శివుని వాహనం నంది గో సంతతి
నంది లేని శివాలయం లేదు
గోక్షిరం లేనిదే శివాభిషేకం కాదు
విభూతి నిర్మాణం ఆవు పేద తోనే చెయ్యాలి
విభూతి తో శివాభిషేకం ఐశ్వర్యప్రదం
విభూతి ధారణ యిచ్చు ఆయువృద్ది
గోవు నుదుట శివుడున్నాడని శాస్త్ర వాక్యం
శివుని వాహనం నంది కైలాసానికి తీసుకుపోతే
యముని వాహనం దున్నపోతు యమలోకానికి తీసుకుపోతుంది.
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర.
నందుడి కోసం వెలసిన శివుడు ( మహానంది క్షేత్ర వైశిష్ట్యం)
.
శివుడు భక్తసులభుడు. భక్తితో కొలిస్తే ఇట్టే ప్రత్యక్షమై కోరిన కోర్కెలు తీరుస్తాడనికదా అందరి విశ్వాసం. అలానే మహానందిలో నందీశ్వరుడికోసం అక్కడ వెలసిన మహాశివుడి వృత్తాంతం ఆ క్షేత్ర ప్రాభవాన్ని వివరిస్తుంది.
ఒకానొక కాలంలో శిలాదమహర్షి తనకు సంతానం లేదని ఎంతో ఖేదం అనుభవించేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేయువారెవరూ లేరని నిశ్చయించుకొన్నాడు. వెనువెంటనే పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.
అట్లా తన్ను గూర్చి తపస్సు ఆచరించే శిలాదుణ్ణి చూచిన కైలాసవాసుడు కరిగిపోయి ‘‘ఏమి నీకోరిక శిలాద!’’ అని ప్రశ్నించగా నీకు తెలియంది నాకు తెలిసింది ఏముంది...స్వామీ, నిన్ను పూజించేవారు నిన్ను మెప్పించే శక్తియుతులైన వారిని నీ ప్రసాదంగా నాకు అనుగ్రహించు. వారసులు లేరనేదుఃఖాన్ని నుంచి నన్ను కాపాడుము అని వేడుకొనే శిలాదుణ్ణి చూచి శివుడు ‘నీకోరిక ఫలించుగాక’ అని అభయం ఇచ్చాడు.
శివుని అభయంతో పరిపూర్ణానందాన్ని కోరుకొంటూ ఆనందంగా కాలం గడపసాగాడు శిలాదమహర్షి. కొన్నాళ్లకు కాలం కరుణించి శివుని వరాన్ని శిలాదుడు అందుకొన్నాడు. తన సంతానంగా పర్వతుడు, నందుడు అనే కుమారులను పొందాడు. వారు దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడే శివభక్తిని వారిలో శిలాదుడు నాటించాడు.
నందుడికి ఎల్లప్పుడు శివుని ఎదురుగా ఉండాలన్న అభిలాష కలిగింది. తన తండ్రికి తన కోరికను తెలిపాడు. తండ్రి అనుమతితో శివుని గూర్చి తపస్సు ఆరంభించి ఏన్నో వేల యేండ్లు ఆ తపస్సులోనే మునిగిపోయాడు. ఆ నందుని కఠిన తపస్సుకు అచంచల భక్తివిశ్వాసాలకు మెచ్చుకున్న పార్వతీ ప్రియుడు నందుని ఎదుటకు వచ్చి కోరిక ఏమిటో తెలుపమని అడిగాడు.
రూపు కట్టిన ఆనందమే తన ఎదుట పడగా ‘స్వామీ ఎల్లప్పుడూ ఈ ఆనందమూర్తిని నేను కాంచాలన్న కోరిక మెండుగా ఉన్నది. పైగా నీ పాద ద్వయాన్ని నేను మోసే భాగ్యాన్ని నాకు కల్పించండి ’ అని నందుడు శివుని ముందు మోకరిల్లాడు. శివుడు ‘‘ఓ నందా! నీవే నా వాహనమవుదువుగాక! అంతేగాక నీవు చేసిన ఈ ఘోర తపస్సును పలుకాలాలు జనం అంతా గుర్తుపెట్టుకొనేట్లుగా ఈ తపోభూమిలోనే నేను ఆర్చామూర్తినై వెలుస్తాను. ’’ అని శివుడు అనుగ్రహించాడు.
