?
ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింప చేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపుశక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్యవిధానం చెవికుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచి దని చెబుతోంది.

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?
ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలూ ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి.

గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?
వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గర్తుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదువవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాల మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.

అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు?
పూర్వం కొడుకుని సరయినదారిలో పెట్టకపోతే, సంవత్సరకాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది శిక్షతో సమానము. తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. అలాగే చెడిపోయి చేల్లెలింటికి వెళ్ళరాదు. ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనమూ ఆశిస్తుంది. అటువంటి చెల్లిలి ఇంటికెళ్ళి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతారు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తగారింటిలో ఉన్న చెల్లి కూడా!

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles