Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Friday 2 December 2016

మార్గశిర లక్ష్శీవార వ్రత కధ

   
        
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  అత్త గారి ఇంట మహదైశ్వైర్యవంతులు అయ్యారు.పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల  ఒకకర్రను దోలిఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రను మరచి వెళ్ళిపోయాడు. ఆ కర్రను ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా కర్రను ఏక్కడో మరచి పొయాను అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకు వస్తుండగా సాయంసమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్థి(రాత్రి పూట మిగిలిన అన్నం)అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా వుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా వుండమని ఒక దగ్గర కదలకుండ కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మకు స్నానం చేసిరమ్మని,తొందరగా పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తన కోంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లికి వెంబడి వుండి స్నానం చెయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. అమ్మ దేవి మీరు అలా వెళ్ళిపోతున్నారు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, నిమ్మనం, మూడవ వారం అప్పాలు, పాయసము, నాల్గవ వారం పులిహొర, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చెయించింది. కధ విని అక్షింతలు తలమీద వేసుకున్నది అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధా లోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. కావున ప్రతి వనిత ఈ వ్రతంను ఆచరిస్తే ఈ కధలో సుశీల వలె పుట్టింటికి,మెట్టినింటికి ఆ...మహాలక్ష్శీ అనుగ్రహించి అంత్యమందు విష్ణు సన్నిధికి చేరుకుందురు.

అది ద్వాపరయుగం




ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు. అన్నాడు. అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం
అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం
మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ
ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ
అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది.
తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో
జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ 
Source: Sathya sai speaks volume 1

విద్యార్థులకు ఉపయోగపడే పోస్ట్..!!

Image result for maths formulas
(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα
1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α

» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
"భేష్"..

9th,10th,11th,12th వరకు గణితంలో అన్ని ఫార్ములాలు ఉన్నాయి...
దయచేసి అందరి పిల్లల పేరెంట్స్ కి share చేయండి...
ఇంకా చాలా ఉపయోగకరమైన విషయాలు క్రింద పొందుపరచబడినవి..
తప్పకుండ చదవగలరు.. 
B. A. — Bachelor of Arts
M. A. — Master of Arts
B. Sc. — Bachelor of Science
M. Sc. — Master of Science
B. Sc. Ag. — Bachelor of Science in
Agriculture
M. Sc. Ag. — Master of Science in Agriculture
M. B. B. S. — Bachelor of Medicine and Bachelor of Surgery
M. D. — Doctor of Medicine
M. S. — Master of Surgery
Ph. D. / D. Phil. — Doctor of Philosophy (Arts & Science)
D. Litt./Lit. — Doctor of Literature / Doctor of Letters
D. Sc. — Doctor of Science
B. Com. — Bachelor of Commerce
M. Com. — Master of Commerce
Dr. — Doctor
B. P. — Blood Pressure
Mr. — Mister
Mrs. — Mistress
M.S. — miss (used for female married & unmarried)
Miss — used before unmarried girls)
M. P. — Member of Parliament
M. L. A. — Member of Legislative Assembly
M. L. C. — Member of Legislative Council
P. M. — Prime Minister
C. M. — Chief Minister
C-in-C — Commander-In-Chief
L. D. C. — Lower Division Clerk
U. D. C. — Upper Division Clerk
Lt. Gov. — Lieutenant Governor
D. M. — District Magistrate
V. I. P. — Very Important Person
I. T. O. — Income Tax Officer
C. I. D. — Criminal Investigation Department
C/o — Care of
S/o — Son of
C. B. I. — Central Bureau of Investigation
G. P. O. — General Post Office
H. Q. — Head Quarters
E. O. E. — Errors and Omissions Excepted
Kg. — Kilogram
Kw. — Kilowatts
Gm. — Gram
Km. — Kilometer
Ltd. — Limited
M. P. H. — Miles Per Hour
KM. P. H. — Kilometre Per Hour
P. T. O. — Please Turn Over
P. W. D. — Public Works Department
C. P. W. D. — Central Public Works Department
U. S. A. — United States of America
U. K. — United Kingdom (England)
U. P. — Uttar Pradesh
M. P. — Madhya Pradesh
H. P. — Himachal Pradesh
U. N. O. — United Nations Organization
W. H. O. — World Health Organization
B. B. C. — British Broadcasting Corporation
B. C. — Before Christ
A. C. — Air Conditioned
I. G. — Inspector General (of Police)
D. I. G. — Deputy Inspector General (of Police)
S. S. P. — Senior Superintendent of Police
D. S. P. — Deputy Superintendent of Police
S. D. M. — Sub-Divisional Magistrate
S. M. — Station Master
A. S. M. — Assistant Station Master
V. C. — Vice-Chancellor
A. G. — Accountant General
C. R. — Confidential Report
I. A. S. — Indian Administrative Service
I. P. S. — Indian Police Service
I. F. S. — Indian Foreign Service or Indian
Forest Service
I. R. S. — Indian Revenue Service
P. C. S. — Provincial Civil Service
M. E. S. — Military Engineering Service
Full Form Of Some technical Words
VIRUS - Vital Information Resource
UnderSeized.
3G -3rd Generation.
GSM - Global System for Mobile
Communication.
CDMA - Code Divison Multiple
Access.
UMTS - Universal MobileTelecommunication
System.
SIM - Subscriber Identity Module .
AVI = Audio Video Interleave
RTS = Real Time Streaming
SIS = Symbian
OS Installer File
AMR = Adaptive Multi-Rate Codec
JAD = Java Application Descriptor
JAR = Java Archive
JAD = Java Application Descriptor
3GPP = 3rd Generation Partnership Project
3GP = 3rd Generation Project
MAA=Mehboob Anwar Ansari
MP3 = MPEG player lll
MP4 = MPEG-4 video file
AAC = Advanced Audio Coding
GIF= Graphic InterchangeableFormat
JPEG = Joint Photographic Expert Group
JPEG = Joint Photographic Expert Group
BMP = Bitmap
SWF = Shock Wave Flash
WMV = Windows Media Video
WMA = Windows Media Audio
WAV = Waveform Audio
PNG = Portable Network Graphics
DOC =Document (MicrosoftCorporation)
PDF = Portable Document Format
M3G = Mobile 3D Graphics
M4A = MPEG-4 Audio File
NTH = Nokia Theme (series 40)
THM = Themes (Sony Ericsson)
MMF =
Synthetic Music Mobile Application File
NRT = Nokia Ringtone
XMF = Extensible Music File
WBMP = Wireless Bitmap Image
DVX = DivX Video
HTML = Hyper Text Markup Language
WML =
Wireless Markup Language
CD -Compact Disk.
☀ DVD - Digital Versatile Disk.
☀ CRT - Cathode Ray Tube.
☀ DAT - Digital Audio Tape.
☀ DOS - Disk Operating System.
☀ GUI -Graphical
User Interface.
☀ HTTP - Hyper Text Transfer Protocol.
☀ IP - Internet Protocol.
☀ ISP - Internet Service Provider.
☀ TCP - Transmission Control Protocol.
☀ UPS - UninterruptiblePower Supply.
☀ HSDPA -High Speed Downlink PacketAccess.
☀ EDGE - Enhanced Data Rate for
☀ GSM- [GlobalSystem for Mobile
Communication]
Evolution.
☀ VHF - Very High Frequency.
☀ UHF - Ultra High Frequency.
☀ GPRS - General
PacketRadio Service.
☀ WAP - Wireless ApplicationProtocol.
☀ TCP - Transmission ControlProtocol.
☀ ARPANET - Advanced Research Project
Agency Network.
☀ IBM - International Business Machines.
☀ HP - Hewlett Packard.
☀ AM/FM - Amplitude/ Frequency Modulation: whatsapp ke itihaas me pahli baar....kaam ka msg.........
Here are Toll Free numbers in
India .....very very useful...!!!!
Airlines
Indian Airlines - 1800 180 1407
Jet Airways - 1800 225 522
Spice Jet - 1800 180 3333
Air India - 1800 227 722
Kingfisher -1800 180 0101
Banks
ABN AMRO - 1800 112 224
Canara Bank - 1800 446 000
Citibank - 1800 442 265
Corporation Bank - 1800 443 555
Development Credit Bank - 1800
225 769
HDFC Bank - 1800 227 227
ICICI Bank - 1800 333 499
ICICI Bank NRI -1800 224 848
IDBI Bank -1800 116 999
Indian Bank -1800 425 1400
ING Vysya -1800 449 900
Kotak Mahindra Bank - 1800 226
022
Lord Krishna Bank -1800 112 300
Punjab National Bank - 1800 122
222
State Bank of India - 1800 441 955
Syndicate Bank - 1800 446 655
Automobiles
Mahindra Scorpio -1800 226 006
Maruti -1800 111 515
Tata Motors - 1800 255 52
Windshield Experts - 1800 113 636
Computers / IT
Adrenalin - 1800 444 445
AMD -1800 425 6664
Apple Computers-1800 444 683
Canon -1800 333 366