అది విన్న నంది మహోత్సాహంతో తన తండ్రికి ఈ విషయాన్ని తెలియచేశాడు. అట్లా ఏర్పడిన స్థలమే నేడు మహానందిక్షేత్రంగా భాసిల్లుతోంది. స్వామి నిలిచిన ఆలయానికి శివగణాల్లో ఒకరైన రససిద్ధుడనే యోగిపుంగవుడు విమానగోపురాన్ని కూడా నిర్మించి ఇచ్చాడట. ఆ ఆర్చామూర్తిగా వెలసిన పరమశివుడే మహానందీశ్వరునిగా వెలుగులీనుతున్నాడు. ఇదంతా కృతయుగంనాటి సంగతి.
ఈ కలియుగంలోనూ నంది మండలాన్ని నందన రాజు అనే ఒక పురుషోత్తముడు పాలించేవాడు. ఆ రాజుకు చెందిన ఆవులల్లో ఓ ఆవు రోజు పాలివ్వకుండా ఉంటోందని ఆ ఆవును కాచే గోపకుడు గ్రహించాడు. ఎందుకీ గోవు పాలివ్వడం లేదో నని ఆ ఆవువెంటే తాను జాగ్రత్తగా తిరిగాడోరోజు. ఆ గోవు ఇంటినుంచి వెడలిన వెంటనే చక్కగా వెళ్లి వెళ్లి ఓ పుట్టదగ్గర నుంచుని ఆ పుట్టలోపలికి ధారాపాతంగా తన పొదుగునుంచి పాలను విడుస్తోంది. ఈ సంగతి చూసిన గోపకుడు ఆశ్చర్యానందాలకు లోనయి వెనుతిరిగి ఈ సంగతిని నందన మహారాజుకు ఎరుకపర్చాడు. ఆ రాజు కూడా ఆనందోత్సాహంతో ఆ వింతమేమిటో అక్కడే మహాత్ముడున్నాడో నన్న ఆతురతతో గోపబాలకుని వెంట వెళ్లాడు. వీరంతా వచ్చిన అలకిడి కి గోపు తత్తరపాటుతో పుట్టపై కాలు కదిపి బెదరుతూ పక్కకు వెళ్లిపోయింది. దీనితో రాజు మనసున కలత చెంది తాను తప్పు చేశానని వెనుతిరిగాడు. ఆ రాత్రి మహాశివుడు నందన మహారాజు కలలో కనపడి తాను ఆ పుట్టలోనే ఉన్నానని తనకు అనువైన మందిరాన్ని నిర్మించమని, అర్చనాదికాలు జరిపించమని ఆదేశించాడు. దిగ్గున లేచిన నందనుడు తనకు పట్టిన అదృష్టయోగాన్ని పలుమార్లు స్మరించుకొని తన వారితో ఈ విషయాన్నంతా చెప్పాడు. వారంతా సంతోషిస్తూ ఆ పుట్ట చెంతకు వెళ్లి అక్కడ వెలసిన స్వామివారిని దర్శించుకొని ఆనందించారు. శివాజ్ఞమేరకు నందన రాజు అక్కడ శివాలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఆ పుట్టరూపంలోని మహా నందీశ్వరునిగా పేరుగాంచిన పరమేశ్వరునికి అర్చనాదికాలు జరుపుతూనే ఉన్నారు. నేడు కూడా మహానంది క్షేత్రంలో నందీశ్వరుణ్ణి వివిధోపచారాలతోశివభక్తులు సేవిస్తారు.