Thursday 1 December 2016

మోహినీ -- భస్మాసురా కథ


భస్మాసురుడు -          మోహినీ

భాస్మాసురుడిని అంతమొందించడానికి మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు
ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపమిచ్చినప్పుడు శాపంగానూ, వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం. కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారుతాయి. శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి. అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మీరు చదివి తెలుసుకోవాల్సిందే. కథేంటంటారా..వరాన్ని, శాపంగా మార్చుకొన్నబస్మాసుర కథ.. ఎలాగో కథ చదవండి... 



మోహినీ అందానికి పరవశుడైన భాస్మాసుర

హిందూ పురాణాలలో భాస్మసురిని కధలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు, రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైనవారైతే, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు.

పురాణాల ప్రకారం, అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని. భస్మాసురుని కధ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు.

భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు, కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భాస్మసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే, వెంటనే కాలిపోయి, బూడిద (భస్మ) అవుతాడు. అది అతని డిమాండ్. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.

భస్మాసురుడు చాలా సంతోషించి, అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు.

వెంటనే శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి, శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు.

శివుడి సమస్యను విని, మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణు మూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి, ముందు దయ్యంగా కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే, భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడౌతాడు.

భస్మాసురుడు, మోహినిని పెళ్ళిచేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం, నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్ళను పెళ్లిచేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు ;అందుకు అంగీకరించి, నృత్యం ప్రారంభిస్తాడు.

భస్మాసురుడు, మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు, వెంటనే అతను కాలి, బూడిదైపోయాడు, తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు.

ఈ కధకు సంబంధించి కొద్ది తేడాలు ఉన్నాయి. కానీ కధ సారాంశంలో తేడాలేదు. "కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు" అన్న నానుడి ఈ కధ ఆధారంగా పుట్టింది. తనపన్లు తనకే ఎదురుతిరిగి, విధ్వంసకరంగా మారే లక్షణాన్ని ఇది సూచిస్తుంది.                       

                                                           🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

Monday 23 May 2016

చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అస్త్రాలు.

Beautiful lines from Mahaa Kavi Sri Sri,
Motivate Your Self.
కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.

Monday 30 November 2015

సభలలో కవిత్వం సోంపు !

సభలలో కవిత్వం సోంపు !
( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)
"చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్."

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles